13, నవంబర్ 2010, శనివారం
విశాఖలో కత్తులతో బెదిరించి హుండీ చోరీ
విశాఖపట్నం: గాజువాక ఆర్టీసి బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో గతరాత్రి చోరీ జరిగింది. దొంగలు కత్తులతో వాచ్‌మెన్‌ను బెదిరించి హుండీ పగులగొట్టి నగదు మూటగట్టుకుని పోయారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు క్లూస్‌టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పాత నేరస్తులతో ఫింగర్ ప్రింట్స్ సరిపోల్చి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తామని పోలీసులు తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి