* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

8, జనవరి 2011, శనివారం

ప్రగతి పథంలో విశాఖ

కలెక్టర్‌ శ్యామలరావు
వన్‌టౌన్‌: భిన్న అంశాల్లో విశాఖ అభివృద్ధి చెందుతోందని కలెక్టర్‌ జె.శ్యామలరావు అన్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐ.ఎ.ఎస్‌.ల బృందం శీతాకాల అధ్యయన యాత్రలో భాగంగా శనివారం విశాఖకు వచ్చారు. కలెక్టర్‌ శ్యామలరావును ఆయన బంగ్లాలో మర్యాదపూర్వకంగా ఈ బృంద సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తాను 1997 బ్యాచ్‌కు చెందిన ఐ.ఎ.ఎస్‌. అధికారినని, 11 ఏళ్ల పాటు అస్సాంలో పనిచేసి విశాఖ కలెక్టర్‌గా వచ్చినట్లు చెప్పారు. నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజన వాతావరణం నిండిన జిల్లా వివిధ రంగాల్లో ప్రగతి సాధిస్తోందన్నారు. ఐ.టి, ఎస్‌.ఇ.జెడ్‌.ల అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయని, క్షేత్ర పర్యటనలో ఆయా సంస్థల పనితీరును పరిశీలించాలన్నారు. జీవీఏంసీ, వుడా అనేక ప్రణాళికలను రూపొందించి, వివిధ ప్రాజక్టులను అమలు చేస్తోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. కలెక్టర్‌ను కలిసిన ఐ.ఎ.ఎస్‌. బృందంలో దుర్గాశక్తినాగ్పాల్‌, గొడ్కెరశ్మిజయేంద్ర, అరుణ్‌రాఠి, ప్రకాశ్‌రాజ్‌పురోహిత్‌, కార్తికేయగోయల్‌, అజయ్‌యాదవ్‌, సురేశ్‌ కుమార్‌మొక్తా, యోగేష్‌కుమార్‌, కల్దెన్‌దోర్జి, అశుతోష్‌సలిల్‌, ప్రేమ్‌చంద్రచౌదరి, కౌశల్‌కిశోర్‌, నరేంద్రకుమార్‌మీనాలు ఉన్నారు.
రూ.2,261 కోట్లతో నవీకరణ: పోర్టు ఛైర్మన్‌
తమ పర్యటనలో భాగంగా ఈ బృందం విశాఖ పోర్టును సందర్శించింది. ఛైర్మన్‌ అజేయకల్లంతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఛైర్మన్‌ అజేయకల్లం మాట్లాడుతూ రూ.2,261 కోట్లతో పోర్టును నవీకరిస్తున్నామన్నారు. దక్షిణ ఆసియాలోనే తొలిసారిగా సముద్రమట్టానికి దిగువున 60వేల టన్నుల ఎల్‌.పి.జి.ని నిల్వచేసేందుకు చర్యలను తీసుకుంటున్నామన్నారు. సామాజిక బాధ్యతగా చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను వెల్లడించారు. తదుపరి జిల్లా ఖజానా కార్యాలయాన్ని సందర్శించారు. కంప్యూటరీకరణ, ఇతర అంశాలను డి.టి.ఒ. ఎం.యు.ఎం. శర్మ యువ ఐఎఎస్‌ బృందానికి వివరించారు. అధికారులు నారాయణరావు, ఎస్‌.వి.ఎస్‌.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి