హుకుంపేట: ఒక్క ఫోను కలిసి ఉంటే ఆ కన్నతల్లికి కడుపుకోత తప్పేది. రవాణా సదుపాయాలు లేక, వైద్యం అందక పోవడంతో ఓ పసికందు కళ్లు తెరవకుండానే వూపిరి వదిలాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని హుకుంపేట మండలంలో చోటు చేసుకుంది. మెరకచింత గ్రామానికి చెందిన పసుపులేటి సత్యవతికి గురువారం రాత్రి నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె తమ్ముడు, భర్త బాకురు వెళ్లి 108 వాహనానికి ఫోను చేసినా లైన్ దొరకలేదు. శుక్రవారం పాడేరు-బాకురు ఆర్టీసీ బస్సులో అసుపత్రికి బయలుదేరారు. ఘాట్‌రోడ్డులో బస్సు కుదుపులకు నొప్పులు ఎక్కువై ఆమె కూర్చోలేక నిలబడిపోయింది. దీంతో బిరిసింగి గ్రామసమీపాన బస్సులోనే ప్రసవమై పసికందు కింద పడిపోయింది. హుకుంపేట అసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. 108వాహనం ఉంటే తమ బిడ్డ బతికేదని తండ్రి అప్పారావు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి