* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

30, జనవరి 2012, సోమవారం

కమల్‌ డైరెక్షన్‌లో రవితేజ?


హైదరాబాద్‌ : బహు భాషా నటుడిగా వెండితెరపై నవరసాలు పోషించిన కమలహాసన్‌, త్వరలోనే తన విశ్వరూపాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు తాను రూపొందిస్తున్న విశ్వరూపం చిత్రం అనంతరం ఆయన నటుడిగా, దర్శకుడిగా అమర్‌...హై అనే చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు-తమిళ-మలయాళ-హిందీ భాషలలోని కథనాయకులతో ఈ సినిమా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగు నుంచి రవితేజా, తమిళ నుంచి అజిత్‌, మలయాళం నుంచి మోహన్‌లాల్‌ ఎంపిక జరగగా, హిందీ నుంచి ఎవరనేది తేలాల్సి ఉంది. సినిమాలో ఈ ప్రధాన పాత్రలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ కమలహాసన్‌ పాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది.దశవతారం వంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన రవిచంద్రన్‌, భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిసింది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో అభిమానుల కథానాయకుల సరసన ఆడిపాడే నాయికలు ఎవరేనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవినీతి రాజకీయాలను దుయ్యబడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న మోసాలకు ఈ సినిమా అద్దం పడుతుందని కమలహాసన్‌ చెప్పారు. సాధారణంగా కమల్‌ చిత్రాలు ఇటు వినోదాత్మకంగా, అటు ప్రయోగాత్మకంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అవినీతిని కడిగేసేందుకు భారీ ఎత్తున ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందనేది చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి