కొలంబో: భారీ వర్షాల కారణంగా శ్రీలంక రాజధాని కొలంబోను వరదలు ముంచెత్తుతున్నాయి. గురువారం పడిన భారీ వర్షం కారణంగా రాజధాని కొలంబో, పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 36 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. 18 ఏళ్లల్లో కొలంబోలో ఇదే అత్యధిక వర్షపాతమని ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. మరిన్ని వర్షాలు కొలంబోను ముంచెత్తవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం కురిసిన వర్షాల కారణంగా పార్లమెంటు భవనం జలమయమయింది. ప్రజాప్రతినిధులు, సిబ్బందిని సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గురువారం జరగాల్సిన సమావేశాలను రద్దు చేశారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి