అనకాపల్లి పట్టణం, జనవరి1 : ఆర్టీసీ నష్టాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జి.మహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ఫ్యామిలీ క్యాట్ కార్డు విజేతలను డ్రా తీసి ప్రకటించారు. ఇందులో విజేతలుగా నిలిచిన టికెట్టు నంబర్లు (859919, 374938, 851273) గల వారికి ఏడాది పాటు క్యాట్ కార్డు రాయితీ కల్పిస్తామని ఆయన వివరించారు. ప్రయాణికులను ఆకట్టుకోడానికి ఇలాంటి చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ఒడిదుడుకుల వల్ల సంస్థకు నష్టం వాటిల్లిందన్నారు. ఈ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కిలోమీటరుకు రూ. 1.50 పైసలు ఆర్టీసీ నష్టపోయిందని ఆయన చెప్పారు. ఈ లెక్కల ప్రకారం గత ఏడాది రూ. 15 కోట్ల పైగా నష్టం వచ్చిందని ఆయన వివరించారు. నష్టం నివారకణకు చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు. 45 ఏళ్లు పైబడిన డ్రైవర్లకు ఏడాదిలో మూడు సార్లు ఆరోగ్య తనిఖీలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని డీఎంలను ఆదేశించామని ఆర్‌ఎం అన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి డిపో మేనేజర్ గిరీష్‌కుమార్ పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి