* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

23, జనవరి 2012, సోమవారం

జిల్లాలో పేదవర్గాలకు రుణాలు అందజేయడంలో బ్యాంకర్లు ముందంజ వేయడం తన స్వంతానికి రుణం ఇచ్చినంత ఆనందంగా ఉందని జిల్లాకలెక్టరు డా. జి.వాణీమోహన్‌ సంతోషం వ్యక్తంచేశారు.

జిల్లాలో పేదవర్గాలకు రుణాలు అందజేయడంలో బ్యాంకర్లు ముందంజ వేయడం తన స్వంతానికి రుణం ఇచ్చినంత ఆనందంగా ఉందని జిల్లాకలెక్టరు డా. జి.వాణీమోహన్‌ సంతోషం వ్యక్తంచేశారు. స్దానిక కలెక్టరు కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పేద ప్రజలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు మరింత ముందుకు రావాలని కోరిన మేరకు స్పందించి బ్యాంకర్లు పేద వర్గాలకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అందిస్తున్న సహకారం మరింత పెంచి జనవరి 31 వతేదీలోగా లబ్దిదారులందరికి రుణాలు యివ్వాలని కలెక్టరు కోరారు. జిల్లాలో వివిధ సంక్షేమశాఖల ద్వారా మంజూరు చేసిన స్వయం ఉపాధి సోపానం యూనిట్లు జనవరి 31 నాటికల్లా ఏర్పాటు చేయాలని కలెక్టరు కోరారు. స్వయం ఉపాధి సోపానం కార్యక్రమం కింద యూనిట్లు మంజూరులో గతంలో ఎ న్నడూ లేనివిధంగా ఈసారి బ్యాంకర్లు ముందుకు రావడం పట్ల కలెక్టరు సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఏడాది 3459 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం కాగా యిప్పటికే 3071 యూనిట్లకు 17.71 కోట్ల రూపాయలు మంజూరు ఉత్తరువులు యివ్వడం జరిగిందని కలెక్టరు చెప్పారు. ఇప్పటి వరకూ 1165 యూనిట్లు నెలకొల్పడం జరిగిందని మిగిలిన యూనిట్లు కూడా జనవరి నాటికి నెలకొల్పి లక్ష్యాలను పూర్తిచేయాలని డా.వాణీమోహన్‌ కోరారు. యూనిట్ల స్దాపనకు సంబందించి లబ్దిదారులు నెలకొల్పిన యూనిట్ల ఫోటోలు సంబందిత యంపిడిఒల కార్యాలయాలలో, వివిధ సంక్షేమశాఖల కార్యాలయాలలో అందుబాటులో ఉంచాలని కలెక్టరు కోరారు. స్వయం ఉపాధి సోపానం యూనిట్ల మంజూరు, స్దాపనకు సంబందించిన వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కలెక్టరు కోరారు. గిరిజన ప్రాంతాలలోని పేద వర్గాలకు పెద్దఎ త్తున రుణాలు అందించి గిరిజనుల ఆర్దిక పురోభివృద్దికి ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టరు కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టరు డా.టి .బాబురావునాయుడు, లీడ్‌ బ్యాంకు మేనేజరు శ్రీ ఆర్‌.శంకరరావు,యస్‌.సి కార్పోరేషన్‌ ఇడిశ్రీ రామకృష్ణ, గృహనిర్మాణశాఖ పి.డిశ్రీ ఆర్‌ .వి.వి.సత్యనారాయణ, వ్యవసాయశాఖ జె.డి శ్రీ బాలసుబ్రహ్మణ్యం, డిఆర్‌ డిఎ పి.డి శ్రీ వై.రామకృష్ణ, స్టేట్‌ బ్యాంకుకో ఆర్డినేటరు శ్రీ నాగేశ్వరరావు, బరోడా బ్యాంకు సీనియర్‌ మేనేజరు శ్రీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి