* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

5, ఫిబ్రవరి 2011, శనివారం

విలీనం పై చిరంజీవిక పవన్ కళ్యాణ్ మంతనాలు

ఢిల్లీ బయలుదేరే ముందు అన్నయ్య చిరంజీవితో తమ్ముడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన తర్వాత చిరంజీవి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఏం జాగ్రత్తలు చెప్పారనేది ఆసక్తిగా మారింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కాబోతోందని, వివరాలు అన్నయ్యనే వెల్లడిస్తారని పవన్ కళ్యాణ్ చిరంజీవితో భేటీకి ముందు చెప్పారు. దీన్ని బట్టి కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం కావడమనేది లాంఛనమేనని తెలుస్తోంది.కాంగ్రెసు నాయకత్వంతో, సోనియాతో వ్యవహరించాల్సిన తీరుపై పవన్ చిరంజీవితో మాట్లాడినట్లు తెలుస్తోంది. సమైక్యావదంపై, తెలంగాణ అంశంపై పవన్ అన్నయ్యతో మాట్లాడినట్లు చెబుతున్నారు. చిరంజీవిని ముఖ్యమంత్రి పీఠం మీద చూడాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. కాంగ్రెసుతో దోస్తీ అందుకు అనుగుణంగానే ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెసు కూడా చిరంజీవితో దోస్తీపై పవన్ కళ్యాణ్, ఇతర సినీ స్టార్ల మద్దతును కూడా దృష్టిలో పెట్టుకునే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.

సాయుధ బలగాల్లో 53 వేల ఖాళీల భర్తీ

హైదరాబాద్‌: దేశంలో మొదటిసారిగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంలోని ప్రత్యేక దళాలతోపాటు సాయుధ బలగాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సమాయత్తం అవుతోంది. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన సూచనలను అనుసరించి ఎస్‌ఎస్‌సీ దేశవ్యాప్తంగా సాయుధబలగాల్లో 53వేల ఖాళీలను భర్తీ చేసేందుకు సమాయత్తం అవుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ కార్యాలయాల్లోని గ్రూప్‌ బి స్థాయి ఖాళీలను భర్తీ చేసే ఎస్‌ఎస్‌సీ తాజాగా సాయుధ బలగాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తుండటం ఇదే ప్రథమం. దీనికోసం కమిషన్‌ ఈరోజు నోటిఫికేషన్‌ జారీ చేసింది. బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ బలగాలతోపాటు ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్‌లో భర్తీచేసే కొత్త ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు శారీరక దృఢత్వంకలిగినవారు అర్హులని, సాయుధబలగాల్లోని ఖాళీలను ఆరునెలల్లో భర్తీ చేస్తామని ఎస్‌ఎస్‌సీ ఛైర్మన్‌ రఘుపతి తెలిపారు.

ఆటోను ఢీకొన్న ఎమ్మెల్యే వాహనం: ఇద్దరు మృతి

మెదక్‌: పుల్కల్‌ మండలం చౌటాపూర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వాహనం ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

చర్చించాకే తుది నిర్ణయం: చిరు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హస్తినకు బయలుదేరారు. కాంగ్రెస్‌ పెద్దల ఆహ్వానం మేరకే తాను ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. ఇరు పార్టీల సహాయసహకారాలపై రేపటి సమావేశంలో చర్చించాకే భవిష్యత్తు కార్యచరణపై ఓ నిర్ణయానికి వస్తామన్నారు.

రూ.400 పెరిగిన వెండి ధర

న్యూఢిల్లీ: వెండి ధర రోజు రోజుకీ చుక్కల్ని తాకుతోంది. బులియన్‌ మార్కెట్లో రూ. 400 పెరిగిన వెండి కిలో 44,800లకు చేరింది. స్థానికంగా బంగారానికి డిమాండ్‌ పెరగడంతో రూ.10 పెరిగి 10గ్రాములు రూ.20,405 అయ్యింది.

2, ఫిబ్రవరి 2011, బుధవారం

దమ్ముంటే నన్ను సస్పెండ్‌ చేయమనండి: వెంకటస్వామి

హైదరాబాద్‌: సోనియాపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామిస్పష్టం చేశారు. దమ్ముంటే తనను సస్పెండ్‌ చేయాలని అధిష్టానాన్నిసవాలుచేశారు. కొత్త పార్టీ తప్పక వస్తుందని సమయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని ఆయనన్నారు.

వెంకటస్వామి వ్యాఖ్యలపై డీఎస్‌ నివేదిక

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీపై పార్టీ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి చేసిన తీవ్ర వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. మీడియాలో తీవ్ర చర్చ జరగటంతో ఈ విషయంపై అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీఎస్‌ను నివేదిక కోరింది. ఈ మేరకు ఆయన ఈరోజు అధిష్టానానికి నివేదిక పంపారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటల పూర్తి వివరాలు, క్లిప్పింగులను జతచేసి పంపారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు.