2, జనవరి 2011, ఆదివారం
సుస్థిర పాలన తెదేపాతోనే సాధ్యం: దాడి వీరభద్రరావు
హైదరాబాద్: ప్రస్తుత పరిణామాలను గమనిస్తే రాష్ట్రంలో సుస్థిర పాలన తెదేపాతోనే సాధ్యపడుతుందని ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు అన్నారు. రాబోయే కాలంలో తెదేపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. గత 5 సంవత్సరాలలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో తెలుసునని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం సైతం అవినీతిపై విచారణ జరిపించే స్థాయికి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి