లాన్ ఏంజెలిన్ : భారత సంగీతకారుడు ఏఆర్‌ఇ రెహమాన్ 127 అవర్స్ సినిమాకోసం చేసిన సంగీతానికి ప్రతిష్ఠాత్మక వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డు గెలుచుకున్నారు. పబ్లిక్ ఛాయిస్ విభాగంలో ఆయనకి అవార్డు దక్కింది. గతంలో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి రెండు ఆస్కార్‌లు, రెండు గ్రామీలు అందుకున్నారు. ఇప్పుడు 127 అవర్స్ సినిమాకు తాజా అవార్డు గెలుచుకున్నారు. పబ్లిక్ చాయిస్ అవార్డు ఇచ్చినందుకు వరల్డ్ సౌండ్ ట్రాక్ అకాడమీకి నా అభిమానులకు రెహమాన్ కృతజ్ఞతలు తెలిపారు.
24, అక్టోబర్ 2011, సోమవారం
ఏఆర్ రెహమాన్‌కి వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డు
తెలంగాణ ఉద్యోగుల సమ్మె విరమణ
హైదరాబాద్ : సకల జనుల సమ్మెను తెలంగాణ ఉద్యోగులు విరమించారు. రేపటి నుంచి తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమించి విధులకు హాజరుకానున్నారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీఆజాద్ హామీ ఇచ్చారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. సమ్మె విరమించమని ఢిల్లీ నుంచి ఆజాద్ కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. సమ్మె విరమణ పత్రంపై టి. ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.
20, అక్టోబర్ 2011, గురువారం
ఏడువేల అంత్యోదయ కార్డుల పంపిణీకి నిర్ణయం
పాడేరు(విశాల విశాఖ): ప్రతిష్టమైన చర్యల ద్వారా విశాఖ ఏజెన్సీలో ప్రజా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ తహసీల్దార్లకు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిజన శంకర్ ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పంపిణీ,6వ విడత భూ పంపిణీకి అవసరమయ్యే భూ సేకరణపై ఏజెన్సీలోని తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.జిల్లాలో అతి పేదలైన వారికి పంపిణీకి ఏడువేల అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు అందించేందుకు నిర్ణయించామన్నారు. అందులో 5వేల 500 ఎ.ఎ.వై. కార్డులు ఏజన్సీకి ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ కార్డులపై 35 కేజీలు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ప్రాధాన్యతను బట్టి ఆదిమ జాతుల తెల్లరేషన్ కార్డులను ఎ.ఎ.వై. కార్డులుగా మార్చి డిశంబర్ నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 6వేల టన్నుల సామర్ధ్యం గల పాడేరు జి.సి.సి. గోడౌన్‌లో పూర్తి స్థాయి నిల్వలు ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.బియ్యం, గోదుమ, కిరోసిన్ పంపిణీలో తూనికలు సరిగా ఉండేటట్లు చూడాలన్నారు. రాబోయే కాలంలో నియోజక వర్గ మండలాల్లో 5వేల దీపం కనెక్షన్లకు నమోదులు స్వీకరించాలన్నారు. 6వ విడత అటవీ భూముల పంపిణీకి అన్ని మండలాల్లో సర్వేలు పూర్తి చేయాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ భూ సేకరణ యొక్క రికార్డుల పని సంపూర్ణంగా ఉండాలన్నారు. భూ సేకరణ మెదర్‌మెట్స్, మెన్యూవల్స్ తయారీలను ముందు చేయాలన్నారు. తరువాత సిఎడి, సిఎఎం.పద్ధతిలో కంప్యూటర్‌లో పొందు పర్చాలన్నారు. ఏజెన్సీలోని అన్ని తాలుక కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. మండలాల వారిగా సమీక్ష చేస్తూ సిబ్బంది కొరత ఉన్న, మావోయిస్టుల సమస్య ఉన్న అంకితభావంతో విధి నిర్వహణ చేస్తున్నామన్నారు. అడంగల్, బేెసిక్ ప్రాతిపధికన భూ సేకరణకు వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆరువేల రేషన్ కార్డులు ఉన్న చోట ఒక డిఆర్‌డిపో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సర్వే సహాయ సంచాలకులు, 11 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
18, అక్టోబర్ 2011, మంగళవారం
ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం అసందర్భం: పరకాల ప్రభాకర్
రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం అసందర్భం, అసంమజసమని ప్రముఖ పాత్రికేయడు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈనెల 22, 23 తేదీల్లో విశాలాంధ్ర మహాసభను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ వర్క్‌షాపులో అన్ని విషయాలను చర్చిస్తామని ఆయన తెలిపారు.దీనిపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్రపై ఈనెల 22, 23 తేదీల్లో నగరంలోని జూబ్లీహాల్‌లో వర్కషాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే, ప్రత్యేక తెలంగాణపై పరకాల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై తెలంగాణ వాదులు దాడి చేసేందుకు యత్నించగా, పోలీసుల జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఈటెల రాజేందర్‌కు బెయిల్ నిరాకరించిన రైల్వే కోర్టు!
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌కు సికింద్రాబాద్ రైల్వే కోర్టు మంగళవారం కూడా బెయిల్ నిరాకరించింది. దీంతో గత మూడు రోజులుగా జైల్లోనే ఉంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శనివారం రోజు ఈటెల రాజేందర్ హైదరాబాద్‌లో రైలు రోకోలో పాల్గొన్న విషయం తెల్సిందే.రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం కింద ఈటెలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. శనివారం నుంచి బెయిల్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నా రైల్వే కోర్టు మాత్రం ఆయనకు బెయిల్ నిరాకరించింది.ఈటెలతో పాటు.. మరికొంతమంది తెరాస నేతలకు శని, ఆదివారాల్లో బెయిల్ లక్ష్యమైంది. మెదక్ ఎంపీ విజయశాంతికి ఆదివారం బెయిలు రాగా, కాంగ్రెస్ నేతలు పొన్నం, జీవన్ రెడ్డిలకు సోమవారం బెయిలు లభించింది. కానీ, ఈటెలకు మాత్రం మంగళవారం కూడా రైల్వే కోర్టు బెయిల్ నిరాకరించింది
14, అక్టోబర్ 2011, శుక్రవారం
సహ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది
ప్రధాని మన్మోహన్‌సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం వల్ల వస్తున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని దానిని సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) శుక్రవారం నిర్వహించిన రెండు రోజుల వార్షిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనితీరు కుంటుపడేలా ఉండకూడదని తెలిపారు. పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ చట్టం... తమ అధికారాల్లోకి చొరబడుతోందని కొందరు అధికారులు భావిస్తున్నారని, దీనిపై సమన్వయాన్ని సాధించాల్సి ఉందని గుర్తు చేశారు. సహచట్టం వల్ల నిజాయితీగల అధికారులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థను జవాబుదారీగా ఉంచేందుకు సహచట్టానికి మరింత పదును తెస్తామని అన్నారు. అవినీతి గుట్టును రట్టు చేసే వారికి రక్షణ కల్పించే చట్టాన్ని మరో అయిదు నెలల్లో తెస్తామన్నారు.

తెరాస శాసనసభ్యుడు కేటీఆర్ అరెస్టు, విడుదల
హైదరాబాద్: తెరాస శాసనసభ్యుడు కె. తారకరామారావును పోలీసులు అరెస్టు చేశారు. సీతాఫలమండిలో ఓ ఇంట్లో ఉన్న కేసీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరెస్టు అక్రమమంటూ తెలంగాణ వాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అరెస్టును అడ్డుకున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటికి పోలీసులు కేటీఆర్‌ను మరల అక్కడే విడిచిపెట్టారు.
12, అక్టోబర్ 2011, బుధవారం
అన్నా హజారేకి న్యాయ శాస్త్ర విద్యార్థి లీగల్ నోటీసు
న్యూఢిల్లీ: ఇరవై రెండేళ్ల న్యాయశాఖ విద్యార్థి ఒకరు అన్నా హజారేకి 'దేశప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని' లీగల్ నోటీసు ఇచ్చాడు. అన్నా బృందం అవినీతి మీద పోరాటాన్ని ఒక్క పార్టీకి వ్యతిరేకంగా మళ్లించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసిందని విభోర్ ఆనంద్ అనే యువకుడు ఆ నోటీసులో పేర్కొన్నాడు. అన్నా బృందంలోని సభ్యులందరికీ కూడా ఈ నోటీసులను ఇచ్చారు. పూర్తిగా రాజకీయాలకు అతీతంగా అన్నా ఉద్యమించినందుకు దేశంలో లక్షలాది ప్రజలు స్ఫూర్తి పొందారని, అలాంటిది ఇప్పుడు అన్నా బృందం తమ పంథా మార్చుకుని ఒక్క కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకుందని ఈ నోటీసులో పేర్కొన్నారు. లోక్‌పాల్ బిల్లు కోసం శీతాకాల సమావేశాలవరకూ కూడా ఆగకుండా అన్నాబృందం ప్రతినిధులు వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ప్రచారం గురించి కూడా ప్రకటనలు చేశారని, హిసార్ ఉప ఎన్నికకీ అదే ధోరణిలో ప్రచారం ప్రారంభించారని నోటీసులో పేర్కొన్నారు. ఈ చర్యలు అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నీరుకారుస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
ప్రశాంత్‌భూషణ్‌పై దాడి
న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది, అన్నా బృందంలో కీలక సభ్యుడు, లోక్‌పాల్ ముసాయిదా కమిటీ సభ్యుడైన ప్రశాంత్‌భూషణ్‌పై ముగ్గురు యువకులు దాడి చేశారు. సుప్రీంకోర్టులో ఆయన తన ఛాంబర్‌లో ఉండగా వీరు దూసుకువచ్చి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం వీరు పారిపోతుండగా జూనియర్ న్యాయవాదులు ఒకరిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వారు ఆ యువకుడిని అరెస్టు చేశారు. పారిపోయిన మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాశ్మీర్‌లో రెఫరెండం చేయాలన్న ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. శివసేనకు చెందిన కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ భూషణ్‌పై దాడిని కిరణ్‌బేడీ ఖండించారు.
ప్రశాంత్‌భూషణ్‌కు చికిత్స
భగత్‌సింగ్ క్రాంతి సేన కార్యకర్తల దాడిలో గాయపడిన సామాజికవేత్త అన్నా హజారే బృందం సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ను రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. భూషణ్‌పై దాడిని అన్నా టీం ఖండించింది.
దాడిని ఖండించిన హోం మంత్రి
అన్నా టీం మెంబర్ ప్రశాంత్‌భూషణ్‌పై జరిగిన దాడిని కేంద్రహోం మంత్రి చిదంబరం, అన్నా బృందం మెంబర్ కిరణ్‌బేడీ, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణలు ఖండించారు.
దాడి చేసింది...
ప్రశాంత్‌భూషణ్‌పై దాడి చేసింది భగత్‌సింగ్ క్రాంతి సేన కార్యకర్తలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆవరణలో కరపత్రాలు లభించాయి.

3, అక్టోబర్ 2011, సోమవారం
దుర్గామాతను దర్శించుకున్న సినీహీరో అల్లు అర్జున్
విజయవాడ: తెలుగు సినీహీరో అల్లు అర్జున్ ఈరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావటంతో ఆలయంలో భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ ఈఓ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌లు అల్లు అర్జున్‌ను ఆయన వెంట వచ్చినవారిని కిందనుంచి స్వయంగా తీసుకుని వచ్చారు. ఈఓ వాహనంలో వారిని పైకి తీసుకుని వచ్చారు. అంతరాలయ దర్శనం చేయించి పండితులతో అమ్మవారి శేషవస్త్రం కప్పి ప్రసాదం అందజేయించారు.
రాష్ట్రంలో అప్రకటిత రాష్ట్రపతి పాలన: కొణతాల
హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో అప్రకటిత రాష్ట్రపతి పాలన కొనసాగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొణతాల రామకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతమంతా పోలీసు రాజ్యంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రజలు గాడాంధకారంలో మునిగిపోయారని ఆయనఅన్నారు.
1, అక్టోబర్ 2011, శనివారం
కర్నాటక మంత్రిని చెప్పుతో కొట్టిన నేత
బెంగుళూరు : కర్నాటక విధానసౌధలో ఓ మంత్రికి ఘోర పరాభవం ఎదురైంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్నను మాజీ బీజపీ నేత ప్రసాద్ చెప్పుతో కొట్టారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారంటూ మంత్రిపై దాడికి దిగారు. వెంటనే రగంలోకి దిగిన విధానసౌధ పోలీసులు ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు
తెలంగాణపై... అన్నీ రాజకీయపక్షాలు అభిప్రాయాలు ప్రకటించాలి
పురందేశ్వరి
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్నీ రాజకీయపక్షాలు తెలంగాణపై తమ వైఖరిని ప్రకటించిన అనంతరమే దీనిపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. సమస్య పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. రెండు ప్రాంతాల కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ నివేదిక రూపంలో సోనియాకు ఇచ్చినందున తదుపరి చర్యలు వేగవంతం చేస్తారన్నారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిసి తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించిందన్న సంగతి తనకు తెలియదన్నారు

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)