కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రోజురోజుకి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు ఇచ్చే శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ నాణ్యతపై దృష్టి పెట్టలేకపోతోంది. తిరుమల కొండపై ఓ లడ్డూలో నట్టు ఉండటం గమనించిన భక్తులు షాక్ అయ్యారు.అంతేకాదు.. నానాటికి తిరుమల దేవస్థానం తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదంలో నాణ్యత కొరవడుతుందని, లడ్డూల్లో చిన్న చిన్న పురుగులు కనిపించడం పోయి.. ఇప్పుడు పెద్ద నట్టులు కూడా కనిపిస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. ఇంకా దేవుని దివ్య ప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లోపించకుండా తితిదే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.ఇకపోతే.. తిరుమల వెంకన్న స్వామి ఆలయానికి వీవీఐపీల తాకిడి రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రోటోకాల్ చట్టం ద్వారా శ్రీవారిని దర్శించుకునే వీవీఐపీల సంఖ్య పెరిగిపోతోంది. ప్రోటోకాల్ ద్వారా వీవీఐపీల దర్శనం వల్ల నెలకు రూ.50వేల వరకు ఖర్చవుతుంది. సంవత్సరానికి రూ.15లక్షల వరకు టీటీడీ ఖాతాలో చిల్లు పడుతోందని తెలిసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి