చోడవరం(విశాల విశాఖ): కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీని విమర్శించే స్థాయి జగన్‌వర్గం నాయకుడు అంబటి రాంబాబుకు లేదని మంత్రి బాలరాజు అన్నారు. విజయరామరాజుపేటలోఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాపై అంబటి చేసిన వాఖ్యల పట్ల మండిపడ్డారు. ఆమెపై చేసిన వాఖ్యల్ని ఉపసంహరించుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశం కోసం పదవుల్ని సైతం త్యజించిన సోనియాపై విమర్శలు చెయ్యడం అంబటి లాంటి వ్యక్తులకు తగదని పేర్కొన్నారు. తన స్థాయిని పెంచుకోవడానికి, ప్రచారం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ నాయకులు కలిస్తే మంచి పరిణామమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
1, ఫిబ్రవరి 2011, మంగళవారం
అంబటి క్షమాపణ చెప్పాలి: మంత్రి బాలరాజు
125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరువు తీశారు : వీహెచ్
హైదరాబాద్ : దేశ రక్షణ మంత్రి ఏకే ఆంటోనిని చిరంజీవి ఇంటికి రాయబారానికి పంపి 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని, హైకమాండ్ తీరుపై తనకు ఎంతో బాధ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. అంత తొందరేమొచ్చిందని చిరంజీవితో పొత్తుకు వెంపర్లాడుతున్నారని కాకా ప్రశ్నించారు. ఆంటోని సోనియా దూతంగా కేవలం చిరంజీవని కలవడానికే రావడం తనకు అవమానంగా ఉందని, చిరంజీవిని ఢిల్లీకి పిలిపిస్తే వెళ్లకపోదునా? అని ఆయన అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని విమర్శించిన చిరంజీవితో పొత్తును భరించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి రావడాన్ని ఇవాళ ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నారు. వారు తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారని కాకా అన్నారు.
పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం
పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చచిపోయారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మోటార్‌సైకిల్‌ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు చనిపోయారు.
తల్లిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు
చిత్తూరు : తల్లి తిండి పెట్టడం లేదని గొడవచేసినందుకు దారుణంగా ఆమెను చంపిన కొడుకుకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వుంగనూరు మండలం భగత్‌సింగ్ కాలనీకి చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి తనకు తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడని అతని తల్లి తరచూ ఘర్షణ పడేది. దీంతో ఓరోజు రెడ్డప్ప తల్లి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమె తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ సంఘటన 3-5-2010న జరిగింది. ఆ కేసులో రెడ్డప్ప 14 రోజులు రిమాండ్‌లో ఉండి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. మదనపల్లి రెండవ అదనపు కోర్టులో ఈ కేసు తదుపరి విచారణ ఈరోజు జరిగింది. రెడ్డప్పకు జడ్జి సుమలత జీవిత ఖైదు, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
చిరంజీవి నివాసంలో ప్రరాపా ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం భేటీ అయ్యారు. ప్రరాపాను విలీనం చేయాలి లేదా మంత్రివర్గంలో చేరాలంటూ కాంగ్రెస్ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాసేపు పాల్గొన్న చిరంజీవి అనంతరం తిరుపతి పర్యటనకు బయల్దేరి వెళ్లారు. చిరంజీవి నివాసంలో ఇంకా ఈ సమావేశం కొనసాగుతోంది
31, జనవరి 2011, సోమవారం
విశాఖలో అర్థరాత్రి రింగ రింగా హీరోయిన్ విమల హైడ్రామా
విశాఖపట్నం: రింగ రింగా సినిమా హీరోయిన్ విమల సోమవారం అర్థరాత్రి విశాఖపట్నంలో హైడ్రామా సృష్టించారు. ప్రశాంత్ అనే యువకుడు తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పి ప్రశాంత్ అనే యువకుడు ఓ దర్శకుడి పేరు చెప్పి తనను లాడ్జీకి ఆహ్వానించాడని, తాను లాడ్జికి వెళ్లానని, దాంతో అతను తనపై దాడి చేశాడని ఆమె ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ తన వెంట పడుతున్నాడని కూడా ఆమె ఆరోపించారు. తనకు మత్తు మందు ఇచ్చాడని, తన జుట్టు కత్తిరించాడని, ఆ తర్వాత దాడి చేశాడని ఆమె పోలీసులకు చెప్పారు.పోలీసు స్టేషన్‌కు వచ్చిన సమయంలో విమల మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె శరీరంపై చిన్ని చిన్న గాట్లు ఉన్నాయని వారు చెప్పారు. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, విమల ఫిర్యాదులోని నిజానిజాలను తెలుసుకోవడానికి కూడా వారు ప్రయత్నిస్తున్నారు. విమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రచారం కోసమే విమల నాటకమాడుతోందా అనే కోణం నుంచి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు విమల ఇంతకు ముందు రెండు తమిళ సినిమాల్ోల నటించారు. ప్రస్తుతం రింగ రింగా సినిమాలో నటిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



