1, జనవరి 2011, శనివారం
భూముల అమ్మకంతో ఎన్టీసీకి రూ.145 కోట్ల నిధులు
గుజరాత్ రాష్ట్రంలోని భూములను విక్రయించడం వల్ల ఎన్టీసీ కంపెనీ 145 కోట్ల రూపాయలను సమకూర్చుకుంది. ఈ సంస్థకు చెందిన రెండు సొంత మిల్లులకు చెందిన స్థలాన్ని మూడు రోజుల పాటు సాగిన బిడ్జింగ్ విధానం ద్వారా విక్రయించింది.మొత్తం 94262 చదరపు మీటర్ల విస్తీర్ణ కలిగిన ఈ స్థలాన్ని ఈ యాక్షన్ పద్దతి ద్వారా విక్రయించినట్టు కంపెనీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అహ్మాదాబాద్ అడ్వాన్స్‌డ్ మిల్స్ కంపెనీకి చెందిన న్యూ మానెక్‌చౌక్ టెక్స్‌టైల్ మిల్స్‌కు అవసరమైన 33,222 చదరపు మీటర్ల స్థల ప్లాట్‌ను రూ.118.40 కోట్లకు ఆ సంస్థ కైవసం చేసుకుంది.మరో 61,040 చదరపు మీటర్ల స్థలాన్ని లోక్ ప్రకాషన్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ స్థలం ఇప్పటికే మూతపడిన భావనగర్‌లోని మహాలక్ష్మి టెక్స్‌టైల్స్ మిల్స్‌కు చెందిన సంస్థకు చెందింది. ఈ స్థలాన్ని రూ.27.53 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రెండు ప్రాపర్టీలకు సంబంధించిన స్థల విక్రయ పాటల్లో తాము ఆశించిన ధర పలికిందని ఎన్టీసీ కంపెనీ వెల్లడించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి