13, నవంబర్ 2010, శనివారం
ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు కాలేదు
హైదరాబాద్, : ఇంటర్ వార్షిక పరీక్షల తేదీలు ఇంకా ఖరారు కాలేదని మాధ్యమిక విద్యా మంత్రి మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. తనకు తెలియకుండా బయటికి వెల్లడైన పరీక్ష తేదీల షెడ్యూల్ అధికారికమైనది కాదని స్పష్టం చేశారు. తాను గుంటూరులో ఉన్నానని, ఇంటర్ బోర్డుకు చైర్మన్, మాధ్యమిక విద్యా మంత్రి అయిన తనకు తెలియకుండానే పరీక్ష తేదీలు ఖరారైనట్లు వచ్చిన ప్రచారం తనకు ఆశ్చర్యం, అసహనం కలిగించిందన్నారు. పరీక్ష తేదీలపై నిర్ణయం తీసుకొని త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి