* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

29, సెప్టెంబర్ 2011, గురువారం

ఏసీబీకి చిక్కిన చిట్వేలు అటవీ అధికారి

కడప: రూ.20వేలు లంచం తీసుకుంటూ కడపజిల్లా చిట్వేలు అటవీ రేంజ్‌ అధికారి ప్రసాదరావు గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఎర్ర చందనం అక్రమంగా తరలించేందుకు ఓరైతు నుంచి రూ.20వేలు లంచం డిమాండ్‌ చేయడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు

రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి పంకజ్‌ త్రివేది

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా పంకజ్‌ త్రివేదీ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా వినయ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విజిలెన్స్‌ కమిషనర్‌గా ఎస్‌.వి. ప్రసాద్‌ని నియమించారు. భూ పరిపాలన చీఫ్‌ కమిషనర్‌గా కె. సత్యనారాయణను నియమించారు

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

విలీనంతో మరింత బలోపేతం

                            ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌ గర్జన  సభలో కాంగ్రెస్‌ నేతల స్పష్టీకరణ
విశాఖపట్నం(విశాల విశాఖ): కాంగ్రెస్‌ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ (ప్రరాపా) విలీనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ మరింతగా బలపడిందని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. దీనికి నిదర్శనం విశాఖలో జరిగిన బహిరంగ సభ విజయవంతం కావడమేనని పేర్కొన్నారు. రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో ఇరుపార్టీ శ్రేణులు మరింతగా కలిసిమెలిసి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకొనే స్థాయికి వెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌ గర్జన పేరిట నగరంలోని రామకృష్ణబీచ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. విలీనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలు, కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను వల్లెవేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయడం పట్ల హర్షం వెలిబుచ్చారు. పీసీసీ నేత బొత్స, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత చిరంజీవి ముగ్గురు త్రిమూర్తులు లాంటి వారని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని ముందుకు తీసుకెళ్ల గలిగే దిట్టలుగా వర్ణించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రెండు పార్టీల మేలు కలియికని అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీని మరింతగా బలోపేతం చేయాలని కోరారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సోనియాగాంధీ త్యాగశీలి అని, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తో సాధ్యమని, ఈ పార్టీలో ప్రరాపాను విలీనం చేయడం హర్షణీయమన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున అమలు జరుతున్నాయన్నారు.రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో బలమైనదని, దాన్ని ఎవరూ ఎదిరించలేరన్నారు. కొన్ని పార్టీలు ఏవేవో చెబుతున్నాయని, తమకున్న పార్టీ, పత్రికలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు సాగబోవన్నారు. పార్టీ సంస్థాగతంగా పటిష్ఠంగా ఉందని, పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చిరంజీవితో తనకు 35 ఏళ్ల గా అనుబంధం ఉందని, ఆయన కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీ మరింతగా బలోపేతం అవుతుందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, చిరంజీవి కలియకలో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయని, రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలకు పథకాల ఫలితాలు అందుతున్నాయన్నారు. అనకాపల్లి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంతో పార్టీ మరింతగా బలపడిందన్నారు. భవిష్యత్తులో ఇదే ఊపు కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ ఆలీ మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న జగన్‌కు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం వల్లే వైఎస్‌కు పదవులు వచ్చాయని, అటువంటి కాంగ్రెస్‌ అధినేత్రిని లక్ష్యం చేసుకొని జగన్‌ విమర్శలు చేయడం విచారకరమన్నారు. ఎంపీలు కిల్లి కృపారాణి, బొత్సఝాన్సీ, అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్‌ కోండ్రు మురళీ మోహన్‌, నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు తైనాల విజయకుమార్‌, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు తోట నగేష్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్‌, పినిపే విశ్వరూప్‌, పార్ధసారధి, తోట నర్సింహం, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, వంగా గీత, మళ్ల విజయప్రసాద్‌, బోళెం ముత్యాలపాప, ప్రరాపా నాయకులు అల్లు అరవింద్‌, నాగబాబు, సి.రామచంద్రయ్య, డాక్టర్‌ ఎస్‌.ఎ.రెహ్మాన్‌, కె.వి.సిహెచ్‌. మోహనరావు, కోటగిరి విద్యాధరరావు, ఎమ్మెల్సీ సాగి సూర్యనారాయణరాజు, మేయరు పులుసు జనార్ధనరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బలిరెడ్డి సత్యారావు, గురుమూర్తిరెడ్డి, కె.చిట్టినాయుడు, మరియాదాస్‌, యల్లపు రఘురాం, సోడదాసు సుధాకర్‌, సతీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

పతనావస్థలో కాంగ్రెస్‌ సర్కార్‌

తెదేపా అధినేత వ్యాఖ్యలు
తిరుపతి(విశాల విశాఖ): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా పతనావస్థకు చేరుకుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడువిమర్శించారు. నెల్లూరు జిల్లా పర్యటన అనంతరం హైదరాబాదు వెళుతూ ఆయన గురువారం రాత్రి తిరుపతి పద్మావతీ అతిథిగృహం చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసిన ఆయన శుక్రవారం హైదరాబాదు తిరుగు ప్రయాణం అవుతూ అతిథిగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభద్రతాభావంతో ఉండటం వల్ల కొత్త పథకాలంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండేలా కనిపించడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఒక్క వస్త్రాలపైనే నాలుగు నుంచి ఐదు శాతం పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. మద్యం విచ్చలవిడి అమ్మకాల ద్వారా ఖజానాకు రూ.1500 కోట్ల రెవెన్యూ చేరిందన్నారు. అవినీతిపరులు దోచుకున్న సంపదను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకుని దాన్ని పేదలకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఖనిజ సంపద, 2జీ స్పెక్ట్రం, కామన్‌వెల్త్‌ కుంభకోణంలో బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అక్రమార్కులు దాచిఉంచిన నల్లధనాన్ని వెలికితీసి పేదలకు పంచిపెడితే పేదలు లేని సమాజాన్ని చూడవచ్చునన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకుండా చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కిలో రూపాయి బియ్యం పథకం ఒక బూటకమని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇందుకు సర్కార్‌ వైఖరే కారణమన్నారు. రాజకీయ ప్రక్షాళన జరిగినప్పుడే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు.

21, సెప్టెంబర్ 2011, బుధవారం

ట్రాఫిక్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలి

అనకాపల్లి(విశాల విశాఖ):విద్యార్థులు వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలను పాటించి నడపాలని ట్రైనీ డిఎస్పీ రమాదేవి తెలిపారు. పట్టణంలోని డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళవారం హీరో కంపెనీవారు నిర్వహించిన సేఫ్‌ డ్రైవ్‌ రిహాసల్స్‌ సెమినార్‌లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థు లకు కాలేజీ దశ చాలా విలువైనదని జీవితానికి ఈ దశ పునాధి అని దానిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్‌ తరువాత సాఫ్టవేర్‌ కంపెనీలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అలా కాకుండా గ్రూప్స్‌ వైపు కూడా దృష్టి సారించాలని ఆమె తెలిపారు. అలా చేయడం వలన ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ర్యాష్‌గా డ్రైవింగ్‌ చేయడం వలన ప్రమాదాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని, మీపై ఎంతో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆమె అన్నారు.అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు మీతో పాటుగా ప్రమా దానికి గురైన ఎదుటి వ్యక్తి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ సిఐ పాపారావు, ఇంజనీరింగ్‌ కళా శాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్‌, ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రావు, హీరో ట్రైనర్‌ ఎం.గోపీ నాయుడు, మెకానిక్‌ సెక్షన్‌ సూపర్‌వైజర్‌ వినోద్‌, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌, పీఆర్పీ కార్యకర్తల సమావేశం

చోడవరం(విశాల విశాఖ): పట్టణపరిధిలో గంటా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం మండల కాంగ్రెస్‌ , పిఆర్‌పి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పినపోలు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కరణం ధర్మశ్రీ విచ్చేశారు. పినపోలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఈ కార్యాలయంలో ఇరుపార్టీల కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం జరగడం శుభపరిణామమన్నారు. ఇకపై అధికారపార్టీ చెందిన కార్యకర్తలుగా కొనసాగుతామని హితవు పలికారు.ఇరు పార్టీ కార్యకర్తలకు సముచితస్థానం ల్పించి గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టం చేసి ముందుకు సాగాలన్నారు. గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ధర్మశ్రీ హయాంలో కలిసి అన్నదమ్ములుగా పనిచేస్తామన్నారు. అలాగే కార్యకర్తలను ఉద్దేశించి మూడెడ్ల శంకరరావు మాట్లాడుతూ 32 గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఇక్కడికి విచ్చేసిన కారణంగా ఇకనుంచి అందరి మనస్సుల్లో ఒకే స్వభావంతో పార్టీలో మెలగాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి విజయబాటపై వెళ్లాలన్నారు. ఏడువాక సత్యారావు మాట్లాడుతూ ఒకేమాట, బాట మనస్సుల్లో ఎటువంటి ద్వేషాలు, మనస్పర్ధలు లేకుండా సంతృప్తి కరంగా ఉండాలని కోరారు. అలాగే కమిటీలు వేసి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయడానికి నాయకులను కోరారు.ముఖ్యఅతిథి కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ సెప్టెంబర్‌ 25న విశాఖ బీచ్‌రోడ్డులో జరుగు ఉత్తరాంధ్ర మెగా సమావేశానికి కార్యకర్తలను సమాయాత్తం చేయడానికి ఈ రోజుచోడవరం నియోజకవర్గ పరిధిలో వున్న నాలుగు మండలాలు ఇరుపార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీని ప్రరాపా కలుపుకొని ఏకతాటిపె ైనడిచి ఒకే పార్టీ కార్యకర్తలుగా కలిసిమెలసి మెగాలన్నారు. అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో సమిష్టి కృషి చేసి కాంగ్రెస్‌ పార్టీ మూడు రంగులజెండాను రెపరెపలాడించాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి పార్టీని ముందుకు నడిపించడానికి మనమందరం ఐక్యంతో ముందుకు వెళ్లినట్టయితే కాంగ్రెస్‌ పార్టీకి ఢోకా ఉండదన్నారు. ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ పలు పదవులను అనుభవించి పార్టీని వెన్నుపోట్లు పొడిచి కొత్త, చెత్త పార్టీలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు, ఇలాంటి పార్టీలు జాలితో మొదలై మోలీగా తయారై, గాలిలో ఎగిరిపోతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక జాతీయ పార్టీ అని దీని పునాదులను ఎవరూ కదల్చలేరన్నారు. చిరంజీవి, కిరణ్‌కుమార్‌ రెడ్డి, బొత్సా సత్యనారాయణ, ఛర్మిస్మా, నిజాయితీ, అనుభవం ఉన్న ఈ ముగ్గురు నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి ఢోకా ఉండదన్నారు.అలాగే జిల్లా స్థాయిలో గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగిపోతుందన్నారు. నియోజకవర్గ స్థాయిల్లో మంచి అనుభవం, సున్నిత మనసు గల పినపోలు వెంకటేశ్వరరావు మిగతా నాయకులు, కార్యకర్తలు తదితరులతో పార్టీ విజయపంథాలో నడిపించుటకు అందరూ కృషి చేయాలన్నారు. సెప్టెంబర్‌ 25న జరుగు మెగా సమావేశానికి విసృ్తత స్థాయిలో ఇరు పార్టీ కార్యకర్తలు పాల్గొని సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి 32 పంచాయతీల నుంచి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు, మూడెడ్ల శంకరరావు, దన్నిన వెంకటరావు, పప్పల రమణమూర్తి, ఎ.జగన్నాధం, ఏడువాక సత్యారావు, గూనూరు పెదచ్చిబాబు, పల్లెల వరహాల బాబు, పసుమర్తి సాంభ, అల్లుతాతంనాయుడు, సాలాపు వెం టరమణ మూర్తి, దొరపిల్ల, బొడ్డు శ్రీరామ్మూర్తి, ఉప్పలబాబు, సకలా సూరిబాబు, లక్ష్మిపురం సత్యారావు తదితరులు పాల్గొన్నారు.

19, సెప్టెంబర్ 2011, సోమవారం

కర్ణాటక లోకాయుక్త శివరాజ్ పాటిల్ రాజీనామా

బెంగళూరు: పలు వైపుల నుంచి ఒత్తిడి రావడంతో కర్ణాటక లోకాయుక్త శివరాజ్ పాటిల్ సోమవారం రాజీనామా చేశారు. బెంగళూర్‌లో ఆయన కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా నివేశన స్థలాన్ని పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వంటి ప్రముఖుల కేసులపై శివరాజ్ పాటిల్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విషప్రచారం తనను ఎంతో బాధించిందని, ఇటువంటి వాతావరణంలో రాజీనామా చేయడమే మంచిదని తాను అనుకున్నానని, కొంత మంది విషప్రచారానికి బాధపడే తాను రాజీనామా చేశానని ఆయన గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌కు రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత అన్నారు. రాజీనామా సమర్పించడానికి ముందు లోకాయుక్త శివరాజ్ పాటిల్ భరద్వాజ్‌ను కలిసి గంటకుపైగా మాట్లాడారు.

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

బొత్స- చిరుకు కిరణ్‌ చెక్‌!

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖ రరెడ్డి మాదిరిగా తాను అనుకున్నదే చేస్తున్నారు. 108 సర్వీసు నిర్వహణ కోసం చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేసినా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ వంటి నేతలు ఎన్ని సిఫారసులు చేసినా కిరణ్‌కుమార్‌రెడ్డి తాను అనుకు న్న నిర్ణయాన్నే అమలు చేశారు. 108 సర్వీసు నిర్వహణ చేపట్టేందుకు చిరం జీవి తనంతట తాను ముందుకు వచ్చినా.. కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తాను కేటాయించదలచుకున్న జీవీకే కంపెనీ వైపే మొగ్గు చూపి, చిరంజీవి బొత్సకు చెక్‌ పెట్టారు. చాలాకాలం పాటు సందిగ్థంలో ఉన్న 108 సర్వీసు నిర్వహణ ఎవరికి కేటాయించాలన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి వట్టి వసంతకుమార్‌ రంగం లోకి దిగి చిరంజీవి పక్షాన లాబీయింగ్‌ చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. చివరకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్చార్జి, కేంద్ర వైద్యశాఖమంత్రి గులాంనబీ ఆజాద్‌తో సిఫార్సు చేయించారు. ముఖ్యమంత్రి తాను అనుకున్న కంపెనీకే 108 నిర్వహణ కట్టబెట్టడం ద్వారా.. పార్టీ-ప్రభుత్వంలో త న పట్టు చాటుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి 108 నిర్వహణను తిరిగి జీవీకేకు కేటాయించడాన్ని అడ్డుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈవిషయంలో కిరణ్‌ దాదాపు వైఎస్‌ మాదిరిగానే వ్యవహరించినట్లు కనిపిస్తోంది.108 సర్వీసు నిర్వహణను జీవీకే సంస్థకు ఇచ్చేందుకు ఒప్పందం ఖరారయిన నేపథ్యంలో ప్రభుత్వంపై తనకున్న పట్టును కిరణ్‌ ప్రదర్శించారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇటీవలే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, అధిష్ఠానానికి దగ్గరయిన చిరంజీవి పక్షాన చివరి వరకూ పోరాడారు. ఆయనతో పాటు మరికొందరు కాపు నేతలూ చిరు పక్షాన రంగంలోకి దిగారు. అయితే, చిరంజీవికి ఈ సర్వీసు నిర్వహణ కట్టబెడితే, అది పార్టీ-ప్రభుత్వంలో చిరు హవా పెరిగిందన్న సంకేతాలు వెళతాయన్న మందుజాగ్రత్తతోనే కిరణ్‌ ఆయనకు చెక్‌ పెట్టినట్లు కనిపిస్తోంది.అదీకాకుండా.. ఇటీవలి కాలంలో బొత్సతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవికి ఈ వ్యవహారం ఓ కనువిప్పు కావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. బొత్సతో ఉంటే నష్టమే తప్ప లాభం లేదన్న భావన కలిగించడంతో పాటు, తనతో ఉంటే ఎంత లాభం ఉంటుందన్న విషయాన్ని కిరణ్‌ పరోక్షంగా చిరుకు చెప్పకనే చెప్పినట్టయిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

15, సెప్టెంబర్ 2011, గురువారం

28లోగా ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించాలి

హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు సూచించింది. అపరాధ రుసుముతో అక్టోబర్‌ 14వ తేదీ వరకు ఫీజు చెల్లించే సౌకర్యాన్ని కల్పించింది. జనరల్‌ కోర్సు విద్యార్థులు రూ.230, వొకేషనల్‌ కోర్సు చదివే వారు రూ.330 (ప్రాక్టికల్స్‌తో కలిపి) చెల్లించాలి. బ్రిడ్జి కోర్సు పరీక్ష రాయబోయే బైపీసీ విద్యార్థులు రూ.60 చెల్లించాలి. మార్చిలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయి. ఇతర వివరాల కోసం కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వాణీప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

విశ్వసుందరిగా అంగోలా అందగత్తె లైలా లోప్స్‌

సావోపాలో: అంగోలా అందగత్తె లైలా లోప్స్‌ ఈ ఏడాది విశ్వసుందరిగా ఎంపికైంది. ఉక్రెయిన్‌, బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌, చైనా సుందరీమణులను వెనక్కి నెట్టి లోప్స్‌ విశ్వసుందరిగా అవతరించింది. రెండు, మూడు స్థానాలను ఉక్రెయిన్‌, బ్రెజిల్‌ భామలు దక్కించుకున్నారు. భారత్‌ నుంచి కోటి ఆశలతో వెళ్లిన వాసుకి సుంకవల్లి నిరాశపరిచారు. ఆమెకు తుది 16 మందిలోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. బ్రెజిల్‌లోనిసావోపాలోలో జరిగిన 2011 విశ్వసుందరి పోటీల్లో .. సోమవారం ధగధగ మెరిసిపోతున్న గౌను ధరించిన 25 ఏళ్ల లోప్స్‌కు గతేడాది విశ్వసుందరి జిమెనా నవరెటె విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు. పోటీల్లో మొత్తం 98 మంది అందగత్తెలు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెసియా స్టెఫాంకో, మూడో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రిస్కిలా మచడోలు రెండు మూడు స్థానాల్లో నిలిచారు. సావోపాలోలోని క్రెడికార్డ్‌ హాలులో ఆహూతులంతా నిలబడి కరతాళధ్వనులు చేస్తుండగా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకొన్న లోప్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందభాష్పాలను అతికష్టం మీద ఆపుకొంటూ.. ''ఇప్పుడు నాకు పని దొరికింది. ఇకపై మరింత వినయంగా ఉండేందుకు ప్రయత్నిస్తా'' అని లోప్స్‌ విలేకర్లతో చెప్పారు. అంతకుముందు న్యాయనిర్ణేతలు ఆమెను మీకు అవకాశం వస్తే శరీరాకృతిని మార్చుకుంటారా అని అడగ్గా.. ''ఏమీ మార్చుకోను. దేవుడు ఇచ్చినదానితో సంతృప్తిగా ఉన్నా'' అని బదులిచ్చారు.

12, సెప్టెంబర్ 2011, సోమవారం

జేఎన్‌టీయూ-హెచ్‌ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: జేఎన్‌టీయూ-హెచ్‌ అనుబంధ కళేశాలల్లో బీటెక్‌ (సీసీసీ) 1, 2, 3, 4 సంవత్సరాల (ఎన్‌ఆర్‌ అండ్‌ ఓఆర్‌), ఫార్మా డీ మూడో సంవత్సర పరీక్షలను (ఈనెల 13, 14 తేదీల్లో జరగాల్సిన వాటిని) అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ బి.వి.శంకర్‌రామ్‌ తెలిపారు. వీటిని తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ కళాశాలల్లో జరుగుతున్న మిడ్‌ ఎగ్జామ్స్‌ మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణలో తలపెట్టిన సకల జనులసమ్మె కారణంగానే పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం : కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే


విశాఖపట్నం(విశాల విశాఖ) ;12వ పంచవర్ష ప్రణాళిక చివరినాటికి దేశంలో 83 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించారు. విశాఖలోని సింహాద్రి పవర్ ప్లాంట్ రెండో దశ 500 మెగా వాట్ల పూర్తిస్థాయి వాణిజ్య ప్రక్రియను మంత్రి షిండే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తను విద్యుత్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికి 1,22,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, దాన్ని 1,80,000 మెగావాట్లకు పెంచగలిగామని తెలిపారు. 10వ ప్రణాళిక వరకు విద్యుత్ కొరత తీవ్రంగానే ఉందని, 11వ ప్రణాళికలో దీన్ని తగ్గించగలిగామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, గ్యాస్ కొరత 12వ పంచవర్ష ప్రణాళికాంతం వరకూ ఉండదని, 13వ పంచవర్ష ప్రణాళిక నాటికి ఈ సమస్య మొదలవుతుందని మంత్రి షిండే తెలిపారు. ఇండొనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయని విలేఖరులు ప్రశ్నించగా, అక్కడ చవకగా బొగ్గు లభిస్తుంది. అయితే ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కష్టతరంగా ఉందని అన్నారు. శ్రీలంకలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎంఓయు చేసుకోవలసి ఉందని, దీనిపై ఇరు ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా పవర్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన ఉందని చెప్పారు. ఎన్‌టిపిసి సిం హాద్రి ద్వారా విద్యుత్‌లో అధిక భాగం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు విద్యుత్ కొరత అనేక రాష్ట్రాల్లో ఉందని, ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తి అయిన విద్యుత్‌ను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై ఎన్‌టిపిసి ఏర్పా టు చేయనున్న కొత్త ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఆయా రాష్ట్రాలకు 50 శాతం ఇవ్వాలని నిర్ణయించామని షిండే తెలిపారు.
in shimhadry power plant mr sunil kumar shinday who is the central minister of power opened third phase power plant 500(m.w) in paravada ntpc

10, సెప్టెంబర్ 2011, శనివారం

కులాంతరం చేసుకున్నందుకు కూతురి హత్య

నిజామాబాద్‌: కులాంతర వివాహం చేసుకుని పరువు తీసిందంటూ సొంత తండ్రే కూతురిని హత్య చేసిన సంఘటన నిజామాబాద్‌ జిల్లాలోని బిక్కనూరులో జరిగింది. బిక్కనూరు మండలంలోని రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన అమృతారెడ్డి అనే అతను గత కొంతకాలంగా దుబాయ్‌లో నివసించి అనంతరం రామేశ్వరంపల్లివచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతని కుమార్తె మౌనిక ఇంటర్‌ చదువుతోంది. ఆమె ఎస్‌సీ కులానికి చెందిన ప్రదీప్‌ అనే అతన్ని ప్రేమించింది. అతని తండ్రికూడా దుబాయ్‌లో ఉండి ఇటీవలే స్వగ్రామం బిక్కనూరు వచ్చాడు. ప్రదీప్‌ 8వ తరగతి చదివి మానేసి పనులు చేసుకుంటున్నాడు. వీరిద్దరికీ అయిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ ఆరునెలలక్రితం ఇంట్లోనుంచి వెళ్లిపోయారు. అప్పుడే అమ్మాయి తల్లిదండ్రులు మైనర్‌ను కిడ్నాప్‌ చేశాడంటూ ప్రదీప్‌పై పోలీసు కేసు పెట్టారు. ఈ విషయం తెలిసి వారు 6 నెలలవరకు స్వగ్రామం రాలేదు. ఇటీవలే అమ్మాయి మేజర్‌ కావటంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం బిక్కనూరు రాగా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఆ తరువాత వారంలోపలే అమ్మాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పోస్టుమార్టం చేయించగా హత్యగా అనుమానించారు. అమ్మాయి తల్లిదండ్రులు తప్ప ఎవరూ ఇంట్లో లేనందున అనుమానంపై తండ్రిని ప్రశ్నించగా కులాంతరం చేసుకుని తమ పరువు తీసిందని, సాటివారిలో తలెత్తుకోలేకుండా ఉన్నామని పోలీసులకు తెలిపాడు. కూతురు భర్త దగ్గరికే వెళతాననటంతో కోపం వచ్చి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో అతన్ని వారు అరెస్టు చేశారు.

భార్యను గొంతుకోసి చంపిన భర్త

నెల్లూరు: పెళ్లి సమయంలో ఇస్తానని ఒప్పుకున్న కట్నం సొమ్ము పూర్తిగా ఇవ్వనందుకుగాను భార్యను ఓ భర్త హత్య చేసిన ఉదంతం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నాయుడుపేట మండలం జిగురుపాడు అగ్రహారంలో స్వాతి అనే యువతి హత్యకు గురైంది. పెళ్లి సమయంలో ఇస్తానని చెప్పిన కట్నం విషయంలో ఇద్దరిమధ్య ఈరోజు గొడవ జరిగింది. మాటామాటా పెరిగి భర్త వెంకట్రమణ తీవ్ర ఆగ్రహంతో భార్యను కత్తితో గొంతుకోసి చంపాడు. ఆ వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదుచేసి అతని తల్లి వెంకటమ్మను అదుపులోకి తీసుకున్నారు.

విశాఖలో విలువిద్య పోటీలు

విశాఖ(విశాల విశాఖ): విశాఖలోని ఆర్‌ ఆర్‌ గ్రౌండ్స్‌లో ఈరోజు విలువిద్య పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ లవ అగర్వాల్‌ వీటిని ప్రారంభించారు. వింటిని ఎక్కుపెట్టి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి అభిప్రాయాలు కనుక్కున్నారు.

19 నుంచి తెలంగాణలో ఆర్టీసీ సమ్మె

హైదరాబాద్‌: సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పూర్తిస్థాయిలో పాల్గొంటారని తెలంగాణ ఆర్టీసీ ఐకాస స్పష్టం చేసింది. 19 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకుండా చూస్తామని ఐకాస అధ్యక్షుడు దొంత ఆనందం, కన్వీనర్‌ కె.రాజిరెడ్డి చెప్పారు. సీమాంధ్ర నేతల ఆర్థిక మూలాల్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 16న హైదరాబాద్‌లో సీమాంధ్రుల ప్రైవేట్‌ బస్సులను అడ్డగిస్తామన్నారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత విఠల్‌ తదితరులు మాట్లాడారు

వెంకటస్వామికి తీవ్ర అస్వస్థత

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కేర్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వెంకటస్వామికి వైద్యులు వెంటిలేటర్‌ సాయంతో శ్వాస అందిస్తున్నారు.

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

నేడు స్థాయీ సంఘ సమావేశం

విశాఖపట్నం (విశాల విశాఖ): మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) స్థాయీ సంఘసమావేశాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. మేయర్‌ పి.జనార్దనరావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశం కోసం 11అంశాలతో అజెండా రూపొందించారు. ముఖ్యంగా కొత్త కౌన్సిల్‌ హాలు విద్యుదీకరణ, శీతల సదుపాయం వంటి పనులు సభ్యుల ముందు ఉంచనున్నారు. పరిపాలన పరంగా మరో ఎనిమిది అంశాలను అజెండాలో చేర్చారు.

1, సెప్టెంబర్ 2011, గురువారం

గాజువాకలో మహగణపతి

గాజువాక, : రాష్ట్రంలో అతిపెద్ద గణనాథుని విగ్రహాన్ని గాజువాకలో ఏర్పాటు చేయడం ద్వారా పట్టణ ఖ్యాతి మరింత ఇనుమడించిందని గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. బుధవారం గాజువాక లంకావారి మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ గణనాథుడిని అనేక వ్యవప్రయాసలకోర్చి నిర్మించిన స్థానిక సంపత్‌వినాయక అసోసియేషన్‌ సభ్యులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.117అడుగుల ఎత్తు, 55అడుగుల వెడల్పు కలిగిన భారీ గణనాథుని విగ్రహాన్ని మేయర్‌ గురువారం ఉదయం 11.26నిమషాలకు లంకావారి మైదానంలో ప్రతిష్టించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు భారీ వినాయకుని విగ్రహం దోహదపడుందన్నారు. అనంతరం కర్నంరెడ్డి నర్సింగరావు మాట్లాడుతూ 90రోజులుపాటు 200మంది కార్మికులు అహర్నిశలు శ్రమించి 117అడుగుల విగ్రహాన్ని నిర్మించారన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఇల్లపు రాము, కర్నం కనకారావు, సంపత్‌ వినాయకా అసోసియేషన్‌ సభ్యులు శివ, ముఖేష్‌, కనకారావు తదితరులు పాల్గొన్నారు

ఎంపీవీలో వినాయకునికి నైవేథ్యంగా 6,399 కేజీల లడ్డూ

ఎం.వి.పి కాలనీ, (విశాల విశాఖ): ఎంవీపీ కాలనీలోని సంపత్‌ వినాయక యూత్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎఎస్‌ రాజా కళాశాల గ్రౌండ్స్‌లో 112 అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సుమారు 50 మంది కార్మికులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇంత భారీ విగ్రహానికి భారీ లడ్డూ నైవేథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో 6,399 కేజీల లడ్డూను తయారు చేయించారు. సువర్ణభూమి రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇందుకుగానూ రూ.10.50 లక్షలు ఖర్చు చేసింది. ఈ లడ్డూను తాపేశ్వరంలోని భక్తాంజనేయ సీట్స్‌ సంస్థ తయారు చేసింది. 15 మంది గణేష్‌ మాలలు ధరించి, లడ్డూను ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు.ఈ లడ్డూ తయారీకి 2000కేజీల శనగపండి, చక్కెర 2,100 కేజీలు, నెయ్యి 900 కేజీలు, డ్రైపూట్స్‌ 600 కేజీలు , పటికబెల్లం 450 కేజీలు ఉపయోగించినట్టు తయారీ దారు సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు. తయారీకి 24 గంటల సమయం పట్టిందని, 21 రోజులపాటు పాడవకుండా ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద పరిమాణంలో లడ్డూను ఇంతకముందు ఎవరూ తయారు చేయలేదని, ఆ ఘనత తమ సంస్థకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీ సంపత్‌ వినాయక విశాఖ యూత్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌ తుమ్ములూరి జగదీశ్వరరెడ్డి, సువర్ణ భూమి సంస్థ జీఎం మేఘం సతీష్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

నేడు ‘చిరు’తిరుపతి రాక

తిరుపతి సిటి, (విశాల విశాఖ):రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతి శాసనసభ్యులు డాక్టర్‌ చిరంజీవి శుక్రవారం తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అధికారిక, అనధికారిక, పార్టీ నాయకులతో కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, వూకా విజయ్‌కుమార్‌లు వెల్లడించారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిరంజీవి రెండు రోజుల పర్యటన వివరాలను వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో కిరణ్‌రాయల్‌ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి...
* శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 4.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు.
* 5 నుంచి 7 గంటల వరకు పిఆర్‌పి జిల్లా నాయకులతో స్థానిక పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమావేశం.
* 7.15 గంటలకు తిరుమలకు బయల్దేరి టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న కనుమూరి బాపిరాజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవుతారు.
శనివారం పర్యటన వివరాలు
* ఉదయం 9 గంటలకు స్థానిక కాంగ్రెస్‌పార్టీ నాయకులతో పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమావేశం.
* 9.50 గంటలకు హైకోర్టు బెంచి విషయంపై స్థానిక అడ్వకేట్లతో సమావేశం.
* 10.30 గంటలకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం.
* 11.30 నుంచి 12 గంటల వరకు స్థానిక పద్మావతి గెస్ట్‌హౌస్‌లో సమస్యలపై అర్జీల స్వీకరణ.
* 12 నుంచి 1 గంట వరకు డ్వాక్రా మహిళలతో సమావేశం.
* 1 నుంచి 2 గంటల వరకు వివిధ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనడం.
* 1.30 గంటలకు అండర్‌ డ్రైనేజి పనుల పరిశీలన.
* 3 గంటలకు గణేష్‌ పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

వాడలవాడలా బొజ్జగణపయ్య ఉత్సవాలు

పరవాడ,(విశాల విశాఖ) సెప్టెంబర్ 1: భక్తిశ్రద్ధలతో గణనాథుని ఉత్సవాలు మండలంలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒక వైపు ఎడ తెరిపి లేని వర్షం మరో వైపు వినాయకుని విగ్రహాలను ప్రతిష్ఠంచారు. బుధవారం అర్ధరాత్రి నుండి వరుణుడు తన ప్రతాపం చూపడంతో వినాయకుని ఉత్సవాలు ఏర్పాట్లుకు నిర్వహకులు అనేక ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం 10గంటల వరకు వర్షం కురుస్తునే ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం కాస్త తగ్గడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. పరవాడ పారిశ్రామిక ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినాయకుని ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. బొజ్జగణపయ్య ఉత్సవాలను నిర్వహించుకునేందుకు గ్రామాల్లో యువకులు పోటీ పడుతున్నారు. విద్యార్థులు సైతం బొజ్జగణపయ్యకు పూజలు చేసేందుకు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమాలలో రాజకీయ వేత్తలు, అధికారులు పాల్గొన్నారు. వినాయకుని చవితి కారణంగా మండలంలో గల పలు గణేష్ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. మండల కేంద్రమైన పరవాడ బొంకులదిబ్బ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయకుని ఉత్సవాలను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పయిల శ్రీనివాసరావు ప్రారంభించారు. నేతలు పయిల అప్పారావు, పయిల రమణబాబు, పయిల పోతునాయుడు, పయిల గోపాలకృష్ణ, పయిల వెంకటరావు, పయిల పైడంనాయుడు, బండారు చిన్నంనాయుడు, చీపురుపల్లి శ్రీనివాసరావు, పయిల హరీష్, పయిల చిన అక్కునాయుడు, శివ, ముఖేష్, నరేష్, శంకర్, మహేష్, వెంకటరావు, రామునాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలావుండగా జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గల వసుధ ఫార్మా కంపెనీలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుని విగ్రహాన్ని సంస్ధ ప్రతినిధి ప్రసాద్‌రాజు ప్రతిష్ఠించి తొలి పూజ చేశారు. లారస్‌లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని సంస్థ ప్రతినిధి నర్సింహారావు చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. తానాం షిరిడిసాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలను మాజీ మండలాధ్యక్షుడు పయిల జగన్నాథరావుప్రారంభించారు. తానాం అంబేద్కర్ యూత్ అసోసియేషన్, పండు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పైడిమాంబయూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుని సినిమాహాలు కూడలి ఏర్పాటు చేసి పూజలు చేపట్టారు. రామాలయం వీధిలో కాణిపాకం వినాయకుని రూపంలో గల విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. భరిణికం, వాడచీపురుపల్లి, నాయుడుపాలెం, లంకెలపాలెం, పి.బోనంగి, కలపాక, వెనె్నలపాలెం, గొర్లెనాయుడు, జూజులవానిపాలెం, దేశపాత్రునిపాలెం గ్రామాల్లో వినాయకుని ఉత్సవాలు ప్రారంభించారు. వినాయకుని చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పందిళ్లు వద్ద రంగు రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన బొజ్జగణపయ్య విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పరవాడ , తానాం గ్రామంలో ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. షిరిడిసాయి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచముఖ వినాయకుని విగ్రహం ప్రత్యేకంగా నిలిచింది. తానాం ఎస్సీ కాలనీ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహంతో పాటు రొంగలివారి వీధిలో ఏర్పాటు చేసిన శివపార్వతుల మధ్య వినాయకుని విగ్రహం, పులినోట్ల వినాయకుని విగ్రహంతో పాటు కాణిపాకం వినాయకుని రంగంలో ఉన్న విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తుంది.

రాజీనామాలపై పునరాలోచించే పరిస్థితి వస్తుంది: చిరంజీవి

హైదరాబాద్‌: రాజీనామాలు చేసిన 26 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాల విషయంలో పునరాలోచనలో పడే పరిస్థితి వస్తుందని కాంగ్రెస్‌ నేత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. వినాయకచవితి సందర్భంగా బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చిరంజీవి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్న సుభిక్షంగా ఉంటేనే దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉంటాయన్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు రావడంతో అందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని, తాను ఏ స్థాయిలో ఉండాలనేది ప్రజలే నిర్ణయిస్తారనీ ఆయన అన్నారు. వచ్చే పుట్టినరోజునాటికి తన 150 వ చిత్రం వస్తుందని ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు.

మీడియాలో 'అతి' నియంత్రణకు కమిటీ!

న్యూఢిల్లీ: మీడియా గోరంతలు కొండంతలు చేసి చెప్పడాన్ని నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఓ కమిటీని వేయాలని యోచిస్తోంది. మీడియా కారణంగానే అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం బలోపేతం అయిందని కొన్ని వర్గాలు చేస్తున్న వాదన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా... మీడియా అతిగా స్పందిస్తున్న తీరును కట్టడి చేయాలనుకుంటోంది. మీడియాలో వచ్చే అలాంటి అంశాలను పరిశీలించేందుకు, ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు కమిటీని నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం జరిగిన కేంద్రకేబినెట్‌ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వార్తల్లో 'అతి'ని నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ కేబినెట్‌ సమావేశంలో అభిప్రాయపడినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి.

కాలినడకన కొండ ఎక్కుతున్న కనుమూరి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త అధ్యక్షునిగా నియమితులైన కనుమూరి బాపిరాజు కాలినడకన తిరుమలకొండ ఎక్కుతున్నారు. ఈరోజు ఉదయం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలకు హాజరైన బాపిరాజు సాయంత్రం తిరుమల కొండకు బయల్దేరారు.