హైదరాబాద్: రాజధానిలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి రాగా, మరోచోట రూ.ఏడు లక్షల విలువైన డాలర్లు, పౌండ్లు చోరీకి గురయ్యాయి. తుకారాంగూడలో ఉండే ఓ మైనర్ బాలిక శనివారం సాయంత్రం స్కూల్ అయిపోవడంతో నడుస్తూ ఇంటికి వస్తున్న సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లాడు. స్కూల్ అయిపోయాక కొద్దిగా ఆలస్యం కావడంతో ఆమె వెళ్లాల్సిన స్కూల్ బస్సు పోయింది. దీంతో ఆమె రాత్రి ఏడుగంటల సమయంలో నడుచుకుంటూ ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయిని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఉదయం తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరోవైపు ఎల్బీ నగర్‌లోని స్నేహపురి కాలనీలో పాఠశాల నడుపుతున్న శంకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఎవరో దుండగులు ఇంట్లో చొరబడి 2500 యుఎస్ డాలర్లు, 500 పౌండ్లు దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.ఏడు లక్షల వరకు ఉంటుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాద చేశారు. ఈ సంఘటన కూడా శనివారం మధ్యాహ్నం జరిగింది. సదరు దొంగలు ఇంటి గ్రిల్స్ తొలగించి ఎత్తుకు పోయారు. గ్రిల్స్ తొలగించి ఎత్తుకు పోవడం వల్ల ప్రొఫెషనల్ దొంగలే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి