13, నవంబర్ 2010, శనివారం
బాలల ఆరోగ్య పరిరక్షణకు నేటి నుంచి అమలుకానున్న కొత్తపథకం
హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు నేటి నుంచి కొత్తపథకం అమల్లోకి రానుంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్ బాల ఆరోగ్య రక్ష పేరిట నూతన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రోశయ్య ఈ సాయంత్రం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. దీనిద్వారా వచ్చే నాలుగైదు నెలల్లో 85 లక్షల మంది పిల్లలకు పూర్తిస్థాయిలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. అనారోగ్యంతో బడికి దూరమయ్యే బాలలకు వైద్యసాయం అందించడం, డ్రాపౌట్లను నివారించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీనికోసం ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం నుంచి రూ. 10.83 కోట్లు కేటాయించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి