1, డిసెంబర్ 2010, బుధవారం
జైపూర్ వన్డే...భారత్ లక్ష్యం 259
జైపూర్: భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లమధ్య జరుగుతున్న రెండో వన్డే(డే నైట్)లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. భారత్ ముందు 259 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. గుప్తిల్ 70, హౌ 5, విలియమ్‌సన్ 29, టేలర్ 15, స్త్టెరిస్ 59, వెటోరీ 31, మెక్లమ్ 12, మిల్స్ 13 పరుగులు చేశారు. హాప్‌కిన్స్ 11, సూథీ 2 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. శ్రీశాంత్ 4, అశ్విన్, పటేల్, పఠాన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.
చెరకు రైతుకు చేదు ఫలితం
చోడవరం(విశాల విశాఖ): చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.. క్రషింగ్‌కు ముందే మద్దతు ధర ప్రకటించడం ఆనవాయితీ. రైతుల తరుపున సమస్యను వివరించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు నెట్టడంతో రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. చోడవరం చక్కెర కర్మాగార ఎండీ వైఖరి విమర్శల పాలయ్యింది. తక్షణం చెరకు మద్దతు ధర ప్రకటించడం, కేసులను ఎత్తివేయడం, ఎండీపై చర్యలు తీసుకోవడం జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేయక తప్పదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నపాత్రుడు కలెక్టర్‌కు అల్టిమేటమ్ ఇచ్చారు.మంగళవారం రాత్రి అయ్యన్న, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పట్టణ దేశం అధ్యక్షుడు కోన తాతారావుతోపాటు మరో పది మంది నేతలు కలెక్టర్‌ను బంగ్లాలో కలిసి సమస్యను వివరించారు. గత ఏడాది గోవాడ చక్కెర కర్మాగారంలో టన్నుపై రూ.2,200 చొప్పున చెల్లించారని, అప్పట్లో రైతులు కర్మాగారానికి 3,50,000 టన్నుల చెరకును సరఫరా చేశారన్నారు. ధరలు బాగుండడంతో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఇప్పటికే ప్రైవేటు చక్కెర కర్మాగారాల్లో మద్దతు ధర ప్రకటించారని, అవే విధానాలను గోవాడలో ఎందుకు అవలంబించలేదని ప్రశ్నించారు.ఈఏడాది 5.5 లక్షల టన్నుల చెరకు కర్మాగారానికి వచ్చే అవకాశం ఉందని, దీంతో లాభాలు కూడా గణనీయంగా రానున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎండీతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని నేతలకు హామీ ఇచ్చారు. మద్దతు ధర ప్రకటించే విషయంలో అన్ని కోణాల్లోనూ పరిశీలన చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యేలపై నమోదయిన కేసులు, అరెస్టులకు సంబంధించి జిల్లా ఎస్పీతో మాట్లాడతానన్నారు. వీలైనంతవరకూ సమస్యను సామరస్యపూర్వకంగానే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.ధరలు సరే... గిట్టుబాటో? : చోడవరం చక్కెర కర్మాగారంతోపాటు జిల్లాలో మిగిలిన చక్కెర కర్మాగారాలు టన్నుకు కనీసం 1600 నుంచి గరిష్టంగా 1800 చొప్పున చెల్లిస్తామంటూ చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. గత ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యాలు చూపించిన గిట్టుబాటు ధరల కారణంగానే ఈ ఏడాది సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచుకున్నామని, తీరా పంట చేతికివచ్చిన తరువాత ఫ్యాక్టరీ యాజమాన్యాలు ధరపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా చెరకు సాగు విస్తీర్ణం 30 శాతం మేర పెరిగింది. సాగుపై పెరిగిన పెట్టుబడులు, ఇటీవల వర్షాలకు జరిగిన నష్టాల రీత్యా గిట్టుబాటు ధర కల్పిస్తే తప్ప రైతులు బతికి బట్టకట్టలేరని చెబుతున్నారు.
గత ఏడాది చోడవరం సుగర్స్ మాత్రం గత ఏడాది 1800 రూపాయలు గిట్టుబాటుధర ప్రకటించినప్పటికీ 400 రూపాయలు బోనస్ పేరున మొత్తం 2200 రూపాయలు చొప్పున టన్ను ఒక్కంటికి చెల్లించింది. ఈ ఏడాది మాత్రం యాజమాన్యం 1800 మాత్రమే ఇస్తానని ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అదేవిధంగా ఏటికొప్పాక ఫ్యాక్టరీ 1800, తాండవ 1700, అనకాపల్లి 1600 రూపాయల చొప్పున గత ఏడాది ధరలే చెల్లించేందుకు సుముఖంగా ఉన్నాయి. దీంతో గిట్టుబాటు ధరపై జిల్లా చెరకు రైతుల్లో ఆసంతృప్తి చోటుచేసుకుంది. చైర్మన్‌గా కలెక్టర్ నిర్ణయాలపైనే సమస్య పరిష్కారం ఆధారపడి ఉంది.
గత ఏడాది చోడవరం సుగర్స్ మాత్రం గత ఏడాది 1800 రూపాయలు గిట్టుబాటుధర ప్రకటించినప్పటికీ 400 రూపాయలు బోనస్ పేరున మొత్తం 2200 రూపాయలు చొప్పున టన్ను ఒక్కంటికి చెల్లించింది. ఈ ఏడాది మాత్రం యాజమాన్యం 1800 మాత్రమే ఇస్తానని ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. అదేవిధంగా ఏటికొప్పాక ఫ్యాక్టరీ 1800, తాండవ 1700, అనకాపల్లి 1600 రూపాయల చొప్పున గత ఏడాది ధరలే చెల్లించేందుకు సుముఖంగా ఉన్నాయి. దీంతో గిట్టుబాటు ధరపై జిల్లా చెరకు రైతుల్లో ఆసంతృప్తి చోటుచేసుకుంది. చైర్మన్‌గా కలెక్టర్ నిర్ణయాలపైనే సమస్య పరిష్కారం ఆధారపడి ఉంది.
మల్లికా శరావత్ శృంగారం వేస్టయింది
ఒకప్పుడు మలయాళంలో మమ్ముట్టి చిత్రం షకీలా చిత్రం విడుదలైతే షకీలాకు అద్భుత రెస్పాన్స్ వచ్చేది. తెలుగులో కూడా అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా మల్లికా శరావత్ మత్స్యకన్యగా తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి.కానీ ఆమె హిస్‌స్ అని బుసకొట్టినా అదే టైంలో రిలీజై రక్తచరిత్రతోపాటు మరో రెండు తెలుగు సినిమాల ముందు ఆడలేదు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన చదలవాడ శ్రీనివాసరావు చేతులు కాల్చుకున్నాడు.రోబో వంటి చిత్రాన్ని విడుదల చేయాల్సింది మిస్సై ఇలా శృంగారపు సినిమా కూడా సక్సెస్ చేయలేకపోయాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఘాతుకం
ఆరుగురిని హత్య చేసిన వ్యక్తి
శ్రీకాకుళం: జిల్లాలోని జలుమూరు మండలం మెట్టపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు. కత్తులు, నాటుబాంబులతో దాడి చేసిన శంకర్రావు అనే వ్యక్తి ఆరుగురిని కడతేర్చాడు. మృతుల్లో శంకర్రావు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శంకర్రావు మాజీ సైనికుడు. అనంతరం శంకర్రావు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
శ్రీకాకుళం: జిల్లాలోని జలుమూరు మండలం మెట్టపేటలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు. కత్తులు, నాటుబాంబులతో దాడి చేసిన శంకర్రావు అనే వ్యక్తి ఆరుగురిని కడతేర్చాడు. మృతుల్లో శంకర్రావు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శంకర్రావు మాజీ సైనికుడు. అనంతరం శంకర్రావు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు: కొండా సురేఖ
వరంగల్: ముఖ్యమంత్రి కిరణ్ జట్టుపై మిశ్రమ స్పందన వస్తోంది. కిరణ్ క్యాబినెట్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి తన సామాజిక వర్గమైన వారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని అన్నారు. మహిళలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. జగన్‌కు చెక్ పెట్టామనే సంకేతాలు పంపేందుకే ఆయన వర్గీయులకు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇవ్వకపోతే డిసెంబర్ 31 తరువాత తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. వివేకాను మంత్రివర్గంలో తీసుకోవడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని సురేఖ చెప్పుకొచ్చారు.
మంత్రి పదవి ఇవ్వకపోయినా ఫర్వాలేదు: జేసీ దివాకర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోయినా ఫర్వాలేదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్, రోశయ్య ప్రభుత్వంలో మంత్రి పదవి పోషించిన జేసీ కొత్త మంత్రి వర్గంలో తనకు స్థానం దక్కకపోవడంపై ఎలాంటి బాధ లేదని జేసీ వెల్లడించారు.మంత్రి పదవి దక్కకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తానని జేసీ అన్నారు. మంత్రి పదవి దక్కినా, లభించకపోయినా ముందున్నట్లే అంతే హ్యాపీగా ఉన్నానని జేసీ మీడియాతో చెప్పారు.కొత్తగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని జేసీ తెలిపారు. నూటికి నూరు పాళ్లు కిరణ్ కుమార్‌కు నమ్మకం కలిగిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారని ఆయన వెల్లడించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

