ఈ సంవత్సరం మే నెల వరకూ బృహస్పతి మీనం నందు ఆ తదుపరి అంతా మేషం నందు జూన్ 6వ తేదీ వరకూ ధనస్సు నందు రాహువు, మిధునము నందు కేతువు, ఆ తదుపరి అంతా వృశ్చికము నందు రాహువు, వృషభము నందు కేతువు, నవంబరు 15వ తేదీ వరకు కన్య యందు శని, ఆ తదుపరి అంతా తుల యందు సంచరిస్తారు.ఈ గ్రహ సంచారాన్ని గమనించగా ప్రజలలో నూతన ఆలోచనలు స్పురిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిత్యావసర వస్తు ధరలు గణనీయంగా పెరుగగలవు. రాజకీయ సంక్షోభం అధికం కాగలదు. ప్రజలలో పరస్పర అవగాహనా లోపం, విభేదాలు వంటివి అధికమవుతాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు గురుమౌఢ్యమి ఉన్నందువల్ల ఇందు శుభకార్యములు చేయరాదు. ప్రాంతీయ తత్వాలు అధికమవుతాయి.ప్రజలలో హింసాత్మక ధోరణి అధికం కాగలదు. మే 4వ తేదీ నుంచి డొల్లు కత్తెర ప్రారంభం. మే 29 వరకూ నిజకత్తెర ఉన్నందువల్ల శంకుస్థాపన గృహప్రవేశాదులు చేయరాదు. మే 8వ తేదీ నుంచి బృహస్పతి మేషం నందు సంచరించడం వల్ల వాతావరణం మార్పు ప్రజలకు ఎందో ఆందోళన కలిగిస్తుంది. గంగానదీ పుష్కరాలు ప్రారంభం కాగలవు. ఈ ఏడాది ఎండలు త్వరతగతిన ప్రారంభమవుతాయి. స్త్రీ బలవంత మరణాలు అధికం కాగలవు.రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటుంది. ఎరుపు, తెలుపు రంగు ధాన్యాల ధరలు చుక్కలను అంటుతాయి. దక్షిణ భారతదేశంలో రాజకీయ సంక్షోభం అధికం కాగలవు. త్వరతగతిన వర్షాలు పడటం వల్ల వ్యవసాయ రంగాలవారికి సంతృప్తి కానవస్తుంది. టెక్నికల్, ఐటీ రంగాల వారికి ఆశాజనకం. ఉత్తర భారతదేశంలో భూమి ప్రకంపిస్తుంది.
15/06/2011 సంపూర్ణ చంద్రగ్రహణం జ్యేష్ట, మూలా నక్షత్రం మీద ఏర్పడటం వల్ల వృశ్చిక, ధనుర్ రాశివారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది. జులై 13వ తేదీ నుంచి సెప్టెంబరు 25 వరకు శుక్ర మౌఢ్యమి కలదు. ఆగస్టు, అక్టోబరు, నవంబరు ప్రాంతాలలో వర్షపాతం అధికం కావడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. డిసెంబరు 10వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రోహిణి నక్షత్రయుక్త వృషభరాశి నందు ఏర్పడటం వల్ల ఈ రాశివారు దీనిని చూడకుండా ఉండంట మంచిది. స్త్రీ సంతతికన్నా పురుష సంతతి అధిగమవుతుంది.రైలు, బస్సు, విమానరోడ్డు ప్రమాదాలు అధికము కాగలవు. దేవాలయాలకు రక్షక భటులకు రక్షణ కరువవుతుంది. వైజ్ఞానిక, అంతరిక్ష పరిశోధకులకు మంచి గుర్తింపు లభించగలదు. చోరుల వల్ల, దేశ విద్రోహుల వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతారు. క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించిడం వల్ల, ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల, శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వల్ల సర్వ దోషాలు తొలగిపోయి శుభం కలుగుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి