14, నవంబర్ 2010, ఆదివారం
ప్రభుత్వంతో పారామెడికల్ సిబ్బంది చర్చలు విఫలం
హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్‌తో పారామెడికల్ సిబ్బంది ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో పారామెడికల్ సిబ్బంది మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని వారు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు వారు ఈ ఉదయం మంత్రి దానం నాగేందర్‌తో భేటీ అయ్యారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి