యుపీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రచారంలో భాగంగా ఆదివారం నగరానికి వచ్చారు. జూబ్లీ హాల్‌లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే అయన సమావేశం ముగించుకుని వెళ్ళిన కాసేటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.తాజ్ కృష్ణాలో ప్రణబ్‌ను ముఖ్యమంత్రి కలిశారు. ప్రమాద ఘటనను వివరించారు. ప్రణబ్ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది చిన్న ప్రమాదమే అని, అధికారులు అప్రమత్తమై చల్లార్చారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కాగా దట్టమైన పొగలు అలుముకోవడంతో జూబ్లీ హాల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి