* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

2, జనవరి 2011, ఆదివారం

నష్టాల నివారణకు చర్యలు: ఆర్టీసీ ఆర్‌ఎం

అనకాపల్లి పట్టణం, జనవరి1 : ఆర్టీసీ నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జి.మహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ఫ్యామిలీ క్యాట్‌ కార్డు విజేతలను డ్రా తీసి ప్రకటించారు. ఇందులో విజేతలుగా నిలిచిన టికెట్టు నంబర్లు (859919, 374938, 851273) గల వారికి ఏడాది పాటు క్యాట్‌ కార్డు రాయితీ కల్పిస్తామని ఆయన వివరించారు. ప్రయాణికులను ఆకట్టుకోడానికి ఇలాంటి చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ఒడిదుడుకుల వల్ల సంస్థకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ రీజియన్‌ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కిలోమీటరుకు రూ. 1.50 పైసలు ఆర్టీసీ నష్టపోయిందని ఆయన చెప్పారు. ఈ లెక్కల ప్రకారం గత ఏడాది రూ. 15 కోట్ల పైగా నష్టం వచ్చిందని ఆయన వివరించారు. నష్టం నివారకణకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు. 45 ఏళ్లు పైబడిన డ్రైవర్లకు ఏడాదిలో మూడు సార్లు ఆరోగ్య తనిఖీలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని డీఎంలను ఆదేశించామని ఆర్‌ఎం అన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి డిపో మేనేజర్‌ గిరీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రరాపాను మరింత బలోపేతం చేస్తాం

విశాఖపట్నం
: రానున్న రోజుల్లో ప్రజారాజ్యం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని ఆ పార్టీ నాయకుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం ఎంవీపీకాలనీలోని పార్టీ కార్యాలయంలో అర్బన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో రాజకీయ స్తబ్ధత నెలకొందని, వై.ఎస్‌.ఆర్‌. అకాల మరణం తర్వాత కాంగ్రెస్‌ పార్టీ చుక్కాని లేని నావలా కొట్టుమిట్టాడుతుందన్నారు. ఆ తర్వాత వచ్చిన రోశయ్యకు పాలనపై పట్టులేదని, ప్రస్తుతం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన కూడా అదేస్థాయిలో ఉందని విమర్శించారు. ఇక దేశం పార్టీ విషయానికి వస్తే ఏడురోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టినా చంద్రబాబును విశ్వసించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ప్రభుత్వం మంచి చేస్తే ప్రోత్సహించడం, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ప్రజల పక్షాన పోరాడడంపై ప్రరాపా దృష్టిసారించిందన్నారు. జిల్లాలో నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉంటూ పార్టీని బలమైన శక్తిగా తయారుచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెలలో చిరంజీవి జిల్లా పర్యటన ఉందన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్‌, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ ఈనెల నుంచి ప్రణాళికాబద్ధంగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. వారం రోజుల్లో మహిళా, యువరాజ్యం కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో అర్బన్‌ కమిటీ అధ్యక్షుడు గణబాబు, ప్రధాన కార్యదర్శి కాశీవిశ్వనాథ్‌, నాయకులు కోలా గురువులు, రాఘవరావు, శరత్‌కుమార్‌, పసుపులేటి ఉషాకిరణ్‌, కె.లక్ష్మి, పి.రమణకుమారి, ఇందిరానాయుడు, సోమనాథ్‌, మహేష్‌, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి

మెదక్‌ (విశాల విశాఖ): గజ్వేల్‌ప్రజ్ఞాపూర్‌ రహదారిపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. లారీ, ఆటో ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... ఇంకొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ఓ మహిళ ఉంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సుస్థిర పాలన తెదేపాతోనే సాధ్యం: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: ప్రస్తుత పరిణామాలను గమనిస్తే రాష్ట్రంలో సుస్థిర పాలన తెదేపాతోనే సాధ్యపడుతుందని ఆ పార్టీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు అన్నారు. రాబోయే కాలంలో తెదేపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. గత 5 సంవత్సరాలలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో తెలుసునని చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం సైతం అవినీతిపై విచారణ జరిపించే స్థాయికి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.

ఢిల్లీలో కూలిన రెండంతస్తుల భవనం

ఢిల్లీ: ఢిల్లీలోని భావన పారిశ్రామిక ప్రాంతంలో ఓ రెండతస్తుల భవనం కూలింది. భవన శిథిలాల నుంచి అధికారులు 10 మందిని సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకొని మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.

1, జనవరి 2011, శనివారం

భూముల అమ్మకంతో ఎన్టీసీకి రూ.145 కోట్ల నిధులు

 గుజరాత్‌ రాష్ట్రంలోని భూములను విక్రయించడం వల్ల ఎన్టీసీ కంపెనీ 145 కోట్ల రూపాయలను సమకూర్చుకుంది. ఈ సంస్థకు చెందిన రెండు సొంత మిల్లులకు చెందిన స్థలాన్ని మూడు రోజుల పాటు సాగిన బిడ్జింగ్ విధానం ద్వారా విక్రయించింది.మొత్తం 94262 చదరపు మీటర్ల విస్తీర్ణ కలిగిన ఈ స్థలాన్ని ఈ యాక్షన్ పద్దతి ద్వారా విక్రయించినట్టు కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అహ్మాదాబాద్ అడ్వాన్స్‌డ్ మిల్స్ కంపెనీకి చెందిన న్యూ మానెక్‌చౌక్ టెక్స్‌టైల్ మిల్స్‌కు అవసరమైన 33,222 చదరపు మీటర్ల స్థల ప్లాట్‌ను రూ.118.40 కోట్లకు ఆ సంస్థ కైవసం చేసుకుంది.మరో 61,040 చదరపు మీటర్ల స్థలాన్ని లోక్ ప్రకాషన్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ స్థలం ఇప్పటికే మూతపడిన భావనగర్‌లోని మహాలక్ష్మి టెక్స్‌టైల్స్ మిల్స్‌కు చెందిన సంస్థకు చెందింది. ఈ స్థలాన్ని రూ.27.53 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రెండు ప్రాపర్టీలకు సంబంధించిన స్థల విక్రయ పాటల్లో తాము ఆశించిన ధర పలికిందని ఎన్టీసీ కంపెనీ వెల్లడించింది.

2011 దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..?

ఈ సంవత్సరం మే నెల వరకూ బృహస్పతి మీనం నందు ఆ తదుపరి అంతా మేషం నందు జూన్ 6వ తేదీ వరకూ ధనస్సు నందు రాహువు, మిధునము నందు కేతువు, ఆ తదుపరి అంతా వృశ్చికము నందు రాహువు, వృషభము నందు కేతువు, నవంబరు 15వ తేదీ వరకు కన్య యందు శని, ఆ తదుపరి అంతా తుల యందు సంచరిస్తారు.ఈ గ్రహ సంచారాన్ని గమనించగా ప్రజలలో నూతన ఆలోచనలు స్పురిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిత్యావసర వస్తు ధరలు గణనీయంగా పెరుగగలవు. రాజకీయ సంక్షోభం అధికం కాగలదు. ప్రజలలో పరస్పర అవగాహనా లోపం, విభేదాలు వంటివి అధికమవుతాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు గురుమౌఢ్యమి ఉన్నందువల్ల ఇందు శుభకార్యములు చేయరాదు. ప్రాంతీయ తత్వాలు అధికమవుతాయి.ప్రజలలో హింసాత్మక ధోరణి అధికం కాగలదు. మే 4వ తేదీ నుంచి డొల్లు కత్తెర ప్రారంభం. మే 29 వరకూ నిజకత్తెర ఉన్నందువల్ల శంకుస్థాపన గృహప్రవేశాదులు చేయరాదు. మే 8వ తేదీ నుంచి బృహస్పతి మేషం నందు సంచరించడం వల్ల వాతావరణం మార్పు ప్రజలకు ఎందో ఆందోళన కలిగిస్తుంది. గంగానదీ పుష్కరాలు ప్రారంభం కాగలవు. ఈ ఏడాది ఎండలు త్వరతగతిన ప్రారంభమవుతాయి. స్త్రీ బలవంత మరణాలు అధికం కాగలవు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగు ధాన్యాల ధరలు చుక్కలను అంటుతాయి. దక్షిణ భారతదేశంలో రాజకీయ సంక్షోభం అధికం కాగలవు. త్వరతగతిన వర్షాలు పడటం వల్ల వ్యవసాయ రంగాలవారికి సంతృప్తి కానవస్తుంది. టెక్నికల్, ఐటీ రంగాల వారికి ఆశాజనకం. ఉత్తర భారతదేశంలో భూమి ప్రకంపిస్తుంది.
15/06/2011 సంపూర్ణ చంద్రగ్రహణం జ్యేష్ట, మూలా నక్షత్రం మీద ఏర్పడటం వల్ల వృశ్చిక, ధనుర్ రాశివారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. జులై 13వ తేదీ నుంచి సెప్టెంబరు 25 వరకు శుక్ర మౌఢ్యమి కలదు. ఆగస్టు, అక్టోబరు, నవంబరు ప్రాంతాలలో వర్షపాతం అధికం కావడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. డిసెంబరు 10వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రోహిణి నక్షత్రయుక్త వృషభరాశి నందు ఏర్పడటం వల్ల ఈ రాశివారు దీనిని చూడకుండా ఉండంట మంచిది. స్త్రీ సంతతికన్నా పురుష సంతతి అధిగమవుతుంది.రైలు, బస్సు, విమానరోడ్డు ప్రమాదాలు అధికము కాగలవు. దేవాలయాలకు రక్షక భటులకు రక్షణ కరువవుతుంది. వైజ్ఞానిక, అంతరిక్ష పరిశోధకులకు మంచి గుర్తింపు లభించగలదు. చోరుల వల్ల, దేశ విద్రోహుల వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతారు. క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించిడం వల్ల, ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల, శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల సర్వ దోషాలు తొలగిపోయి శుభం కలుగుతుంది.