రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోయినా ఫర్వాలేదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్, రోశయ్య ప్రభుత్వంలో మంత్రి పదవి పోషించిన జేసీ కొత్త మంత్రి వర్గంలో తనకు స్థానం దక్కకపోవడంపై ఎలాంటి బాధ లేదని జేసీ వెల్లడించారు.మంత్రి పదవి దక్కకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తానని జేసీ అన్నారు. మంత్రి పదవి దక్కినా, లభించకపోయినా ముందున్నట్లే అంతే హ్యాపీగా ఉన్నానని జేసీ మీడియాతో చెప్పారు.కొత్తగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారని జేసీ తెలిపారు. నూటికి నూరు పాళ్లు కిరణ్ కుమార్‌కు నమ్మకం కలిగిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారని ఆయన వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి