సింహాచలం : ఏటా జరిగే శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి తెప్పోత్సవాన్ని వైభవంగా జరుపడానికి దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం స్వామి వరాహ పుష్కరిణిలో విహరించే హంస వాహనాల తయారీ పనులు ప్రారంభించారు. పుష్యబహుళ అమావాస్యనాడు వరాహపుష్కరిణిలో స్వామి తెప్పతిరునాళ్ల ఉత్సవం జరుగుతోంది. ఇందులో భాగంగా సింహగిరిపై నుంచి అప్పన్న స్వామి ఉభయదేవేరులతో కొండదిగువకు వస్తారు. హంసవాహనంపై దేవతామూర్తులు విహారయాత్ర చేస్తారు. ఈనేపథ్యంలోనే పుష్కరిణి చెరువులో స్వామి విహరించే హంసవాహనాన్ని ఇప్పటినుంచే తయారు చేస్తున్నారు. దీంతోపాటు పుష్కరిణి చెరువు శుభ్రం చేసే చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కరిణి గట్లపై ఈసారి భారీ ఎత్తున విద్యుత్తు దీపాలంకరణ చేయనున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి