* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

2, ఫిబ్రవరి 2011, బుధవారం

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం

లారీ డ్రైవర్‌ మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. లారీ-బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈప ప్రమాదంలో లారీ డ్రైవర్‌ చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన 24 మందిని విశాఖలోని కింగ్‌ జార్జి ఆసుపత్రికి తరలించారు.

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

అంబటి క్షమాపణ చెప్పాలి: మంత్రి బాలరాజు

చోడవరం(విశాల విశాఖ): కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీని విమర్శించే స్థాయి జగన్‌వర్గం నాయకుడు అంబటి రాంబాబుకు లేదని మంత్రి బాలరాజు అన్నారు. విజయరామరాజుపేటలోఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియాపై అంబటి చేసిన వాఖ్యల పట్ల మండిపడ్డారు. ఆమెపై చేసిన వాఖ్యల్ని ఉపసంహరించుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశం కోసం పదవుల్ని సైతం త్యజించిన సోనియాపై విమర్శలు చెయ్యడం అంబటి లాంటి వ్యక్తులకు తగదని పేర్కొన్నారు. తన స్థాయిని పెంచుకోవడానికి, ప్రచారం కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ నాయకులు కలిస్తే మంచి పరిణామమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

125 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పరువు తీశారు : వీహెచ్‌

హైదరాబాద్‌ : దేశ రక్షణ మంత్రి ఏకే ఆంటోనిని చిరంజీవి ఇంటికి రాయబారానికి పంపి 125 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ పరువు తీశారని, హైకమాండ్‌ తీరుపై తనకు ఎంతో బాధ కలిగించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు అన్నారు. అంత తొందరేమొచ్చిందని చిరంజీవితో పొత్తుకు వెంపర్లాడుతున్నారని కాకా ప్రశ్నించారు. ఆంటోని సోనియా దూతంగా కేవలం చిరంజీవని కలవడానికే రావడం తనకు అవమానంగా ఉందని, చిరంజీవిని ఢిల్లీకి పిలిపిస్తే వెళ్లకపోదునా? అని ఆయన అన్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్‌ పార్టీని, సోనియాగాంధీని విమర్శించిన చిరంజీవితో పొత్తును భరించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చిరంజీవి ఇంటికి రావడాన్ని ఇవాళ ప్రతీ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నారు. వారు తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారని కాకా అన్నారు.

పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చచిపోయారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద మోటార్‌సైకిల్‌ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొనింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు చనిపోయారు.

తల్లిని చంపిన కొడుకుకు జీవిత ఖైదు

చిత్తూరు : తల్లి తిండి పెట్టడం లేదని గొడవచేసినందుకు దారుణంగా ఆమెను చంపిన కొడుకుకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వుంగనూరు మండలం భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి తనకు తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడని అతని తల్లి తరచూ ఘర్షణ పడేది. దీంతో ఓరోజు రెడ్డప్ప తల్లి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమె తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ సంఘటన 3-5-2010న జరిగింది. ఆ కేసులో రెడ్డప్ప 14 రోజులు రిమాండ్‌లో ఉండి, అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. మదనపల్లి రెండవ అదనపు కోర్టులో ఈ కేసు తదుపరి విచారణ ఈరోజు జరిగింది. రెడ్డప్పకు జడ్జి సుమలత జీవిత ఖైదు, 500 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

చిరంజీవి నివాసంలో ప్రరాపా ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌: ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం భేటీ అయ్యారు. ప్రరాపాను విలీనం చేయాలి లేదా మంత్రివర్గంలో చేరాలంటూ కాంగ్రెస్‌ ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి తొమ్మిది మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాసేపు పాల్గొన్న చిరంజీవి అనంతరం తిరుపతి పర్యటనకు బయల్దేరి వెళ్లారు. చిరంజీవి నివాసంలో ఇంకా ఈ సమావేశం కొనసాగుతోంది

విలీనం వార్తలు నిజం కాదు: పీఆర్పీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌తో విలీనం వార్తలను ప్రజారాజ్యం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు ఖండించారు. చిరంజీవిని అధిష్టానం తరపున ఢిల్లీకి ఆహ్వానించేందుకే ఆంటోని వచ్చారని విలీనంపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు.