16, జూన్ 2011, గురువారం
జీవీఎంసీ ఆస్తిపన్ను కుంభకోణంలో నలుగురు అరెస్టు
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను కుంభకోణంలో మరో నలుగుర్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బాలకృష్ణ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రూ.3.5లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్త్టెన వారిలో జీవీఎంసీ ఉద్యోగులు వై. తిరుపతిరావు, ఎస్.శ్రీనివాసరావు, ఎం. సన్యాసిరావు, ఎండీ ఇస్మాయిల్ ఉన్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి ఆరుగుర్ని అరెస్టు చేశారు.
3, జూన్ 2011, శుక్రవారం
ఆర్టీసీ బస్సులో ప్రసవం
హుకుంపేట: ఒక్క ఫోను కలిసి ఉంటే ఆ కన్నతల్లికి కడుపుకోత తప్పేది. రవాణా సదుపాయాలు లేక, వైద్యం అందక పోవడంతో ఓ పసికందు కళ్లు తెరవకుండానే వూపిరి వదిలాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని హుకుంపేట మండలంలో చోటు చేసుకుంది. మెరకచింత గ్రామానికి చెందిన పసుపులేటి సత్యవతికి గురువారం రాత్రి నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె తమ్ముడు, భర్త బాకురు వెళ్లి 108 వాహనానికి ఫోను చేసినా లైన్ దొరకలేదు. శుక్రవారం పాడేరు-బాకురు ఆర్టీసీ బస్సులో అసుపత్రికి బయలుదేరారు. ఘాట్‌రోడ్డులో బస్సు కుదుపులకు నొప్పులు ఎక్కువై ఆమె కూర్చోలేక నిలబడిపోయింది. దీంతో బిరిసింగి గ్రామసమీపాన బస్సులోనే ప్రసవమై పసికందు కింద పడిపోయింది. హుకుంపేట అసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. 108వాహనం ఉంటే తమ బిడ్డ బతికేదని తండ్రి అప్పారావు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
హైదరాబాద్: చంద్రబాబు అధ్యక్షతన ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. నేడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు జరగనున్న ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం తదితర అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నట్లు సమచారం. ఈ సమావేశానికి తెదేపా బహిష్కృత నేత నాగం జనార్దన్ వెంట నడుస్తున్న జోగురామన్న, హరీశ్వర్‌రెడ్డి హాజరుకాలేదు.
తిరుపతిలోని అతిథిగృహంలో భక్తుడు మృతి
తిరుపతి: తిరుపతిలోని శ్రీనివాసం అతిథిగృహంలో చెన్నైకి చెందిన భక్తుడు మృతి చెందాడు. రాత్రి శోచశాలలో మృతిచెంది పడి ఉన్న భక్తుడి మృతదేహాన్ని భద్రతాసిబ్బంది గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదవశాత్తూ మరణించాడా అనే విషయం తెలియడం లేదు. మృతుని వద్ద చెన్నై టి.నగర్ ఆంధ్రాబ్యాంకుకు చెందిన పాస్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)