లాన్ ఏంజెలిన్ : భారత సంగీతకారుడు ఏఆర్‌ఇ రెహమాన్ 127 అవర్స్ సినిమాకోసం చేసిన సంగీతానికి ప్రతిష్ఠాత్మక వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డు గెలుచుకున్నారు. పబ్లిక్ ఛాయిస్ విభాగంలో ఆయనకి అవార్డు దక్కింది. గతంలో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి రెండు ఆస్కార్‌లు, రెండు గ్రామీలు అందుకున్నారు. ఇప్పుడు 127 అవర్స్ సినిమాకు తాజా అవార్డు గెలుచుకున్నారు. పబ్లిక్ చాయిస్ అవార్డు ఇచ్చినందుకు వరల్డ్ సౌండ్ ట్రాక్ అకాడమీకి నా అభిమానులకు రెహమాన్ కృతజ్ఞతలు తెలిపారు.
24, అక్టోబర్ 2011, సోమవారం
ఏఆర్ రెహమాన్‌కి వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డు
తెలంగాణ ఉద్యోగుల సమ్మె విరమణ
హైదరాబాద్ : సకల జనుల సమ్మెను తెలంగాణ ఉద్యోగులు విరమించారు. రేపటి నుంచి తెలంగాణ ఉద్యోగులు సమ్మె విరమించి విధులకు హాజరుకానున్నారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీఆజాద్ హామీ ఇచ్చారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. సమ్మె విరమించమని ఢిల్లీ నుంచి ఆజాద్ కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. సమ్మె విరమణ పత్రంపై టి. ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశారు.
20, అక్టోబర్ 2011, గురువారం
ఏడువేల అంత్యోదయ కార్డుల పంపిణీకి నిర్ణయం
పాడేరు(విశాల విశాఖ): ప్రతిష్టమైన చర్యల ద్వారా విశాఖ ఏజెన్సీలో ప్రజా పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ తహసీల్దార్లకు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిజన శంకర్ ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పంపిణీ,6వ విడత భూ పంపిణీకి అవసరమయ్యే భూ సేకరణపై ఏజెన్సీలోని తహసీల్దార్‌లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.జిల్లాలో అతి పేదలైన వారికి పంపిణీకి ఏడువేల అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు అందించేందుకు నిర్ణయించామన్నారు. అందులో 5వేల 500 ఎ.ఎ.వై. కార్డులు ఏజన్సీకి ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ఈ కార్డులపై 35 కేజీలు బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ప్రాధాన్యతను బట్టి ఆదిమ జాతుల తెల్లరేషన్ కార్డులను ఎ.ఎ.వై. కార్డులుగా మార్చి డిశంబర్ నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. 6వేల టన్నుల సామర్ధ్యం గల పాడేరు జి.సి.సి. గోడౌన్‌లో పూర్తి స్థాయి నిల్వలు ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.బియ్యం, గోదుమ, కిరోసిన్ పంపిణీలో తూనికలు సరిగా ఉండేటట్లు చూడాలన్నారు. రాబోయే కాలంలో నియోజక వర్గ మండలాల్లో 5వేల దీపం కనెక్షన్లకు నమోదులు స్వీకరించాలన్నారు. 6వ విడత అటవీ భూముల పంపిణీకి అన్ని మండలాల్లో సర్వేలు పూర్తి చేయాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ భూ సేకరణ యొక్క రికార్డుల పని సంపూర్ణంగా ఉండాలన్నారు. భూ సేకరణ మెదర్‌మెట్స్, మెన్యూవల్స్ తయారీలను ముందు చేయాలన్నారు. తరువాత సిఎడి, సిఎఎం.పద్ధతిలో కంప్యూటర్‌లో పొందు పర్చాలన్నారు. ఏజెన్సీలోని అన్ని తాలుక కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందన్నారు. మండలాల వారిగా సమీక్ష చేస్తూ సిబ్బంది కొరత ఉన్న, మావోయిస్టుల సమస్య ఉన్న అంకితభావంతో విధి నిర్వహణ చేస్తున్నామన్నారు. అడంగల్, బేెసిక్ ప్రాతిపధికన భూ సేకరణకు వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆరువేల రేషన్ కార్డులు ఉన్న చోట ఒక డిఆర్‌డిపో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో సర్వే సహాయ సంచాలకులు, 11 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
18, అక్టోబర్ 2011, మంగళవారం
ప్రత్యేక రాష్ట్రాన్ని కోరడం అసందర్భం: పరకాల ప్రభాకర్
రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం అసందర్భం, అసంమజసమని ప్రముఖ పాత్రికేయడు పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఈనెల 22, 23 తేదీల్లో విశాలాంధ్ర మహాసభను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ వర్క్‌షాపులో అన్ని విషయాలను చర్చిస్తామని ఆయన తెలిపారు.దీనిపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్రపై ఈనెల 22, 23 తేదీల్లో నగరంలోని జూబ్లీహాల్‌లో వర్కషాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే, ప్రత్యేక తెలంగాణపై పరకాల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై తెలంగాణ వాదులు దాడి చేసేందుకు యత్నించగా, పోలీసుల జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
ఈటెల రాజేందర్‌కు బెయిల్ నిరాకరించిన రైల్వే కోర్టు!
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌కు సికింద్రాబాద్ రైల్వే కోర్టు మంగళవారం కూడా బెయిల్ నిరాకరించింది. దీంతో గత మూడు రోజులుగా జైల్లోనే ఉంటున్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శనివారం రోజు ఈటెల రాజేందర్ హైదరాబాద్‌లో రైలు రోకోలో పాల్గొన్న విషయం తెల్సిందే.రైల్వే ఆస్తుల పరిరక్షణ చట్టం కింద ఈటెలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలుకు తరలించారు. శనివారం నుంచి బెయిల్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నా రైల్వే కోర్టు మాత్రం ఆయనకు బెయిల్ నిరాకరించింది.ఈటెలతో పాటు.. మరికొంతమంది తెరాస నేతలకు శని, ఆదివారాల్లో బెయిల్ లక్ష్యమైంది. మెదక్ ఎంపీ విజయశాంతికి ఆదివారం బెయిలు రాగా, కాంగ్రెస్ నేతలు పొన్నం, జీవన్ రెడ్డిలకు సోమవారం బెయిలు లభించింది. కానీ, ఈటెలకు మాత్రం మంగళవారం కూడా రైల్వే కోర్టు బెయిల్ నిరాకరించింది
14, అక్టోబర్ 2011, శుక్రవారం
సహ చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది
ప్రధాని మన్మోహన్‌సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం వల్ల వస్తున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని దానిని సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) శుక్రవారం నిర్వహించిన రెండు రోజుల వార్షిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనితీరు కుంటుపడేలా ఉండకూడదని తెలిపారు. పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ చట్టం... తమ అధికారాల్లోకి చొరబడుతోందని కొందరు అధికారులు భావిస్తున్నారని, దీనిపై సమన్వయాన్ని సాధించాల్సి ఉందని గుర్తు చేశారు. సహచట్టం వల్ల నిజాయితీగల అధికారులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థను జవాబుదారీగా ఉంచేందుకు సహచట్టానికి మరింత పదును తెస్తామని అన్నారు. అవినీతి గుట్టును రట్టు చేసే వారికి రక్షణ కల్పించే చట్టాన్ని మరో అయిదు నెలల్లో తెస్తామన్నారు.
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం వల్ల వస్తున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని దానిని సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) శుక్రవారం నిర్వహించిన రెండు రోజుల వార్షిక సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వల్ల ప్రభుత్వ పనితీరు కుంటుపడేలా ఉండకూడదని తెలిపారు. పారదర్శకత కోసం ఉద్దేశించిన ఈ చట్టం... తమ అధికారాల్లోకి చొరబడుతోందని కొందరు అధికారులు భావిస్తున్నారని, దీనిపై సమన్వయాన్ని సాధించాల్సి ఉందని గుర్తు చేశారు. సహచట్టం వల్ల నిజాయితీగల అధికారులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థను జవాబుదారీగా ఉంచేందుకు సహచట్టానికి మరింత పదును తెస్తామని అన్నారు. అవినీతి గుట్టును రట్టు చేసే వారికి రక్షణ కల్పించే చట్టాన్ని మరో అయిదు నెలల్లో తెస్తామన్నారు.
తెరాస శాసనసభ్యుడు కేటీఆర్ అరెస్టు, విడుదల
హైదరాబాద్: తెరాస శాసనసభ్యుడు కె. తారకరామారావును పోలీసులు అరెస్టు చేశారు. సీతాఫలమండిలో ఓ ఇంట్లో ఉన్న కేసీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరెస్టు అక్రమమంటూ తెలంగాణ వాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అరెస్టును అడ్డుకున్నారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటికి పోలీసులు కేటీఆర్‌ను మరల అక్కడే విడిచిపెట్టారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




