* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, నవంబర్ 2010, గురువారం

16 ప్రాజెక్టుల్లో అవకతవకలు

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ క్రీడల నిర్వహణ కోసం చేపట్టిన 16 నిర్మాణ ప్రాజెక్టుల్లో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలు చోటుచేసుకున్నట్లు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌(సీవీసీ) గుర్తించింది. ఇందులో 6 పనులను ప్రజాపనుల శాఖ(పీడబ్ల్యూడీ), మూడింటిని ఢిల్లీ పురపాలకశాఖ, మిగతా పనులను వివిధ సంస్థలు పూర్తిచేశాయి. కామన్వెల్త్‌ క్రీడల కోసం చేపట్టిన నిర్మాణ ప్రాజెక్టులపై సీవీసీ అంతర్గత దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. సరాయ్‌కానేఖాన్‌ ప్రాంతం నుంచి జవహర్‌లాల్‌ స్టేడియం వరకు రూ.400 కోట్లతో నిర్మించిన రహదారి పనులను అర్హత లేని కాంట్రాక్టర్‌కు కట్టబెట్టినట్లు సీవీసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలని పీడబ్ల్యూడీని ఆదేశించింది. చాలా ప్రాజెక్టుల్లో నాణ్యతలేని నిర్మాణ సామగ్రి వాడడం, రేట్లను పెంచి చూపడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయని, వీటిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించాయని వెల్లడించింది.రైన్‌ టి-పాయింట్‌ వద్ద ఫ్త్లెఓవర్‌ నిర్మాణ పనులను 'నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ' చేపట్టింది. అంచనా వ్యయం రూ.65.76 కోట్లు కాగా అధికారులు ఆ సంస్థకు రూ.97.91 కోట్లకు పనులు అప్పగించారు. నిబంధనల ప్రకారం.. పనుల పర్యవేక్షణ కోసం థర్డ్‌పార్టీ సంస్థను నియమించుకొన్న తర్వాతే కార్యకలాపాలు ప్రారంభించాలి. నవయుగ కంపెనీ మాత్రం పనులు మొదలైన 7 నెలల తర్వాత థర్డ్‌పార్టీని ఏర్పాటు చేసుకుందని సీవీసీ తన నివేదికలో పేర్కొంది.

మరోసారి తార్నాక వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ : ఎస్సై రాతపరీక్షల రద్దు కోసం మళ్లీ ఉస్మానియా విద్యార్థులు రోడ్డెక్కారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తార్నాక వైపు విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లారు. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రి వద్ద పోలీసులపై రాళ్లు రువ్వారు. హబ్సీగూడ వద్ద వ్యాపారసముదాయాలపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలసులు విద్యార్థులపై బాష్పవాయువును ప్రయోగించారు. తార్నాక నుంచి క్యాంపస్‌ వైపు వెళ్లే దారులను, అడిక్‌మెట్‌ ఫైఓవర్‌ను పోలీసులు మూసివేయడంతో రాంనగర్‌, విద్యానగర్‌ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది. ఓయూ పరిసర ప్రాంతాల్లో 8 కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ఫోర్స్‌తో పోలీసులు భారీగా మోహరించారు.

పోలవరంపై ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మరోసారి రణం

హైదరాబాద్: పోలవరంపై వివాదం చెలరేగుతున్న స్థితిలో ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఉద్యమం చేసేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. పోలవరాన్ని అడ్డుకుంటున్నది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారేనని ఆయన ఆరోపించారు. పోలవరాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.పోలవరం జాతీయ హోదాపై ప్రజారాజ్యం పార్టీ మరోసారి ఉద్యమానికి సిద్ధమయిందని కోటగిరి చెప్పారు. ఇప్పటికే ఒకసారి మా పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి లేఖ రాశారన్నారు. ఈనెల 23న చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన నేతలు మరోసారి ప్రధానమంత్రిని కలిసి పోలవరం జాతీయ హోదాకు ఒత్తిడి తీసుకు వస్తారని చెప్పారు.

.రాజధానిలో మరో డ్రగ్స్ ముఠా: పట్టుబడ్డ ఇద్దరు నైజీరియన్లు

హైదరాబాద్: హైదరాబాదులో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. డ్రగ్సు సరఫరా ఇద్దరు నైజీరియన్లను బంజారాహిల్సు పోలీసులు అరెస్టు చేశారు. కొకైన్ కొంటున్న వారినుండి పోలీసులు మొబైల్ ఫోన్లు, పాసుపోర్టు తీసుకున్నారు. వారిని పోలీసు స్టేషన్ కి తరలించారు. 73 గ్రాముల కొకైన్ దొరికింది. డ్రగ్సు కొంటూ దొరికిన వారు ప్రముఖుల కుమారులని సమాచారం. అయితే ఇప్పుడే వారు ఎవరో చెప్పేందుకు ఆధారాలు లేవని పోలీసులు అంటున్నారు.గత కొంతకాలంగా విదేశీ డ్రగ్సు మాఫియా మనపై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. సంపన్న కుటుంబాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకొని విదేశీయులు డ్రగ్సు సరఫరా చేస్తున్నారు. గతంలో పలుమార్లు విదేశీయులు డ్రగ్సు అమ్ముతూ పట్టుబడ్డారు. ఇటీవల ప్రముఖ చిత్ర కథానాయకుడు రవితేజ సోదరులు ఉగండాకు చెందిన వ్యక్తుల దగ్గరనుండి డ్రగ్సు తీసుకుంటూ పట్టుబడ్డారు. డ్రగ్సు వ్యవహారంలో ప్రముఖుల హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాదు, బెంగుళూరులలో డ్రగ్సు మాఫియా ఉంది. ముంబయి మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో హైదరాబాదు పోలీసులు ముంబయి పోలీసులను అలర్ట్ చేశారు. ఇక్కడ కూడా డ్రగ్సు సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు

కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీ పూజ చేయండి!

కార్తీక శుద్ధ ఏకాదశికి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాభ్ది ద్వాదశి అంటారు. ఏకాదశి నాడు విష్ణుమూర్తి క్షీర సాగరం నుంచి బయలురేది వచ్చి తనకెంతో ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలో ద్వాదశి నాడే ప్రవేశిస్తాడు. ఈ కారణం చేతనే ఈ రోజున తులసీ కోట దగ్గర విశేష పూజలు జరపడం ఆచారంగా వస్తోంది. ఈ ద్వాదశినే మధన ద్వాదశి అని కూడా అంటారు. కార్తీక శుద్ద ద్వాదశిన కడలిలో శయనించిన విష్ణువు ద్వాదశినాడు లక్ష్మీ, బ్రహ్మలాంటి దేవతలందరితో కలిసి తులసి దగ్గరకు వస్తాడు. ఆ రోజున సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించి దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఇంకా కార్తీక ద్వాదశి రోజున తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు. ఈ రోజున కొన్ని తులసి దళాలను నములుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుచేత కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శివ, విష్ణువులతో పాటు తులసీ కోటను కూడా పూజించేవారికి ఈతిబాధలు తొలగి, సకల సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా ఈ రోజుల్లో శైవ, వైష్ణవ క్షేత్రాలను దర్శించుకునే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

వేయి ఉపయోగాలిచ్చే ఖర్జూరం పండు

 సంప్రదాయఫలంగా ఖర్జూరం నీరాజనాలందుకుంటోంది. రంజాన్‌ మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహమ్మద్‌ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖోరాన్ పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
ఎండు ఖర్జూరాలు
ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి తీస్తారు. అదే ఎండు ఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.

ఉపయోగాలు
ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే.
తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ ఉపయోగపడతాయి.
ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్ట... లాంటివీ అల్లుతారు.
కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి.సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు.ఆక్జాలిక్‌ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.కాఫీబీన్స్‌ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే.ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు.పూమొగ్గల్ని సలాడ్‌లలో ఎండుచేపల కూరల్లో వాడతారు.

ఖర్జూరంతో వైద్యం
ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి.
ఎండా కాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు.మూత్రం సాఫీగా కానివారికి కర్జూరపండు పెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది.పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుందిమూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలి.

మరికొన్ని విశేషాలు
గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెలరోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు.ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్‌ ద్వారా వాటిని పంచదార, జామ్‌, జెల్లీ, జ్యూస్‌, సిరప్‌, వినెగర్‌గా మార్చి విక్రయిస్తున్నారు.
బలవర్థకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటుంటారు.ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌ లాంటిపానీయాన్ని తాగుతున్నారు.మొరాకోలాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు.
సహారా వాసులు గుర్రాలు, ఒంటెలు, కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు.
ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును తయారుచేస్తారు.
   

కర్పూరం... కొన్ని లాభాలు

హోమియోపతి వైద్యవిధానం ప్రకారం కర్పూరం, ఇతర పరిమళ ద్రవ్యాలు పరిసర వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. హారతిని భక్తులు కళ్లకు అద్దుకున్నప్పుడు కర్పూరం సువాసనలు పీల్చడం వల్ల అది ఔషధంగా పనిచేస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం....స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, గుండెకు సంబంధించిన పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు.కర్పూరం సహజసిద్ధమైన ఉత్పత్తి అయినప్పటికీ అది విడుదల చేసే ఆవిర్లు విషపూరితమైనవి. మితిమీరి కర్పూరం వినియోగాన్ని అమెరికాలో నిషేధించారు. ఐతే కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో సువాసనకోసం కర్పూరాన్ని ఉపయోగిస్తున్నారు. ఆస్త్మా, అలెర్జీలున్నవారు కర్పూరాన్ని వాడకూడదు. చిన్ని పిల్లల ముఖాలపై పొరపాటున కూడా ఉపయోగించరాదు.