* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

3, జనవరి 2011, సోమవారం

అప్పన్న తెప్పోత్సవానికి సన్నాహాలు

సింహాచలం : ఏటా జరిగే శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవాన్ని వైభవంగా జరుపడానికి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం స్వామి వరాహ పుష్కరిణిలో విహరించే హంస వాహనాల తయారీ పనులు ప్రారంభించారు. పుష్యబహుళ అమావాస్యనాడు వరాహపుష్కరిణిలో స్వామి తెప్పతిరునాళ్ల ఉత్సవం జరుగుతోంది. ఇందులో భాగంగా సింహగిరిపై నుంచి అప్పన్న స్వామి ఉభయదేవేరులతో కొండదిగువకు వస్తారు. హంసవాహనంపై దేవతామూర్తులు విహారయాత్ర చేస్తారు. ఈనేపథ్యంలోనే పుష్కరిణి చెరువులో స్వామి విహరించే హంసవాహనాన్ని ఇప్పటినుంచే తయారు చేస్తున్నారు. దీంతోపాటు పుష్కరిణి చెరువు శుభ్రం చేసే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కరిణి గట్లపై ఈసారి భారీ ఎత్తున విద్యుత్తు దీపాలంకరణ చేయనున్నారు.

త్వరలో 11 వేల కార్డుల పునరుద్ధరణ

 కలెక్టర్‌ శ్యామలరావు వెల్లడి
విశాఖ : నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 11 వేల తెల్ల రేషను కార్డులను పునరుద్ధరించనున్నట్లు కలెక్టర్‌ జె.శ్యామలరావు వెల్లడించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా వివిధ ప్రాంతాల వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పునరుద్ధరణ కోసం 18 వేల కార్డులను హైదరాబాద్‌కు పంపామని తెలిపారు. వీటిలో ఇంతవరకు 6,798 పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మిగిలిన కార్డులకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లలో ఫీడ్‌ చేసేందుకు విశాఖ నుంచి డేటాఎంట్రీ ఆపరేటర్లను హైదరాబాద్‌కు పంపామన్నారు. పునరుద్ధరించిన కార్డుదారులకు సంబంధించిన పింఛన్లను కూడా కొనసాగిస్తామని తెలిపారు. వివిధ సంఘాల నాయకులు పింఛన్లను పునరుద్ధరించాలని కోరగా కలెక్టర్‌పై విధంగా స్పందించారు. ఈ వారం మొత్తంమీద 120 అర్జీలు అందాయి. రెవెన్యూ, పౌర సరఫరాలు, జీవీఏంసీ, డీఆర్‌డీఏ, డ్వామా, గృహ నిర్మాణం, వికలాంగుల సంక్షేమానికి సంబంధించినవి అధికంగా వచ్చాయి. రేషనుకార్డుల్లో వయస్సు తప్పుగా పడడం వల్ల వృద్ధాప్యపు పింఛన్లు రావడం లేదని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేయగా, ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మాకవరపాలెంలో రేషను డిపో డీలరుపై వచ్చిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఆర్వో వెంకటరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మూర్తి, ఎ.ఎస్‌.ఒ.లు భాస్కర్రావు, సూర్యప్రకాశరావు, ఆరోగ్యశ్రీ వైద్యాధికారి సాల్మన్‌రాజు, అధికారులు రంగాచారి, శ్రీనివాసరావు, దాసు, తదితరులు పాల్గొన్నారు. కూర్మన్నపాలెం వద్ద ఉన్న టోలుగేటును లంకెలపాలెం శివారుకు తరలించాలని గాజువాకకు చెందిన గుడివాడ శ్రీనివాసరావు, ముద్రగడ మణిలు కలెక్టర్‌ను కోరారు. నగర పరిధి పెరిగిందున టోలుగేట్‌ను మార్చాలని, ఈ రకంగా మార్చకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

తిరుపతి లడ్డూలో మేకు: నాణ్యత పట్టించుకోని తితిదే!

 కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రోజురోజుకి భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) భక్తులకు ఇచ్చే శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ నాణ్యతపై దృష్టి పెట్టలేకపోతోంది. తిరుమల కొండపై ఓ లడ్డూలో నట్టు ఉండటం గమనించిన భక్తులు షాక్ అయ్యారు.అంతేకాదు.. నానాటికి తిరుమల దేవస్థానం తయారు చేస్తున్న లడ్డూ ప్రసాదంలో నాణ్యత కొరవడుతుందని, లడ్డూల్లో చిన్న చిన్న పురుగులు కనిపించడం పోయి.. ఇప్పుడు పెద్ద నట్టులు కూడా కనిపిస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. ఇంకా దేవుని దివ్య ప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లోపించకుండా తితిదే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.ఇకపోతే.. తిరుమల వెంకన్న స్వామి ఆలయానికి వీవీఐపీల తాకిడి రోజు రోజుకి పెరిగిపోతోంది. ప్రోటోకాల్ చట్టం ద్వారా శ్రీవారిని దర్శించుకునే వీవీఐపీల సంఖ్య పెరిగిపోతోంది. ప్రోటోకాల్ ద్వారా వీవీఐపీల దర్శనం వల్ల నెలకు రూ.50వేల వరకు ఖర్చవుతుంది. సంవత్సరానికి రూ.15లక్షల వరకు టీటీడీ ఖాతాలో చిల్లు పడుతోందని తెలిసింది.

ఇరానీ గ్యాంగ్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడు ఇరానీ గ్యాంగులు ప్రవేశించాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్‌ ఏకే ఖాన్‌ తెలిపారు. ఇందిరాపార్క్‌, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనల్లో పోలీసుల తీరులో తప్పులేదని ఆయన అన్నారు. ఆందోళనల్లో మహిళాపోలీసులను గాయపరిచినవారిని వీడియోటేపులద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

నేడు ఆకాశంలో ఉల్కల కనువిందు

న్యూఢిల్లీ: కాంతులీనే ఉల్కాపాతం సోమవారం ఆకాశంలో కనువిందు చేయనుంది. కొత్త సంవత్సరాన వెలుగులు విరజిమ్మనుంది. ఒక స్థానం నుంచి అనేక ఉల్కలను వెదజల్లే 'క్వాడ్రాంటిడ్స్‌' ఉల్కాపాతం రాత్రి సమయంలో కనిపించనుందని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆర్‌సీ కపూర్‌ ఆదివారమిక్కడ తెలిపారు.
 

విశాఖ ఓదార్పుయాత్రకు స్వల్పవిరామం

విశాఖపట్నం: యువనేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ నెల 11న ఢిల్లీ వెళుతున్నందున విశాఖ ఓదార్పు యాత్రకు స్వల్ప విరామం ఏర్పడనుంది. కృష్ణాజలాల తీర్పుని వ్యతిరేకిస్తూ, రైతుల సమస్యల పరిష్కారం కోసం 11న ఢిల్లీలో ఒక రోజు నిరాహారదీక్ష చేపడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతుల సమస్యలు వివరించేందుకు ఆరోజు సాయంత్రం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్'మెంట్ కూడా జగన్ కోరారు. నిరాహారదీక్ష చేపట్టేందుకు జగన్ రైలులో ఢిల్లీ వెళతారు. ఢిల్లీ నుంచి రాగానే ఓదార్పు యాత్ర యథావిథిగా కొనసాగుతుంది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆప్కో యూనిఫారాలు

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఆప్కో ద్వారా యూనిఫారాలు అందజేస్తామని చేనేత శాఖ మంత్రి శంకర్రావు తెలిపారు. దీనికోసం 250 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. చేతివృత్తిదారులకు న్యాయం జరిగేలా యూనిఫాం కుట్టుపనులు వారికే అప్పగిస్తామని ఆయన తెలిపారు. చేనేత రుణమాఫీకి సంబంధించి తొలిదశలో 87 కోట్ల రూపాయలు విడుదల చేసే ఫైలుపై మంత్రి సంతకం చేశారు.