* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

12, మే 2011, గురువారం

కేరళలో సత్యసాయి ఆలయ నిర్మాణం!

తిరువనంతపురం: కేరళలో త్వరలో సత్యసాయిబాబా ఆలయాన్ని నిర్మించనున్నారు. థొనక్కల్‌లోని సాయి గ్రామంలో ఏర్పాటయ్యే ఆలయంలో సత్యసాయి వెండి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ట్రావెంకోర్‌ రాజకుటుంబం ఈ వెండి విగ్రహాన్ని బహూకరించేందుకు ముందుకు వచ్చింది. ఇక్కడి శ్రీ సత్యసాయి శరణాలయ ట్రస్ట్‌ ప్రతినిథి ఆనందకుమార్‌ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. భగవాన్‌ సాయిబాబా జన్మదినమైన నవంబరు 23వ తేదీన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన జరుగుతుందని తెలిపారు.

సెప్టెంబర్‌ 18న సీడీఎస్‌ పరీక్ష

న్యూఢిల్లీ: రక్షణ దళాల్లో ప్రవేశాల కోసం కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (సీడీఎస్‌) పరీక్ష-2ను సెప్టెంబర్‌ 18న నిర్వహించనున్నట్లు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) తెలిపింది. భారత మిలటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో 2012 జులైలో ప్రారంభమయ్యే కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2012 అక్టోబర్‌లో చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో మొదలయ్యే కోర్సు (మహిళలు, పురుషులు) కోసం కూడా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించింది. అర్హత, సిలబస్‌, పరీక్ష విధానం, దరఖాస్తు విధానం వంటి వివరాల కోసం మే 7 2011 నాటి ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌/ రోజ్‌గార్‌ సమాచార్‌ చూడాలని కోరింది. పూర్తివివరాలు www.upsc.gov.in వెబ్‌సైట్‌లో కూడా లభ్యమవుతాయని తెలిపింది.

6, మే 2011, శుక్రవారం

కనిమొళి బెయిల్‌ అభ్యర్థనపై న్యాయస్థానం విచారణ

న్యూఢిల్లీ: 2జి స్కామ్‌ కేసుకు సంబంధించి డీఎంకే ఎంపీ కనిమొళి ముందస్తు బెయిల్‌ కోరడంతో దానిమీద ఈరోజు విచారణ జరుగుతోంది. న్యాయస్థానానికి వచ్చిన కనిమొళి ఈ విషయమై వ్యాఖ్యానిస్తూ 'కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం...' అన్నారు.
 

మూడో రోజుకు చేరిన జూనియర్‌ డాక్టర్ల సమ్మె

వరంగల్‌: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యుల సమ్మె మూడో రోజుకు చేరింది. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

1, మే 2011, ఆదివారం

విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ఆరుగురి మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా అచ్యుతాపురం వద్ద చెట్టును జీపు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సంఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. చీపురుపల్లి నుంచి విజయనగరం వస్తుండగా జీపు టైరు పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.

కడప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి

కడప : ఇందిరమ్మ రాజ్యం కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అలాంఖాన్‌పల్లె, చెన్నూరు. ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు. బద్వేలు, పోరుమామిళ్ల... తదితరప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకోవాల్సింది ప్రజలేనని ఆయన అన్నారు.

తెలుగుదేశంలో చేరనున్న రాజశేఖర్‌ దంపతులు

హైదరాబాద్‌ : సినీనటుడు రాజశేఖర్‌ దంపతులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. రాజశేఖర్‌, ఆయన సతీమణి జీవితలు ఈ అంశమై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సోమవారం రాజశేఖర్‌ దంపతులు తెలుగుదేశంలో చేరనున్నారు.