* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

1, సెప్టెంబర్ 2011, గురువారం

గాజువాకలో మహగణపతి

గాజువాక, : రాష్ట్రంలో అతిపెద్ద గణనాథుని విగ్రహాన్ని గాజువాకలో ఏర్పాటు చేయడం ద్వారా పట్టణ ఖ్యాతి మరింత ఇనుమడించిందని గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. బుధవారం గాజువాక లంకావారి మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ గణనాథుడిని అనేక వ్యవప్రయాసలకోర్చి నిర్మించిన స్థానిక సంపత్‌వినాయక అసోసియేషన్‌ సభ్యులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.117అడుగుల ఎత్తు, 55అడుగుల వెడల్పు కలిగిన భారీ గణనాథుని విగ్రహాన్ని మేయర్‌ గురువారం ఉదయం 11.26నిమషాలకు లంకావారి మైదానంలో ప్రతిష్టించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు భారీ వినాయకుని విగ్రహం దోహదపడుందన్నారు. అనంతరం కర్నంరెడ్డి నర్సింగరావు మాట్లాడుతూ 90రోజులుపాటు 200మంది కార్మికులు అహర్నిశలు శ్రమించి 117అడుగుల విగ్రహాన్ని నిర్మించారన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఇల్లపు రాము, కర్నం కనకారావు, సంపత్‌ వినాయకా అసోసియేషన్‌ సభ్యులు శివ, ముఖేష్‌, కనకారావు తదితరులు పాల్గొన్నారు

ఎంపీవీలో వినాయకునికి నైవేథ్యంగా 6,399 కేజీల లడ్డూ

ఎం.వి.పి కాలనీ, (విశాల విశాఖ): ఎంవీపీ కాలనీలోని సంపత్‌ వినాయక యూత్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎఎస్‌ రాజా కళాశాల గ్రౌండ్స్‌లో 112 అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సుమారు 50 మంది కార్మికులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇంత భారీ విగ్రహానికి భారీ లడ్డూ నైవేథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో 6,399 కేజీల లడ్డూను తయారు చేయించారు. సువర్ణభూమి రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇందుకుగానూ రూ.10.50 లక్షలు ఖర్చు చేసింది. ఈ లడ్డూను తాపేశ్వరంలోని భక్తాంజనేయ సీట్స్‌ సంస్థ తయారు చేసింది. 15 మంది గణేష్‌ మాలలు ధరించి, లడ్డూను ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు.ఈ లడ్డూ తయారీకి 2000కేజీల శనగపండి, చక్కెర 2,100 కేజీలు, నెయ్యి 900 కేజీలు, డ్రైపూట్స్‌ 600 కేజీలు , పటికబెల్లం 450 కేజీలు ఉపయోగించినట్టు తయారీ దారు సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు. తయారీకి 24 గంటల సమయం పట్టిందని, 21 రోజులపాటు పాడవకుండా ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద పరిమాణంలో లడ్డూను ఇంతకముందు ఎవరూ తయారు చేయలేదని, ఆ ఘనత తమ సంస్థకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీ సంపత్‌ వినాయక విశాఖ యూత్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ తుమ్ములూరి జగదీశ్వరరెడ్డి, సువర్ణ భూమి సంస్థ జీఎం మేఘం సతీష్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

నేడు ‘చిరు’తిరుపతి రాక

తిరుపతి సిటి, (విశాల విశాఖ):రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి శాసనసభ్యులు డాక్టర్‌ చిరంజీవి శుక్రవారం తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అధికారిక, అనధికారిక, పార్టీ నాయకులతో కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, వూకా విజయ్‌కుమార్‌లు వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి రెండు రోజుల పర్యటన వివరాలను వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కిరణ్‌రాయల్‌ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి...
* శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 4.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు.
* 5 నుంచి 7 గంటల వరకు పిఆర్‌పి జిల్లా నాయకులతో స్థానిక పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమావేశం.
* 7.15 గంటలకు తిరుమలకు బయల్దేరి టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న కనుమూరి బాపిరాజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవుతారు.
శనివారం పర్యటన వివరాలు
* ఉదయం 9 గంటలకు స్థానిక కాంగ్రెస్‌పార్టీ నాయకులతో పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమావేశం.
* 9.50 గంటలకు హైకోర్టు బెంచి విషయంపై స్థానిక అడ్వకేట్లతో సమావేశం.
* 10.30 గంటలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం.
* 11.30 నుంచి 12 గంటల వరకు స్థానిక పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమస్యలపై అర్జీల స్వీకరణ.
* 12 నుంచి 1 గంట వరకు డ్వాక్రా మహిళలతో సమావేశం.
* 1 నుంచి 2 గంటల వరకు వివిధ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం.
* 1.30 గంటలకు అండర్‌ డ్రైనేజి పనుల పరిశీలన.
* 3 గంటలకు గణేష్‌ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

వాడలవాడలా బొజ్జగణపయ్య ఉత్సవాలు

పరవాడ,(విశాల విశాఖ) సెప్టెంబర్ 1: భక్తిశ్రద్ధలతో గణనాథుని ఉత్సవాలు మండలంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక వైపు ఎడ తెరిపి లేని వర్షం మరో వైపు వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠంచారు. బుధవారం అర్ధరాత్రి నుండి వరుణుడు తన ప్రతాపం చూపడంతో వినాయకుని ఉత్సవాలు ఏర్పాట్లుకు నిర్వహకులు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం 10గంటల వరకు వర్షం కురుస్తునే ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం కాస్త తగ్గడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. పరవాడ పారిశ్రామిక ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. బొజ్జగణపయ్య ఉత్సవాలను నిర్వహించుకునేందుకు గ్రామాల్లో యువకులు పోటీ పడుతున్నారు. విద్యార్థులు సైతం బొజ్జగణపయ్యకు పూజలు చేసేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాలలో రాజకీయ వేత్తలు, అధికారులు పాల్గొన్నారు. వినాయకుని చవితి కారణంగా మండలంలో గల పలు గణేష్ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. మండల కేంద్రమైన పరవాడ బొంకులదిబ్బ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయకుని ఉత్సవాలను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పయిల శ్రీనివాసరావు ప్రారంభించారు. నేతలు పయిల అప్పారావు, పయిల రమణబాబు, పయిల పోతునాయుడు, పయిల గోపాలకృష్ణ, పయిల వెంకటరావు, పయిల పైడంనాయుడు, బండారు చిన్నంనాయుడు, చీపురుపల్లి శ్రీనివాసరావు, పయిల హరీష్, పయిల చిన అక్కునాయుడు, శివ, ముఖేష్, నరేష్, శంకర్, మహేష్, వెంకటరావు, రామునాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలావుండగా జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల వసుధ ఫార్మా కంపెనీలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని విగ్రహాన్ని సంస్ధ ప్రతినిధి ప్రసాద్‌రాజు ప్రతిష్ఠించి తొలి పూజ చేశారు. లారస్‌లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని సంస్థ ప్రతినిధి నర్సింహారావు చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. తానాం షిరిడిసాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలను మాజీ మండలాధ్యక్షుడు పయిల జగన్నాథరావుప్రారంభించారు. తానాం అంబేద్కర్ యూత్ అసోసియేషన్, పండు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పైడిమాంబయూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుని సినిమాహాలు కూడలి ఏర్పాటు చేసి పూజలు చేపట్టారు. రామాలయం వీధిలో కాణిపాకం వినాయకుని రూపంలో గల విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. భరిణికం, వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, లంకెలపాలెం, పి.బోనంగి, కలపాక, వెనె్నలపాలెం, గొర్లెనాయుడు, జూజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో వినాయకుని ఉత్సవాలు ప్రారంభించారు. వినాయకుని చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పందిళ్లు వద్ద రంగు రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్య విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పరవాడ , తానాం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. షిరిడిసాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచముఖ వినాయకుని విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. తానాం ఎస్సీ కాలనీ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహంతో పాటు రొంగలివారి వీధిలో ఏర్పాటు చేసిన శివపార్వతుల మధ్య వినాయకుని విగ్రహం, పులినోట్ల వినాయకుని విగ్రహంతో పాటు కాణిపాకం వినాయకుని రంగంలో ఉన్న విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తుంది.

రాజీనామాలపై పునరాలోచించే పరిస్థితి వస్తుంది: చిరంజీవి

హైదరాబాద్‌: రాజీనామాలు చేసిన 26 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాల విషయంలో పునరాలోచనలో పడే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్‌ నేత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. వినాయకచవితి సందర్భంగా బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చిరంజీవి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్న సుభిక్షంగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని, తాను ఏ స్థాయిలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారనీ ఆయన అన్నారు. వచ్చే పుట్టినరోజునాటికి తన 150 వ చిత్రం వస్తుందని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు.

మీడియాలో 'అతి' నియంత్రణకు కమిటీ!

న్యూఢిల్లీ: మీడియా గోరంతలు కొండంతలు చేసి చెప్పడాన్ని నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఓ కమిటీని వేయాలని యోచిస్తోంది. మీడియా కారణంగానే అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం బలోపేతం అయిందని కొన్ని వర్గాలు చేస్తున్న వాదన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా... మీడియా అతిగా స్పందిస్తున్న తీరును కట్టడి చేయాలనుకుంటోంది. మీడియాలో వచ్చే అలాంటి అంశాలను పరిశీలించేందుకు, ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు కమిటీని నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం జరిగిన కేంద్రకేబినెట్‌ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వార్తల్లో 'అతి'ని నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ కేబినెట్‌ సమావేశంలో అభిప్రాయపడినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి.

కాలినడకన కొండ ఎక్కుతున్న కనుమూరి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త అధ్యక్షునిగా నియమితులైన కనుమూరి బాపిరాజు కాలినడకన తిరుమలకొండ ఎక్కుతున్నారు. ఈరోజు ఉదయం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలకు హాజరైన బాపిరాజు సాయంత్రం తిరుమల కొండకు బయల్దేరారు.