తిరుపతి: శ్రీ విద్యానికేతన్ త్వరలో యూనివర్సిటీ గా రూపాంతరం చెందనుందని శ్రీ విద్యానికేత న్ విద్యాసంస్థల చైర్మన్, సినీనటుడు మోహన్‌బాబు తెలిపారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థ ల్లో శనివారం జరిగిన 18వ క్రీడోత్సవాల్లో పాల్గొ న్న ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైన అన్ని రకాల విద్యా సౌకర్యాలు ఇక్కడ ఉన్నందున శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీగా మార్పు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు రాలేదన్నారు.ఈ మేరకు అన్ని రకాల చర్యలు పూర్తయ్యాయని తెలిపారు. విద్యానికేతన్‌ను యూని వర్సిటీగా మార్పు చేసేందుకు ప్రభుత్వం నుం చి గ్రీన్‌సిగ్నల్ లభించిందని, త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నామని తెలిపారు. పేద విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన శ్రీ విద్యానికేతన్ క్రమశిక్షణకు మారుపేరుగా నిల వడం తమకు అన్ని విధాలుగా గుర్తింపు తీసుకు వచ్చిందన్నారు. దేవాలయం లాంటి విద్యానికేతన్ అభివృద్ధికి ఇక్కడి అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఎంతో కృషి చేశారన్నారు. ఇక్కడి విద్యార్థులు చదువులో మాత్రమే కా కుం డా ఆట, పాటల్లోనూ తమకెవ్వరూ సాటిలేరని నిరూపించుకునే స్థాయికి ఎదుగుతుండడం ఎం తో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరచుకోవడం వల్ల ఎన్నో రకాల విజయాలను సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అధునాతన లైబ్రరీ...భారతదేశంలో ఏ విద్యాసంస్థల్లో లేని విధంగా అధునాతన లైబ్రరీని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేస్తున్నామని, శ్రీవారి భక్తులందరూ తిరుమల దర్శనానంతరం శ్రీ విద్యానికేతన్‌ను దర్శించేలా చర్యలు తీసుకుంటున్నామని మోహన్‌బాబు తెలిపారు. ఇందుకోసం ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు భగవంతుని విశిష్టతను తెలిపే పుస్తకాలను కూడా లైబ్రరీలో ఏర్పాటు చేయిస్తున్నామని ఆయన వెల్లడించా రు. వచ్చే విద్యా సంవత్సరం కంతా లైబ్రరీ పనులను పూర్తి చేయించి అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి