* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

15, మే 2011, ఆదివారం

కాంగ్రెసు పార్టీని ఆంధ్రలో మొయిలీయే భ్రష్టు పట్టించాడు: పాల్వాయి

హైదరాబాద్ (విశాల విశాఖ): వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల వైఫల్యానికి ఉన్నత స్థానంలో ఉన్నవారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఇటీవలి వరకు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్‌గా పని చేసిన వీరప్ప మొయిలీ ఓటమికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. మొయిలీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. జగన్ గెలుపు వల్ల కాంగ్రెసుకు ఎలాంటి నష్టం లేదన్నారు.మంత్రివర్గంలో పలువురిని తొలగించాలని సూచించారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెసులో ఉంటూ కాంగ్రెసును నష్ట పరిచే చర్యలు చేపడుతున్నారన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెప్పారు. ఈ వైఫల్యం కాంగ్రెసు నేతలు పోస్టుమార్టం నిర్వహించాల్సిన ఆవశ్యకతను చూపించిందన్నారు.
 

ఆ పదవి వద్దు బాబోయ్

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తదనంతరం ముఖ్యమంత్రి పీఠం కూర్చున్న కొణిజేటి రోశయ్య మరోసారి ఆ పదవి వస్తే వద్దంటున్నారు. రోశయ్య కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మరోసారి ముఖ్యమంత్రి పదవి వస్తే తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన ససేమీరా అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సర కాలంలో అనేక ప్రకృతి వైపరీత్యాలను, ఉద్యమాలను ఎదుర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు సమస్యలపై బాగానే వర్క్ చేశారనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సమస్య ఆయనకు కంటి మీద నిద్ర లేకుండా చేశాయి. ఆయనకు వయసు కూడా సహకరించక లేదు. అలాంటి పదవిపై మరోసారి కూర్చోవాలని లేదని మాత్రం చెబుతున్నారు.కాగా కడప ఉప ఎన్నికలలో ఓటమిపై కాంగ్రెసు పార్టీ లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జగన్, విజయమ్మ భారీ ఆధిక్యంతో గెలవడంపై ఓసారి కాంగ్రెసు విశ్లేషించుకోవాలన్నారు. ఈ ఓటమికి ఎవరో కొంతమంది బాధ్యులని చేయడం భావ్యం కాదని, అందరూ సమిష్టిగా ఓటమిపై సునిశిత పరిశీలన జరపాలని అభిప్రాయపడ్డారు. టిడిపి పరిస్థితి కూడా కాంగ్రెసుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. కడప ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే కాంగ్రెసు జాతీయ స్థాయిలో పటిష్టంగా ఉందని చెప్పారు.

12, మే 2011, గురువారం

కేరళలో సత్యసాయి ఆలయ నిర్మాణం!

తిరువనంతపురం: కేరళలో త్వరలో సత్యసాయిబాబా ఆలయాన్ని నిర్మించనున్నారు. థొనక్కల్‌లోని సాయి గ్రామంలో ఏర్పాటయ్యే ఆలయంలో సత్యసాయి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ట్రావెంకోర్‌ రాజకుటుంబం ఈ వెండి విగ్రహాన్ని బహూకరించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడి శ్రీ సత్యసాయి శరణాలయ ట్రస్ట్‌ ప్రతినిథి ఆనందకుమార్‌ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. భగవాన్‌ సాయిబాబా జన్మదినమైన నవంబరు 23వ తేదీన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు.

సెప్టెంబర్‌ 18న సీడీఎస్‌ పరీక్ష

న్యూఢిల్లీ: రక్షణ దళాల్లో ప్రవేశాల కోసం కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్ష-2ను సెప్టెంబర్‌ 18న నిర్వహించనున్నట్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తెలిపింది. భారత మిలటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో 2012 జులైలో ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2012 అక్టోబర్‌లో చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో మొదలయ్యే కోర్సు (మహిళలు, పురుషులు) కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించింది. అర్హత, సిలబస్‌, పరీక్ష విధానం, దరఖాస్తు విధానం వంటి వివరాల కోసం మే 7 2011 నాటి ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌/ రోజ్‌గార్‌ సమాచార్‌ చూడాలని కోరింది. పూర్తివివరాలు www.upsc.gov.in వెబ్‌సైట్‌లో కూడా లభ్యమవుతాయని తెలిపింది.

6, మే 2011, శుక్రవారం

కనిమొళి బెయిల్‌ అభ్యర్థనపై న్యాయస్థానం విచారణ

న్యూఢిల్లీ: 2జి స్కామ్‌ కేసుకు సంబంధించి డీఎంకే ఎంపీ కనిమొళి ముందస్తు బెయిల్‌ కోరడంతో దానిమీద ఈరోజు విచారణ జరుగుతోంది. న్యాయస్థానానికి వచ్చిన కనిమొళి ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ 'కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం...' అన్నారు.
 

మూడో రోజుకు చేరిన జూనియర్‌ డాక్టర్ల సమ్మె

వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యుల సమ్మె మూడో రోజుకు చేరింది. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

1, మే 2011, ఆదివారం

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఆరుగురి మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా అచ్యుతాపురం వద్ద చెట్టును జీపు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సంఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తుండగా జీపు టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.

కడప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి

కడప : ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అలాంఖాన్‌పల్లె, చెన్నూరు. ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు. బద్వేలు, పోరుమామిళ్ల... తదితరప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకోవాల్సింది ప్రజలేనని ఆయన అన్నారు.

తెలుగుదేశంలో చేరనున్న రాజశేఖర్‌ దంపతులు

హైదరాబాద్‌ : సినీనటుడు రాజశేఖర్‌ దంపతులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవితలు ఈ అంశమై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సోమవారం రాజశేఖర్‌ దంపతులు తెలుగుదేశంలో చేరనున్నారు.