హైదరాబాద్ : బహు భాషా నటుడిగా వెండితెరపై నవరసాలు పోషించిన కమలహాసన్, త్వరలోనే తన విశ్వరూపాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించబోతున్నారు. ఇప్పుడు తాను రూపొందిస్తున్న విశ్వరూపం చిత్రం అనంతరం ఆయన నటుడిగా, దర్శకుడిగా అమర్...హై అనే చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు-తమిళ-మలయాళ-హిందీ భాషలలోని కథనాయకులతో ఈ సినిమా రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలుగు నుంచి రవితేజా, తమిళ నుంచి అజిత్, మలయాళం నుంచి మోహన్‌లాల్ ఎంపిక జరగగా, హిందీ నుంచి ఎవరనేది తేలాల్సి ఉంది. సినిమాలో ఈ ప్రధాన పాత్రలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తూ కమలహాసన్ పాత్ర కొనసాగుతుందని తెలుస్తోంది.దశవతారం వంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన రవిచంద్రన్, భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిసింది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో అభిమానుల కథానాయకుల సరసన ఆడిపాడే నాయికలు ఎవరేనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అవినీతి రాజకీయాలను దుయ్యబడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోన్న మోసాలకు ఈ సినిమా అద్దం పడుతుందని కమలహాసన్ చెప్పారు. సాధారణంగా కమల్ చిత్రాలు ఇటు వినోదాత్మకంగా, అటు ప్రయోగాత్మకంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అవినీతిని కడిగేసేందుకు భారీ ఎత్తున ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందనేది చూడాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
30, జనవరి 2012, సోమవారం
కన్నడ తారల సెక్స్ రాకెట్ గుట్టురట్టు
బెంగళూర్: కన్నడ తారల సెక్స్ రాకెట్ కర్నాటకలో మరోసారి సంచలనం రేపింది. సినీ తారల సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. హెచ్‌ఎస్‌ఆర్ లేవుట్ సెవెన్త్ సెక్టార్‌లో ఓ ఇంటిపై పోలీసులు సోమవారం దాడి చేసి ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు వృద్ధ దంపతులు ఈ రాకెట్‌ను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వారు కన్నడ సిరీయల్స్ నటులు అనిత, దీక్షితగా గుర్తిస్తున్నారు.గతంలో యమున కూడా ఇదే తరహా కేసులో అరెస్టు అయ్యింది.
28, జనవరి 2012, శనివారం
polaris software labs distributed schloarships in lankalapalem ZPHS
An MNC company based in chennai- Polaris Financial Technology Ltd has distributed scholarships to meritorious students in Lankalapalem, Visakhapatnam.The program kick started at 3.00 PM in the evening with loads of fun and entertainment.Special guests are invited for the meeting and distributed checks to the folks.Guests included Corporator,HM and local politicians.
23, జనవరి 2012, సోమవారం
జిల్లాలో పేదవర్గాలకు రుణాలు అందజేయడంలో బ్యాంకర్లు ముందంజ వేయడం తన స్వంతానికి రుణం ఇచ్చినంత ఆనందంగా ఉందని జిల్లాకలెక్టరు డా. జి.వాణీమోహన్ సంతోషం వ్యక్తంచేశారు.
జిల్లాలో పేదవర్గాలకు రుణాలు అందజేయడంలో బ్యాంకర్లు ముందంజ వేయడం తన స్వంతానికి రుణం ఇచ్చినంత ఆనందంగా ఉందని జిల్లాకలెక్టరు డా. జి.వాణీమోహన్ సంతోషం వ్యక్తంచేశారు. స్దానిక కలెక్టరు కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కలెక్టరు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పేద ప్రజలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు మరింత ముందుకు రావాలని కోరిన మేరకు స్పందించి బ్యాంకర్లు పేద వర్గాలకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అందిస్తున్న సహకారం మరింత పెంచి జనవరి 31 వతేదీలోగా లబ్దిదారులందరికి రుణాలు యివ్వాలని కలెక్టరు కోరారు. జిల్లాలో వివిధ సంక్షేమశాఖల ద్వారా మంజూరు చేసిన స్వయం ఉపాధి సోపానం యూనిట్లు జనవరి 31 నాటికల్లా ఏర్పాటు చేయాలని కలెక్టరు కోరారు. స్వయం ఉపాధి సోపానం కార్యక్రమం కింద యూనిట్లు మంజూరులో గతంలో ఎ న్నడూ లేనివిధంగా ఈసారి బ్యాంకర్లు ముందుకు రావడం పట్ల కలెక్టరు సంతోషం వ్యక్తంచేశారు. ఈ ఏడాది 3459 యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యం కాగా యిప్పటికే 3071 యూనిట్లకు 17.71 కోట్ల రూపాయలు మంజూరు ఉత్తరువులు యివ్వడం జరిగిందని కలెక్టరు చెప్పారు. ఇప్పటి వరకూ 1165 యూనిట్లు నెలకొల్పడం జరిగిందని మిగిలిన యూనిట్లు కూడా జనవరి నాటికి నెలకొల్పి లక్ష్యాలను పూర్తిచేయాలని డా.వాణీమోహన్ కోరారు. యూనిట్ల స్దాపనకు సంబందించి లబ్దిదారులు నెలకొల్పిన యూనిట్ల ఫోటోలు సంబందిత యంపిడిఒల కార్యాలయాలలో, వివిధ సంక్షేమశాఖల కార్యాలయాలలో అందుబాటులో ఉంచాలని కలెక్టరు కోరారు. స్వయం ఉపాధి సోపానం యూనిట్ల మంజూరు, స్దాపనకు సంబందించిన వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కలెక్టరు కోరారు. గిరిజన ప్రాంతాలలోని పేద వర్గాలకు పెద్దఎ త్తున రుణాలు అందించి గిరిజనుల ఆర్దిక పురోభివృద్దికి ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టరు కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు డా.టి .బాబురావునాయుడు, లీడ్ బ్యాంకు మేనేజరు శ్రీ ఆర్.శంకరరావు,యస్.సి కార్పోరేషన్ ఇడిశ్రీ రామకృష్ణ, గృహనిర్మాణశాఖ పి.డిశ్రీ ఆర్ .వి.వి.సత్యనారాయణ, వ్యవసాయశాఖ జె.డి శ్రీ బాలసుబ్రహ్మణ్యం, డిఆర్ డిఎ పి.డి శ్రీ వై.రామకృష్ణ, స్టేట్ బ్యాంకుకో ఆర్డినేటరు శ్రీ నాగేశ్వరరావు, బరోడా బ్యాంకు సీనియర్ మేనేజరు శ్రీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
9, జనవరి 2012, సోమవారం
8, జనవరి 2012, ఆదివారం
ఎనిమిదో తరగతి విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
హైదరాబాద్: రాజధానిలో దారుణం జరిగింది. ఎనిమిదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి రాగా, మరోచోట రూ.ఏడు లక్షల విలువైన డాలర్లు, పౌండ్లు చోరీకి గురయ్యాయి. తుకారాంగూడలో ఉండే ఓ మైనర్ బాలిక శనివారం సాయంత్రం స్కూల్ అయిపోవడంతో నడుస్తూ ఇంటికి వస్తున్న సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లాడు. స్కూల్ అయిపోయాక కొద్దిగా ఆలస్యం కావడంతో ఆమె వెళ్లాల్సిన స్కూల్ బస్సు పోయింది. దీంతో ఆమె రాత్రి ఏడుగంటల సమయంలో నడుచుకుంటూ ఇంటికి బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయిని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఉదయం తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.మరోవైపు ఎల్బీ నగర్‌లోని స్నేహపురి కాలనీలో పాఠశాల నడుపుతున్న శంకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో షాపింగ్‌కు వెళ్లిన సమయంలో ఎవరో దుండగులు ఇంట్లో చొరబడి 2500 యుఎస్ డాలర్లు, 500 పౌండ్లు దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.ఏడు లక్షల వరకు ఉంటుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాద చేశారు. ఈ సంఘటన కూడా శనివారం మధ్యాహ్నం జరిగింది. సదరు దొంగలు ఇంటి గ్రిల్స్ తొలగించి ఎత్తుకు పోయారు. గ్రిల్స్ తొలగించి ఎత్తుకు పోవడం వల్ల ప్రొఫెషనల్ దొంగలే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)