13, నవంబర్ 2010, శనివారం
బీహార్‌లో మందుపాతర పేలుడు: ఒకరి మృతి
పాట్నా: బీహార్ రోహ్‌టస్ జిల్లాలోని బౌలియా ప్రాంతంలో ఓ కల్వర్టు వద్ద మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో నక్సలైట్‌గా భావిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. సుమారు 75 మంది మావోయిస్టులు ఈ పేలుడు ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆరోవిడత ఎన్నికలు జరగనున్న చెనారీ నియోజకవర్గం పరిధిలో మావోయిస్టులు ఈ పేలుడుకు పాల్పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు అడవిలో మావోయిస్టుల కోసం కూంబింగ్ మొదలుపెట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి