( చోడవరం): పాడి రైతులు, పేద రైతుల ఆరోగ్య ప్రదాయని విశాఖ డెయిరీ ఆసుపత్రి కొత్త సొగసులు సంతరించుకుంటోంది. కార్పొరేట్ స్థాయిలో దీనిని ఆధునికీకరణ చేస్తారు. ప్రస్తుతమున్న పడకలను 400 వరకు పెంచాలని నిర్ణయించారు. ఇందుకు రూ. 7 కోట్ల వ్యయం చేయనున్నట్లు డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు తెలిపారు. డెయిరీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రి స్థాయిని అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. అన్ని వైద్య సదుపాయాలు అందించడంతో పాటు సెంట్రల్ ఏసీ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఈ పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. గుండె జబ్బులకు సంబంధించి కేర్ వంటి ఆసుపత్రులకు వెళ్లకుండా డెయిరీ ఆసుపత్రిలోనే హృద్రోగులకు సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు.ఆసుపత్రిలో ఆయుర్వేద కంటి ఆసుపత్రి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డెయిరీ ఛైర్మన్ తులసీరావు తెలిపారు. ఈ నెల 20న ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తుందన్నారు. కంటి రోగులు ముందుగా తమ పేరును 9966361262 నెంబరుకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దూర ప్రాంతాలనుంచి వచ్చే కంటి రోగులకు 20 శాతం సబ్సిడీతో ఆయుర్వేద కంటి మందులను అందిస్తారన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి