న్యూఢిల్లీ: రక్షణ దళాల్లో ప్రవేశాల కోసం కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష-2ను సెప్టెంబర్ 18న నిర్వహించనున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. భారత మిలటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 2012 జులైలో ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2012 అక్టోబర్‌లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మొదలయ్యే కోర్సు (మహిళలు, పురుషులు) కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించింది. అర్హత, సిలబస్, పరీక్ష విధానం, దరఖాస్తు విధానం వంటి వివరాల కోసం మే 7 2011 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/ రోజ్‌గార్ సమాచార్ చూడాలని కోరింది. పూర్తివివరాలు www.upsc.gov.in వెబ్‌సైట్‌లో కూడా లభ్యమవుతాయని తెలిపింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి