16, జూన్ 2011, గురువారం
జీవీఎంసీ ఆస్తిపన్ను కుంభకోణంలో నలుగురు అరెస్టు
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను కుంభకోణంలో మరో నలుగుర్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బాలకృష్ణ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.7లక్షల నగదు, రూ.3.5లక్షల విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరెస్త్టెన వారిలో జీవీఎంసీ ఉద్యోగులు వై. తిరుపతిరావు, ఎస్.శ్రీనివాసరావు, ఎం. సన్యాసిరావు, ఎండీ ఇస్మాయిల్ ఉన్నారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి ఆరుగుర్ని అరెస్టు చేశారు.
3, జూన్ 2011, శుక్రవారం
ఆర్టీసీ బస్సులో ప్రసవం
హుకుంపేట: ఒక్క ఫోను కలిసి ఉంటే ఆ కన్నతల్లికి కడుపుకోత తప్పేది. రవాణా సదుపాయాలు లేక, వైద్యం అందక పోవడంతో ఓ పసికందు కళ్లు తెరవకుండానే వూపిరి వదిలాడు. ఈ సంఘటన శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని హుకుంపేట మండలంలో చోటు చేసుకుంది. మెరకచింత గ్రామానికి చెందిన పసుపులేటి సత్యవతికి గురువారం రాత్రి నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమె తమ్ముడు, భర్త బాకురు వెళ్లి 108 వాహనానికి ఫోను చేసినా లైన్ దొరకలేదు. శుక్రవారం పాడేరు-బాకురు ఆర్టీసీ బస్సులో అసుపత్రికి బయలుదేరారు. ఘాట్‌రోడ్డులో బస్సు కుదుపులకు నొప్పులు ఎక్కువై ఆమె కూర్చోలేక నిలబడిపోయింది. దీంతో బిరిసింగి గ్రామసమీపాన బస్సులోనే ప్రసవమై పసికందు కింద పడిపోయింది. హుకుంపేట అసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే బిడ్డ మృతి చెందినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. 108వాహనం ఉంటే తమ బిడ్డ బతికేదని తండ్రి అప్పారావు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం
హైదరాబాద్: చంద్రబాబు అధ్యక్షతన ఈ ఉదయం తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. నేడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు జరగనున్న ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం తదితర అంశాలపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నట్లు సమచారం. ఈ సమావేశానికి తెదేపా బహిష్కృత నేత నాగం జనార్దన్ వెంట నడుస్తున్న జోగురామన్న, హరీశ్వర్‌రెడ్డి హాజరుకాలేదు.
తిరుపతిలోని అతిథిగృహంలో భక్తుడు మృతి
తిరుపతి: తిరుపతిలోని శ్రీనివాసం అతిథిగృహంలో చెన్నైకి చెందిన భక్తుడు మృతి చెందాడు. రాత్రి శోచశాలలో మృతిచెంది పడి ఉన్న భక్తుడి మృతదేహాన్ని భద్రతాసిబ్బంది గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదవశాత్తూ మరణించాడా అనే విషయం తెలియడం లేదు. మృతుని వద్ద చెన్నై టి.నగర్ ఆంధ్రాబ్యాంకుకు చెందిన పాస్‌బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
15, మే 2011, ఆదివారం
కాంగ్రెసు పార్టీని ఆంధ్రలో మొయిలీయే భ్రష్టు పట్టించాడు: పాల్వాయి
హైదరాబాద్ (విశాల విశాఖ): వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల వైఫల్యానికి ఉన్నత స్థానంలో ఉన్నవారే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఇటీవలి వరకు రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్‌గా పని చేసిన వీరప్ప మొయిలీ ఓటమికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. మొయిలీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. జగన్ గెలుపు వల్ల కాంగ్రెసుకు ఎలాంటి నష్టం లేదన్నారు.మంత్రివర్గంలో పలువురిని తొలగించాలని సూచించారు. కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెసులో ఉంటూ కాంగ్రెసును నష్ట పరిచే చర్యలు చేపడుతున్నారన్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చెప్పారు. ఈ వైఫల్యం కాంగ్రెసు నేతలు పోస్టుమార్టం నిర్వహించాల్సిన ఆవశ్యకతను చూపించిందన్నారు.
ఆ పదవి వద్దు బాబోయ్
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తదనంతరం ముఖ్యమంత్రి పీఠం కూర్చున్న కొణిజేటి రోశయ్య మరోసారి ఆ పదవి వస్తే వద్దంటున్నారు. రోశయ్య కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మరోసారి ముఖ్యమంత్రి పదవి వస్తే తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించారు. దానికి ఆయన ససేమీరా అని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సంవత్సర కాలంలో అనేక ప్రకృతి వైపరీత్యాలను, ఉద్యమాలను ఎదుర్కొన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు సమస్యలపై బాగానే వర్క్ చేశారనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సమస్య ఆయనకు కంటి మీద నిద్ర లేకుండా చేశాయి. ఆయనకు వయసు కూడా సహకరించక లేదు. అలాంటి పదవిపై మరోసారి కూర్చోవాలని లేదని మాత్రం చెబుతున్నారు.కాగా కడప ఉప ఎన్నికలలో ఓటమిపై కాంగ్రెసు పార్టీ లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జగన్, విజయమ్మ భారీ ఆధిక్యంతో గెలవడంపై ఓసారి కాంగ్రెసు విశ్లేషించుకోవాలన్నారు. ఈ ఓటమికి ఎవరో కొంతమంది బాధ్యులని చేయడం భావ్యం కాదని, అందరూ సమిష్టిగా ఓటమిపై సునిశిత పరిశీలన జరపాలని అభిప్రాయపడ్డారు. టిడిపి పరిస్థితి కూడా కాంగ్రెసుకు భిన్నంగా ఏమీ లేదన్నారు. కడప ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే కాంగ్రెసు జాతీయ స్థాయిలో పటిష్టంగా ఉందని చెప్పారు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)