* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

14, ఫిబ్రవరి 2011, సోమవారం

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం

ఆదిలాబాద్‌(విశాల విశాఖ): ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తాండూరు మండలం బోయపల్లి వద్ద రెండు లారీలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.అదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్థు చేస్తున్నారు.
అనంతపురం: జిల్లాలోని గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు మిర్చియార్డులో నిలిచిన కొనుగోళ్లు

గుంటూరు(విశాల విశాఖ): గుమస్తాల ఆందోళనతో గుంటూరు మిర్చియార్డులో కొనుగోళ్లు నిలిచిపోయాయి. మిర్చియార్డులో కమిషన్‌ వర్తక గుమస్తాలు ఈ ఉదయం ఆందోళన చేపట్టారు. నిబంధనలను సడలించాలని డిమాండ్‌ చేస్తూ నరసరావుపేట రహదారిపై గుమస్తాలు బైఠాయించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గుమస్తాల ఆందోళన కారణంగా కొనుగోళ్లు నిలిచిపోయాయి.

విశాఖలో పోలీసులపైకి దూసుకెళ్లిన లారీ

ఐదుగురి పరిస్థితి విషమం
విశాఖ : ఎలమంచిలి సమీపంలోని పెద్దపల్లి జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీని ఢీకొని గ్యాస్‌ సిలిండర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటన అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులపైకి వేగంగా వస్తున్న మరో లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏఎస్సై డి.సూర్యనారాయణ, కానిస్టేబుల్‌ బోడయ్య, హోంగార్డులు ప్రసాద్‌, అప్పారావు, రామారావు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అవిశ్వాసం ఎదుర్కొనేందుకు సిద్ధం

 పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌
హైదరాబాద్‌-న్యూస్‌టు: అవిశ్వాస తీర్మానాన్ని ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తెలిపారు. ''ఆ తీర్మానం అనుమతి పొందుతుందా? నిబంధనల ప్రకారం కనీసం 30 మంది సభ్యులు ఉండాలి. తెరాసకు 11 మందే ఉన్నారు. ఒకవేళ భాజపాను కలుపుకొన్నా మొత్తమ్మీద 13 మందే అవుతారు. కేసీఆర్‌ తీర్మానం పెట్టమనండి మేమైతే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం'' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తెదేపాతో తాముకుమ్మక్యయ్యామనడాన్ని సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఖండించారు. సహాయ నిరాకరణపై ఆయన స్పందిస్తూ.. ప్రజలకు మేలు జరక్కపోయినా.. వారికి ఇబ్బంది మాత్రం కలుగకూడదన్నారు. సహాయ నిరాకరణ వల్ల.. రోజుకూలీతో బతుకుతున్న కూలీల పరిస్థితేంటన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున       ఈ కార్యక్రమంపై పునరాలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి నచ్చజెబుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి కొండా సురేఖపై అధిష్ఠానం సమీక్షిస్తోందని సరైన సందర్భంలో నిర్ణయం తీసుకుంటారని డీఎస్‌ తెలిపారు.  

రోడ్డు ప్రమాదంలో 21మంది మృతి

రాజస్థాన్‌: రాజస్థాన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 21మంది మృతి చెందారు. నాగౌర్‌ వద్ద లారీ-వ్యాను ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 19మంది మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

రంగారెడ్డి కలెక్టరేట్‌ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌(విశాల విశాఖ): బోధనాఫీజులను వెంటనే చెల్లించాలని కోరుతూ ఎస్‌.ఎఫ్‌.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రంగారెడ్డి కలెక్టరేట్‌ముందు ధర్నా చేశారు. లోపలికి వెళ్లేందుకు వారు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

మార్చిలో మాపార్టీ వస్తుంది: జగన్‌

హైదరాబాద్‌: వైఎస్సార్‌ ఆశయాలను, పథకాలనురాష్ట్రప్రభుత్వం ఒక్కటొక్కటిగా భ్రష్టు పట్టిస్తోందని అందుకే ఆయన ఆశయాలను సాధించేందుకు గాను కొత్త పార్టీ పెడుతున్నామని వై.ఎస్‌.జగన్‌ అన్నారు. బద్వేల్‌లో ఆయన ఈ విషయం తెలిపారు. మార్చిలో ఇడుపులపాయలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌ స్మృతిచిహ్నం వద్ద తమ పార్టీని ప్రకటిస్తామన్నారు.