* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

1, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఊబకాయంతో ఆరోగ్యానికి సమస్యలెన్నో...!!

ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని పీడిస్తున్న సమస్య ఊబకాయం. ఇది కొందరిలో వారసత్వం కారణంగా కూడా వస్తుందని పరిశోధకులు తేల్చారు. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హృద్రోగం, టైప్-2, మధుమేహం, కీళ్ళనొప్పులు వంటి సమస్యలు వస్తాయి. కేలరీలు అధికమోతాదులో ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరకశ్రమ చేయక పోవడంతో బరువు పెరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైన మందుల వాడకం వల్ల హార్మోన్ల మార్పుల వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
ఊబకాయ వల్లే వచ్చే దుష్పలితాలు:
ఊబకాయంతో బాధపడే వ్యక్తి జీవిత కాలాన్ని తగ్గిస్తుంది. అంటే చిన్న వయస్సులోనే దీని బారిన పడితే తక్కువకాలం జీవిస్తారని వైద్యులు చెపుతున్నారు. ఊబకాయంతో బాధపడుతున్న వారిలో సాధారణ పౌరుల ఆరోగ్యం కంటే ఆరింతలు అధికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా, హృద్రోగం, రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మధుమేహం, నడుంనొప్పి, కీళ్ళలో రక్తప్రసరణ సరిగా లేకపోవడం, రక్తం గడ్డకట్టడం, నిద్రలేమి లేదా అధికనిద్ర, పిత్తాశయ వ్యాధులు సోకుతాయి.
ఎలా తగ్గించుకోవచ్చు?
ఈ ఊబకాయాన్ని వ్యాయామాలు ద్వారా, ఆహారంలో మార్పులు చేర్పులు చేయడం ద్వారా కొంతమేరకు తగ్గించుకోవచ్చు. తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు, చక్కెర, ఉప్పు, కూల్‌డ్రింక్స్, జంక్‌ఫుడ్స్, తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, ఎత్తుకు తగిన బరువు ఉండేలా క్రమం తప్పకుండా చూసుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి