* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

7, ఆగస్టు 2012, మంగళవారం

భారత్, శ్రీలంక టి20 నేడు..

పల్లెకెలె:శ్రీలంకలోనే సెప్టెంబరులో జరిగే టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కావడానికి, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి భారత జట్టుకు ఇది ఆఖరి అవకాశం. ఐదు వన్డేల సిరీస్‌ను విజయవంతంగా ముగించిన ధోనిసేన పర్యటనలో ఆఖరి మ్యాచ్, ఏకైక టి20లో మంగళవారం శ్రీలంకతో తలపడుతుంది. ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక చేయడానికి ముందు భారత్ ఆడే చివరి టి20 కూడా ఇదే. కాబట్టి జట్టులో స్థానం ఆశిస్తున్న కుర్రాళ్లందరూ సత్తా నిరూపించుకోవడానికి ఇది ఆఖరి అవకాశం. వీరూ, జహీర్ అవుట్: గాయం కారణంగా ఆఖరి వన్డేకు దూరమైన సెహ్వాగ్‌తో పాటు జహీర్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదు. ఇద్దరూ గాయాల కారణంగా స్వదేశానికి వచ్చారు. ఫామ్ పరంగా భారత్ అన్ని విభాగాల్లోనూ బలంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా కోహ్లి, రైనా, ధోని, గంభీర్ జోరుమీదున్నారు. ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌తో పాటు స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ విభాగంలో కీలకం. అటు శ్రీలంక జట్టుకు సంగక్కర సేవలు అందుబాటులో లేవు. జయవర్ధనే, దిల్షాన్, మాథ్యూస్, పెరీరా కీలక ఆటగాళ్లు.


టెక్కలి పోస్టాఫీసులో అగ్రి ప్రమాదం..

శ్రీకాకుళం: టెక్కలి హెడ్ పోస్టాఫీసులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్‌లో ఉన్న విలువైన పత్రాలు దగ్ధమయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తోన్నారు.

7, జులై 2012, శనివారం

చంద్రబాబు బుద్దివచ్చింది : 2014 ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీసి రాజకీయ నాయకులకు వరం ఇచ్చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ బీసీ నేతలకు వంద సీట్లు కేటాయిస్తుందని ఆయన చెప్పారు. పార్టీకి బిసీలు దూరమవుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ వరాన్ని ప్రదానం చేశారు. పార్టీ బిసీ సమస్యల అధ్యయన కమిటీ సమావేశంలో ఆయన శనివారం ఆ ప్రకటన చేశారు. బీసీలకు రాష్ట్రంలో పెద్ద పీట వేసింది తమ పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు.వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 10 వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. చట్టసభల్లో 33 శాతం సీట్లు బీసీలకు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించారు. 2014 ఎన్నికలకు సంబంధించి ఏడాది ముందే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 294 శాసనసభా స్థానాలున్నాయి.బీసీల కోసం భారీ ప్రణాళిక రూపొందించి ప్రజల ముందు ఉంచడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమకు బిసీలు దూరమయ్యారని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ స్వయంగా చెప్పారు. దీంతో బీసీల మద్దతను తిరిగి పొందడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిందని చెప్పాలి.తెలుగుదేశం పార్టీకి బీసీల మద్దతు మొదటి నుంచి గణనీయంగా ఉంటూ వస్తోంది. అయితే, పార్టీ విధానాల వల్ల క్రమంగా బీసీలు దూరమవుతున్న విషయాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది. దీంతో అడుగు ముందుకు వేసి బిసీల కోసం తాము ఉన్నామంటూ, తాము మేలు చేస్తామంటూ ఓ ప్రణాళికను బయటపెట్టేందుకు సిద్ధపడింది.

1, జులై 2012, ఆదివారం

ప్రణబ్‌ సీఎల్పీ సమావేశం తరువాత జూబ్లీహాల్‌లో అగ్నిప్రమాదం

యుపీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రచారంలో భాగంగా ఆదివారం నగరానికి వచ్చారు. జూబ్లీ హాల్‌లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అయితే అయన సమావేశం ముగించుకుని వెళ్ళిన కాసేటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.తాజ్ కృష్ణాలో ప్రణబ్‌ను ముఖ్యమంత్రి కలిశారు. ప్రమాద ఘటనను వివరించారు. ప్రణబ్ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది చిన్న ప్రమాదమే అని, అధికారులు అప్రమత్తమై చల్లార్చారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కాగా దట్టమైన పొగలు అలుముకోవడంతో జూబ్లీ హాల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి.

8, జూన్ 2012, శుక్రవారం

జగన్ 'తెలంగాణ'కు జై!: విజయమ్మ

వరంగల్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించారని ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. ఆమె వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ మనోభావాలు గుర్తించామని జగన్ చెప్పాడని, అమరవీరుల కోసం శ్రద్ధాంజలి కూడా ఘటించాడని, గత ఉప ఎన్నికలలో తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థులపై పార్టీ తరఫున పోటీకి నిలబెట్టలేదని విజయమ్మ చెప్పారు.జగన్ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నందున కొండా సురేఖకు ఓటు వేసి ఆమెను సీమాంధ్ర ప్రాంతంలోని పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తన భర్త దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు ప్రాధాన్యత ఇచ్చే వారని, తెలంగాణ వచ్చినప్పుడు వస్తుందని కానీ అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. అందుకోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని, ప్రాణహిత - చేవెళ్ల ఆయన మానస పుత్రిక అన్నారు. వైయస్ జగన్ గతంలో వచ్చినప్పుడు కొంత అడ్డంకులు ఎదురయ్యాయని, మళ్లీ జగన్ ఇక్కడకు వస్తాడని చెప్పారు.వైయస్ చనిపోయినప్పుడు ఆయన మృతిని తట్టుకోలేక వరంగల్ జిల్లాలోనే 78 మంది మృతి చెందారని, వారందరికీ నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. తాను ఇక్కడకు వచ్చే ముందు జైలుకు వెళ్లి జగన్‌ను కలిశానని, తాను ధైర్యంగా ఉన్నానని, బయటకు వస్తానని, భయం వద్దని చెప్పాడని, ప్రజలను కూడా భయపడవద్దని ప్పమన్నాడన్నారు. మీ ప్రేమ ముందు కుట్రలు, కుతంత్రాలు నిలబడవన్నారు. వైయస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉచిత్ విద్యుత్ ఫైల్ పైన చేశారన్నారు.రైతుల కోసం ప్రతిక్షణం తపించేవాడన్నారు. మహిళలు, మైనార్టీలు, వృద్ధుల సంక్షేమం పైన దృష్టి సారించేవాడన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకు రావాలని సంకల్పించడమే ఆయన చేసిన తప్పా అందుకే జగన్ పైన విచారణ జరుగుతోందా అన్నారు. వైయస్‌ను రోల్ మోడల్ అన్న కాంగ్రెసే ఇప్పుడు అతనిని దోషిగా చూపించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆయన తనయుడు అయినందుకు వైయస్ జగన్‌ను కూడా దోషిగా చిత్రీకరిస్తున్నారని, చివరకు జైలుకు కూడా పంపారన్నారు. వైయస్ అధికారంలో ఉండగా ప్రభుత్వం కార్యకలాపాలలో జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు.వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్‌కు అనేక వ్యాపారాలు ఉన్నాయని, బెంగళూరులో ఉండి అన్నీ చూసుకునే వారన్నారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటపై నిలబడినందుకే కాంగ్రెసు పెద్దలకు నచ్చలేదన్నారు. సాక్షిపై రైడ్, సీజ్, గవర్నమెంట్ యాడ్స్ నిలిపివేత ఇలా వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ బయట ఉంటే తన అభ్యర్థులను గెలిపించుకుంటారనే జైలుకు పంపించారని విమర్శించారు. ఇన్ని రోజులుగా సాక్ష్యులను ప్రభావితం చేయని జగన్ ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల పైన, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ పైన, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పైన తదితరులందరి పైనా విచారణ చేయకుండా జగన్ పైనే చేయడమేమిటని ప్రశ్నించారు. జగన్‌ను అరెస్టు ఎందుకు చేశారని మేం అడిగామని, కానీ వారి నుండి సమాధానం లేదన్నారు. మేమేమైనా విదేశీయులమా అని ప్రశ్నించారు. ప్రచారానికి వస్తుంటే తమ సూటుకేసులు కూడా తనిఖీ చేస్తున్నారని, బాధగా ఉందన్నారు.ఇంత కుట్రపూరితమైన రాజకీయాలను చూసి జగన్‌ను అనవసరంగా రాజకీయాల్లోకి తెచ్చానా అని అనుకున్నానని కానీ, మీ ఆదరణ చూశాక జగన్ రాజకీయ రంగ ప్రవేశం కరెక్ట్ అని భావిస్తున్నానని చెప్పారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయని, వాటిని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. వైయస్ మరణంతో ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ మృతిని ప్రమాదంగా కొట్టి పారేస్తున్నారని అన్నారు.అధికార దాహంతో వైయస్‌ను మేమే చంపుకున్నామని పిసిసి చీఫ్ బొత్స చెబుతున్నారని, ఇంత దారుణం ఇంకోటి ఉందా అన్నారు. వైయస్ బతికుండగా నేను ఎప్పుడైనా బయట కనిపించానా అని ఆమె ప్రశ్నించారు. తన భర్త ముఖ్యమంత్రి అంటే తనకు అధికారం ఉన్నట్టు కాదా అని, అలాంటప్పుడు నాకు రాజకీయ దాహం ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను మీ ముందుకు వచ్చానని చెప్పారు.జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. వైయస్ ద్వారా లబ్ధి పొందిన వారు ఎందరో జగన్‌కు కష్టకాలంలో అండగా నిలబడలేదని, కేవలం కొండా సురేఖ మాత్రమే నిలబడ్డారన్నారు. ఆమె తెలంగాణ కోసమే రాజీనామా చేస్తే ఉద్దేశ్య పూర్వకంగా ఆమోదించలేదని, ఆ తర్వాత రైతులు కోసమంటూ రాజీనామా ఆమోదించారన్నారు. ఈ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం అన్నారు.

4, జూన్ 2012, సోమవారం

గబ్బర్ సింగ్ మార్కెట్ రూ. 128 కోట్లు

ఇది నిజంగా షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్ న్యూసే..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన  గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి(జూన్ 1) వరకు రూ. 128.75 కోట్ల వ్యాపారం చేసిందట. ఈ విషయాన్ని ప్రముఖ బిజినెస్ డైలీ బిజినెస్ స్టాండర్డ్’ తన వెబ్‌సైట్ కథనంలో పేర్కొంది.తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని...కేవలం రూ. 30 కోట్లతో నిర్మితమైన ఈచిత్రం 2,857 స్క్రీన్లలో వర్డ్ వైడ్‌గా విడుదలై వైడెస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ తెలుగు చిత్రంగా నిలిచిందని సదరు పత్రిక పేర్కొంది. ఒరిజినల్ వెర్షన్ దబాంగ్ చిత్రం 173 కోట్ల వసూళ్లతో టాప్ 5 బాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిస్తే దానికి రీమేక్‌గా వచ్చిన తెలుగు చిత్రం.... గబ్బర్ సింగ్ చిత్రం మూడు వారాల్లో 128 కోట్లు సాధించడం విశేషంగా పేర్కొంది.గతంలో వచ్చిన మహేష్ బాబు ‘దూకుడు’ చిత్రం డిసెంబర్ 2011లో విడుదలై మూడు వారల్లో 83.15 కోట్ల వసూళ్లు సాధించిందని, 2009లో వచ్చిన రామ్ చరణ్ తేజ్   మగధీర  చిత్రం మూడు వారాల్లో రూ. 90 కోట్లు వసూలు చేసిందని...తాజాగా గబ్బర్ సింగ్ ఆచిత్రం రికార్డు అధిగమించిందని  బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించారు. ఇందులో పవర్ స్టార్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించారు. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై ఈచిత్రాన్ని రూపొందించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.