11, నవంబర్ 2010, గురువారం
సీఎం మార్పు.... దుష్ప్రచారమే: మంత్రులు
హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలేనని మంత్రులు కొట్టిపారేశారు. రోశయ్యపాలన ఎంతో సమర్థంగా ఉందని మాధ్యమిక విద్యాశాఖమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, అటవీశాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వారు విమర్శించారు. తెదేపా నేతలు ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మంత్రులు దుయ్యబట్టారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా చంద్రబాబు ఎదగాలని సూచించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి