హైదరాబాద్: లక్షకోట్లకు పైగా అవినీతికి పాల్పడిన కేంద్రమంత్రి రాజాను పదవినుంచి తప్పించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ఎక్కడ, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవినీతి పెరిగిపోతోందని అన్నారు. ప్రజాధనం పూర్తిగా దుర్వినియోగం అవుతోందని ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. కామన్వెల్త్, ఆదర్శ్ కుంభకోణాలపై కేంద్రం ఎందుకు స్పందించటంలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపైనా సోనియా స్పందించటంలేదని విమర్శించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి