వరంగల్: కాంగ్రెస్ వార్షిక ఉత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం జిల్లాకు వస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా 3.40 గంటలకు హసన్‌పర్తిలోని కిట్స్ కళాశాల ఆవరణలో దిగుతారు. ఇక్కడ 3.50 గంటల వరకు ప్రభుత్వ అధికారులు, అనధికారులతో భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే వరంగల్-హైదరాబాద్ 202 జాతీయ రహదారి విస్తరణకు రూ.38 కోట్లతో చేపట్టిన పనులను, బీసీ సంక్షేమ శాఖ నిర్మించిన హాస్టల్ భవానాన్ని ప్రారంభిస్తారు. 4.10 గంటలకు కరీంనగర్ రోడ్డులోని జీఎంఆర్‌గార్డెన్‌కు చేరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వార్షిక ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి 5.10 గంటలకు కిట్స్ కళాశాలకు చేరుకుని 5.15 గంటలకు హైదరాబాద్ వెళ్తారు. ఇందు కోసం కిట్స్ కళాశాల ఆవరణలో నిర్మాణం చేపట్టిన హెలిప్యాడ్, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ ఎన్.శ్రీధర్, అర్బన్ జిల్లా ఎస్పీ జె.ప్రభాకర్‌రావు పరిశీలించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జీఎంఆర్ గార్డెన్‌లో డీసీసీ అధ్యక్షుడు గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు జిల్లాలోని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి