* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

8, జనవరి 2011, శనివారం

రూ.150 కోట్లతో పెట్రో కారిడార్ రోడ్లు

1.జిల్లాలో రూ.150 కోట్లతో పలు రోడ్లు 
2.సోమవారం నుంచి అనకాపల్లి అచ్యుతాపురంల మధ్య సర్వే
విశాఖపట్నం(విశాల విశాఖ): కాకినాడ విశాఖల మధ్య నిర్మితం కానున్న పెట్రోలియం కెమికల్ పెట్రో అండ్ ఇన్ వెస్ట్‌మెంట్ రీజియన్ (పీసీపీఐఆర్) ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో రూ.150 కోట్లతో పలు రోడ్లు నిర్మించనున్నారు. యలమంచిలి నుంచి అచ్యుతాపురం వరకూ 14 కిలోమీటర్ల రోడ్డును రూ.75 కోట్లతోను,అనకాపల్లి నుంచి అచ్యుతాపురానికి 14 కిలోమీటర్ల రోడ్‌ను రూ.75 కోట్లతో చేపడతారు. ప్రాజెక్టు వ్యయానికి అవసరమైన నిధుల్లో రూ.37.5 కోట్లు కేంద్రప్రభుత్వం,మిగిలిన సగం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. ఇప్పటికే యలమంచిలి,అచ్యుతాపురంల మధ్య సర్వే పనులు ప్రారంభమయ్యాయి.సోమవారం నుంచి అనకాపల్లి అచ్యుతాపురంల మధ్య సర్వే చేపడతారు. ఇప్పటికే తొలిదశ సర్వే పనులకు రూ.15కోట్లు విడుదలయ్యాయి. పెట్రో కారిడార్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా రోడ్ల నిర్మాణం ఉంటుంది. ఈమేరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఇళ్లను,సాగుభూములను, మరికొన్ని చోట్ల దుకాణ సముదాయాలను లెక్కించి అక్కడి మార్కెట్ ధరకు (రిజిస్ట్రేషన్ శాఖ వివరాల ప్రకారం) అనుగుణంగా చెల్లింపులు జరుపుతారు. తొలుత సమగ్ర సర్వే పూర్తిచేసి భూసేకరణ మొత్తం ఏ మేరకు అవసరం ఉంటుంది,పరిహారంగా ఎంత చెల్లించాలి,ఇళ్లను తొలగించాల్సి వస్తే ఎందరు నిరాశ్రయులవుతారు తదితర వివరాలు సేకరిస్తారు.పునరావాసానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అభిప్రాయసేకరణ తదితర వాటిపై సర్వే సమయంలో లభించిన సమాచారం ఆధారంగా రోడ్లు,భవనాల శాఖ నివేదికలు రూపొందిస్తుంది. ముందుగా భూములను సేకరించి పరిహారం చెల్లింపులు జరిపి,ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధారించిన తరువాతే రోడ్డు విస్తరణకు కేంద్రం నుంచి వాటా నిధులు విడుదలవుతాయి. ఈ ప్రక్రియ పూర్తికి నాలుగు అయిదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి