విశాఖపట్నం, ఆగస్టు 29 ; జి.సి.సి. ఉత్పత్తులను అన్ని సంక్షేమ వసతి గృహాలకు పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. తదననుగుణంగా నాణ్యమైన వస్తువులను అన్ని వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు జి.సి.సి. అధికారులు సన్నదం కావాలని మంత్రి ఆదేశించారు. పంపిణీలో ఎటు వంటి అంతరాయం లేకుండా ప్రణాళికా బద్దంగా సరుకులను ముందుగానే నిల్వ ఉంచుకోవాలన్నారు. సోమవారం జి.సి.సి.కార్యాలయ సమావేశ మందిరంలో జి.సి.సి. మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జి.సి.సి. అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జి.సి.సి. ఉత్పత్తులను ఇప్పటి వరకూ గిరిజన సంక్షేమ వసతి గృహాలకు, గురుకుల పాఠశాలలకు, కళాశాలలకు మాత్రమే పంపిణీ చేయడం జరుగుచున్నదన్నారు. జి.సి.సి. ఉత్పత్తులకు మంచి ఆధరణ కల్పించాలనే లక్ష్యంతో అన్ని ఎస్.సి., బి.సి., మైనారిటీ, వికలాంగ సంక్షేమ వసతి గృహాలకు కూడా జి.సి.సి. ఉత్పత్తునే పంపిణీ చేయాలని నిర్థేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ముదావహం అన్నారు. ఈ అవకాశాన్ని జి.సి.సి. అధికారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. వసతి గృహాలకు నాణ్యమైన ఉత్తత్తులను పంపిణీ చేయడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. గిరిజన ఉత్పత్తులను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన యూనిట్లను పలు ముఖ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని మేనేజింగ్ డైరెక్టర్ బి.త్రినాథరావును మంత్రి ఆదేశించారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 20 కోట్ల అంచనా వ్యయంతో పలుచోట్ల నూతనంగా డి.ఆర్.డిపోలు, గోడాములు నిర్మించేందుకు, ప్రస్తుతం ఉన్న వాటికి మరామత్తులు చేసేందుకు పలు పనులు చేపట్టబడినవని, వాటన్నింటినీ రానున్న ఆరు మాసాల్లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్ణీత సమయంతో పూర్తిచేయాలని, లేకుంటే ఆయా నిర్మాణ పనులను ఇతర శాఖ ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగిస్తామన్నారు. ప్రతిపాదించి ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తే, అన్ని డి.ఆర్.డిపోలకు సొంత భవనాలు ఏర్పాటు చేయగలవారమవుతామన్నారు. డి.ఆర్. డిపోల ద్వారా గిరిజనులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని క్రమబద్దీకరించాలని, అందరికీ సకాలంలో సిలిండర్లు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖలో నిర్మాణంలోనున్న కోల్డు స్టోరేజీ పనులను వేగవంతం చేసి మూడు, నాలుగు మాసాల్లో పనులు పూర్తి చేయాలన్నారు. వర్తకులకు ఎటు వంటి మినహాయింపులు ఇవ్వాల్సిన పని లేదని, వారు కొనుగోలు చేసుకున్న ఉత్పత్తులను నెలల తరబడి గోడాములలో ఉంచవద్దని, నిర్ణీత కాల వ్యవధిలోపు వాటిని తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత ఏడాది కాలంలో జి.సి.సి. సాదించిన లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ బి.త్రినాధరావు మంత్రికి వివరించారు. జనరల్ మేనేజర్లు అప్పారావు, మనోహర్, చంద్రశేఖర్, విశాఖపట్నం, వరంగల్, ఆదిలాబాద్ సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లు, అన్ని డివిజన్లకు చెందిని డివిజనల్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
29, ఆగస్టు 2011, సోమవారం
విశాఖలో సీపీఐ ధర్నా
విశాఖపట్నం: రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు, ఫించన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా చేపట్టింది. ఎన్నికలకు ముందు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను పూర్తిగా విస్మరించిందని సీపీఐ జిల్లా కార్యదర్శి జె.వి.ఎస్.మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హుల పేరుతో జిల్లాలో అనేకమంది రేషన్‌కార్డులు, వితంతు, వృద్ధాప్య, వికలాంగ ఫించన్లు రద్దు చేయడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, ఫించన్లు పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
27, ఆగస్టు 2011, శనివారం
శ్రీవారికి రూ.కోటి విరాళం
తిరుమల: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ మొత్తంలో విరాళం అందచేశారు. ఢిల్లీకి చెందిన శివ నాడార్ అనే భక్తుడు శ్రీవారి ఆలయంలో తితిదే జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజును కలిసి రూ.కోటి విరాళం డిమాండ్ డ్రాప్టులను అందచేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టు కింద జమ చేయాలని జేఈవోకు సూచించారు. శ్రీవారికి విరాళం చేసిన భక్తుడిని జేఈవో అభినందించారు. తీర్థ ప్రసాదాలు అందచేసి ఘనంగా సత్కరించారు
ప్రయోగ ప్రాతిపదికన రూ.10 ప్లాస్టిక్ నోట్లు
న్యూఢిల్లీ: ప్రయోగ ప్రాతిపదికన రూ.10 విలువ కలిగిన వంద కోట్ల పాలీమర్ బ్యాంక్ నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోని ఐదు చోట్ల వీటిని విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమోనారాయణ మీనా శుక్రవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాల ఆధారంగా వీటిపై తుది నిర్ణయం తీసుకుంటామని వివరించారు.వంద కోట్ల ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టడానికి భారతీయ రిజర్వు బ్యాంకు 2009లో గ్లోబల్ టెండర్లు పిలిచింది. దొంగనోట్లను అరికట్టడానికి ఈ తరహా పాలీమర్ నోట్లను తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. ఆ తరువాత న్యూజీలాండ్, పపువా న్యూ గినియా, రొమేనియా, బెర్ముడా, బ్రునై, వియత్నాం వీటిని ప్రవేశపెట్టాయి.మరోప్రశ్నకు సమాధానమిస్తూ.. జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)కి చెందిన కొందరు అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడానికి కేంద్ర విజిలెన్స్ కమిషన్ సూచన మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు నమోనారాయణ మీనా చెప్పారు. వీరిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిందని తెలిపారు
26, ఆగస్టు 2011, శుక్రవారం
విశాఖలో 18న బహిరంగ సభ
హైదరాబాద్(విశాల విశాఖ) : విశాఖపట్నంలో వచ్చే నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్ నిర్ణయించింది. . కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం నాయకులే ఈ బాధ్యతను తీసుకున్నారు. ప్రరాపా శ్రేణులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌లో విలీనమయ్యేలా చూసేందుకు దీనిని తలపెట్టారు. విశాఖపట్నం సమీప నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభకు చిరంజీవితోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు హాజరవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరిజిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని చెబుతున్నారు. ఆ తర్వాత రెండు వారాలకు గుంటూరులో అదే స్థాయిలో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం దీనిని ఉద్దేశిస్తున్నారు. ఆపై రాయలసీమ జిల్లాల కోసం అనంతపురం లేదా కర్నూలుల్లో మరో సభ జరుపుతారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స నివాసంలో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, కోటగిరి విద్యాధరరావు, వేదవ్యాస్, సుబ్బరాయుడు, కామినేని శ్రీనివాస్‌లు పాల్గొన్నారు. పార్టీ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో నియమించాల్సిన నాయకులు, సీనియర్ కార్యకర్తల జాబితాను ఇవ్వాలని బొత్స వీరిని కోరారు. వారంరోజుల్లో పీసీసీ, డీసీసీల పునర్‌వ్యవస్థీకరణ చేపడుతున్నానని వాటిలో ప్రరాపాలో పనిచేసిన వారిని వారి స్థాయినిబట్టి సర్దుబాటు చేస్తానని బొత్స వారికి వివరించారు. నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన వారి జాబితాను ముఖ్యమంత్రికి అందించాలని నిర్ణయించారు.
24, ఆగస్టు 2011, బుధవారం
సత్యంకూడలిలో 50 అడుగుల వినాయక ప్రతిమ
విశాఖపట్నం: వినాయక మహోత్సవాలు సమీపిస్తున్నాయి. నగరంలో ఈ దఫా భారీ గణనాథులే కొలువుదీరబోతున్నారు. గణపతి లక్కీయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యంకూడలి గాంధీనగర్‌లో 50 అడుగుల వినాయక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్ కళాకారుల నైపుణ్యంతో 70 అడుగుల ఎత్తులో భారీ పందిరి నిర్మిస్తున్నారు. 17 రోజులపాటు పూజలతో పాటు హోమాలు, అఖండ దీపారాధన, హారతి, 50 కేజీల లడ్డూ, మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహకుడు కోన గోవిందరావు తెలిపారు. వినాయక ప్రతిమకు దాదాపు రూ.4లక్షల వ్యయమవుతుందన్నారు. కమిటీ సభ్యులుగా ఆనంద్, కోన శ్రీను, సందీప్, ఈశ్వరరావు, లక్ష్మణ్, సంతోష్, వినోద్ తదితరులు వ్యవహరిస్తున్నారు.
సెప్టెంబరు తెలంగాణపై తుది నిర్ణయం: మంత్రి పొన్నాల
సెప్టెంబరు నెలలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. యూపీఏ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై సెప్టెంబర్‌లో ఒక నిర్ణయం వస్తుందన్నారు.అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తెలంగాణ రాష్ట్ర విభజన జరపాలని కోర్‌కమిటీ చేసిన సూచనలకు సర్వత్రా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతాల హక్కుల పరిరక్షణ, నదీజలాల వినియోగంపై అనుమానాలు, భయాందోళనలకు తావులేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన ప్రక్రియ కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కీలకమైన హైదరాబాద్‌తో పాటు నదీజలాల వాటాలే అత్యంత కీలకంగా మారాయన్నారు. ఈ రెండు అంశాల కారణంగానే రాష్ట్ర విభజనలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
తగ్గిన బంగారం ధర
హైదరాబాద్: గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజు వ్యవధిలోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ.720కు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.27,870కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.25,600గా ఉంది. కిలో వెండి ధర రూ.63వేలు.
21, ఆగస్టు 2011, ఆదివారం
లోక్‌పాల్ బిల్లు కోసం పట్టు: ఆరో రోజుకు హజారే దీక్ష!
జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం పట్టుబట్టిన సామాజికవేత్త అన్నా హజారే చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఆదివారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో సాగుతున్న ఈ దీక్షకు మద్దతుగా భారీ సంఖ్యలో జనం మైదానంకు చేరుతున్నారు. మరోవైపు హజారేతో సామాజికవేత్తల బృందం సమావేశం అయింది. ఈ సమావేశంలో కిరణ్‌బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతిభూషణ్, మనీశ్ సిసోడియా, మేధాపాట్కర్ తదితరులు ఉన్నారుఇదిలావుండగా, దేశంలో పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన ర్యాలీ సంజీవయ్య పార్కుకు చేరుకుని తిరిగి పీపుల్స్ ప్లాజాకు నిర్వహించారు. ఈ ర్యాలీలో చిన్నారులు, యవతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అన్నాకు మద్దతుగా, అవినీతికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటులో జనలోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
అలాగే, అన్నా హజారేకు మద్దతుగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేస్తున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిరహిత భారత్ ఏర్పడినపుడే భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే, అన్నా హజారేకు మద్దతుగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్కు నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేస్తున్న దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిరహిత భారత్ ఏర్పడినపుడే భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.
నెల్లురులో నలుగురు కూలీల మృతి
నెల్లూరు: పట్టణంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న ఓ భవన మట్టి పెళ్లలు విరిగిపడి నలుగురు కూలీలు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్మికులు భవనం కింద పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
పదిహేను రోజుల్లో కొమరం భీమ్ విగ్రహం ప్రతిష్టిస్తాం
గిరిజన ఐక్యవేదిక
హైదరాబాద్ (విశాల విశాఖ ప్రతినిది): కొమరంభీమ్ విగ్రహం సిద్ధంగా ఉన్నా ప్రతిష్టించడంలో ప్రభుత్వం తాత్సారం చూపుతోందని గిరిజన ఐక్యవేదిక ఆరోపించింది. ఈ అంశంపై సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.చెల్లప్పను కలిస్తే విగ్రహ ప్రతిష్టకు మరో ఆరునెలలు పడుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపినట్లు చెప్పారని వేదిక కన్వీనర్ వివేక్ వినాయక్ అన్నారు. ఈ సమాధానం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మరో పదిహేను రోజుల్లో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. విగ్రహాన్ని తామే ప్రతిష్టించుకొంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ఆదివాసీ మేధావులు, ప్రజాప్రతినిధుల సదస్సులో వివేక్ వినాయక్ మాట్లాడారు. గిరిజన ప్రాంతాలలో వందలాది మంది విషజ్వరాలు, ఇతర రోగాలతో మరణిస్తున్నారని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంచాయితీరాజ్ ఎన్నికల్లో తమ ప్రాంతంలో కూడా గిరిజనేతరులకు అవకాశాన్ని కల్పించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే రాజారాంలక్య, చందా లింగయ్య దొర, సీడం అర్జులతో పాటు ఆదివాసీ సంఘం నేతలు, రాజకీయ నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని తీర్మానం రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని వివేక్ వినాయక్ తెలిపారు.
హైదరాబాద్ (విశాల విశాఖ ప్రతినిది): కొమరంభీమ్ విగ్రహం సిద్ధంగా ఉన్నా ప్రతిష్టించడంలో ప్రభుత్వం తాత్సారం చూపుతోందని గిరిజన ఐక్యవేదిక ఆరోపించింది. ఈ అంశంపై సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.చెల్లప్పను కలిస్తే విగ్రహ ప్రతిష్టకు మరో ఆరునెలలు పడుతుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపినట్లు చెప్పారని వేదిక కన్వీనర్ వివేక్ వినాయక్ అన్నారు. ఈ సమాధానం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. మరో పదిహేను రోజుల్లో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. విగ్రహాన్ని తామే ప్రతిష్టించుకొంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ఆదివాసీ మేధావులు, ప్రజాప్రతినిధుల సదస్సులో వివేక్ వినాయక్ మాట్లాడారు. గిరిజన ప్రాంతాలలో వందలాది మంది విషజ్వరాలు, ఇతర రోగాలతో మరణిస్తున్నారని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముఖ్యంగా పంచాయితీరాజ్ ఎన్నికల్లో తమ ప్రాంతంలో కూడా గిరిజనేతరులకు అవకాశాన్ని కల్పించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్‌లోక్‌పాల్ ఉద్యమానికి వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే రాజారాంలక్య, చందా లింగయ్య దొర, సీడం అర్జులతో పాటు ఆదివాసీ సంఘం నేతలు, రాజకీయ నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని తీర్మానం రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని వివేక్ వినాయక్ తెలిపారు.
సానుభూతి కోసమే టక్కు, టమార విద్యలు: బొత్స
హైదరాబాద్ (విశాల విశాఖ): కడప ఎంపీ జగన్ సానుభూతి కోసం టక్కు, టమార, గజకర్ణ, గోకర్ణ విద్యలు అవలంభిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ ద్వారా పెద్దవాడై ఇప్పుడు పార్టీనే విమర్శిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వానికి ఓ చట్టం ఉంటుందని దాన్ని ఉల్లఘించి అడ్డగోలుగా దోచుకున్నవారు ఇప్పుడు అనుభవిస్తున్నారని బొత్స వ్యాఖ్యానించారు. గాంధీభవన్ ప్రకాశం హాల్‌లో జరిగిన కృష్ణాజిల్లా కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)