* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

4, జనవరి 2011, మంగళవారం

ఆ వేలు పొడవుగా ఉంటే అమ్మాయిలు లక్కలా అతుక్కుపోతారట..!

అమ్మాయిలూ.. అబ్బాయిలు ధనవంతులో కాదో తెలుకోవడానికి మీరేం చేస్తారు..? మహా అయితే అతని పర్స్ లేదా అతని వెనకున్న ఆస్తిపాస్తులు చూస్తారేమో.. కదా..! అలా చేస్తే మీరు పర్సులో లెగ్ వేసినట్లే..!అబ్బాయిలు ధనవంతులని తెలుసుకోవడానికి ఇవేమి చూడనక్కర్లేదట.. కేవలం అతని చేతి వేళ్లను గమనిస్తే చాలట. ఏంటి నమ్మడం లేదా..? నిజమండీ.. అబ్బాయిల ఉంగరపు వేలు (రింగ్ ఫింగర్), మిగిలిన వేళ్ల కన్నా పొడవుగా ఉంటే గొప్ప ధనవంతులవుతారని చెబుతున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు.
ప్రత్యేకించి చూపుడు వేలు (ఇండెక్స్ ఫింగర్) కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉన్నట్లయితే అతను ధనం అధికంగా సంపాదించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని వారు చెబుతున్నారు. అంతే కాదు.. అటువంటి వ్యక్తి "కష్టపడి పనిచేస్తాడు, కష్టపడి ఆడుతాడు" అని కూడా సెలవిస్తున్నారు. ఒక ఆర్థిక పరమైన డీల్ కానివ్వండి లేదా అమ్మాయి హృదయం గెలుచుకోవడం కానివ్వండి దేనికీ.. "నో" అని సమాధానం చెప్పడట.అంతే కాదండోయ్.. రింగ్ ఫింగర్ పొడవుగా ఉండే అబ్బాయిలతో అమ్మాయిలు లక్కలా అతుక్కుపోతారట. అతనితో జీవితం అత్యంత సురక్షితంగా ఉంటుందని, అతనో "మిస్టర్ రిలయబిల్" (నమ్మదగిన వ్యక్తి) అని కితాబులిచ్చేస్తున్నారు.ఇందులో పెద్ద ఆంతర్యం ఏమీ లేదండి..! వారు తమ పరిశోధనలో స్త్రీ, పురుషులలోని చేతివేళ్ల పొడవుల మీద టెస్టోస్టెరోన్ స్థాయిల ప్రభావంపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఉంగరపు వేలు పొడవుగా ఉండే పురుషులు దేన్నైనా పోటీగా తీసుకని కష్టపడని పని చేసి సాధిస్తారు. ఇలాంటి వారిలో టెస్టోస్టెరాన్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుందట.కెనడాకు చెందిన కాన్కార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 415 మంది స్త్రీ, పురుషులపై పరిశోధన జరిపి ఈ విషయాలను ప్రకటించారు. అధిక టెస్టోస్టెకాన్, రిస్క్ తీసుకోవడం ఈ రెండు అంశాలపై వారు అధ్యయనం చేశారు. పురషులలో వినోదం (క్రీడలు), సామాజికం, ఆర్థికం అనే మూడు అంశాలపై వారు తీసుకునే రిస్క్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు.

పొలం దున్నుతుండగా బయటపడ్డ మావోయిస్టుల డంప్‌

శ్రీకాకుళం: మెలియాపుట్టి మండలం భరణికోటలో మావోయిస్టు భారీ డంప్‌ బయటపడింది. ఆ పొలం రైతు దున్నుతుండగా ఇవి బయటపడ్డాయి. ఉలిక్కిపడ్డ ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు పూర్తి స్థాయిలో దాన్ని వెలికితీశారు. ఇందులో 40 గ్రెనేడ్లు, 8 ప్రెజర్‌మైన్లు, 9 గ్యాస్‌స్టిక్స్‌, 52 గ్రెనెడ్‌ సేఫ్టీలీవర్లు, దుస్తులు, విప్లవ సాహిత్యం, బ్యానర్లు లభ్యం అయ్యాయి. వీటన్నింటిని జిల్లా కేంద్రానికి తరలించారు

ప్రియమణి ఎక్స్‌పోజింగ్ ముందు అనుష్క పోజింగ్ ఎంత..?


 ప్రియమణి ఎద సొంపులను పరిమితికి మించి ఆరబోసిందని సినీజనం చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఒప్పుకోవడం లేదట.ప్రియమణి నటన గురించి పల్లెత్తు మాట మాట్లాడకుండా, అనుష్క చాలా క్యూట్‌గా ఉందనీ, హుందాగా నటించిందని నాగ్ రగడ గురించి అడిగినవారికి చెపుతున్నాడట. దీంతో ప్రియమణి ఉడుక్కుంటోందట.అయితే ప్రియమణి సన్నిహితులు మాత్రం ప్రియ అందాలు, గ్లామర్ ముందు అనుష్క ఎంత చూపించినా వర్కవుట్ కాదని కొట్టిపారేస్తున్నారట. పైగా జాతీయ నటితోనా పోటీ...? అంటూ దీర్ఘాలు తీస్తున్నారట. మరి అనుష్క దీనిపై ఏమంటుందో... ఏంటో..?

సూరి మరణ వార్తతో వర్మ షాక్

న్యూఢిల్లీ: మద్దెల చెరువు సూరి మరణవార్తను విని తాను షాక్ గురయ్యానని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ట్విట్టర్‌లో తెలిపారు. రక్త చరిత్ర సినిమా తీయడానికి సూరియే స్పూర్తి అని ఆయన తెలిపారు. రక్త చరిత్ర సినిమా నిర్మిణానికి చేసిన పరిశోధన కోసం సూరితో గత కొద్దికాలంగా తాను టచ్‌లో వున్నానని ఆయన అన్నారు. అటువంటి మనిషి చనిపోయాడన్న వార్త తనను ఎంతో కలిచివేసిందని ఆయన ట్విట్టర్ తెలిపారు. పరిటాల రవి, మద్దెల చెరువు సూరిల మధ్య వున్న ఫ్యాక్షన్ చరిత్రను తె రకెక్కించడానికి 2009 సంవత్సరంలో అనంతపురం జైలుని వర్మ సందర్శించారు. ఆ సమయంలోనే సూరితో వర్మ సమావేశమైనారు.

6వతేదీ సాయంత్రం ఇంటర్‌నెట్‌లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక

న్యూఢిల్లీ: ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లో శ్రీకృష్ణకమిటీ నివేదిక ఉంచుతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. 6వ తేదీ అఖిలపక్ష సమావేశాన్ని కేవలం పార్టీలకు నివేదిక అందించేందుకే ఏర్పాటుచేశామని తెలిపింది. నివేదికను పార్టీలు అధ్యయనం చేశాక వీలును బట్టి వివిధపార్టీలు చిదంబరంతో సంప్రదింపులు జరపవచ్చని తెలిపింది.

సూరి మృతదేహం అనంతపురం తరలింపు

హైదరాబాద్‌: ఉస్మానియాలో శవపరీక్ష అనంతరం సూరి మృతదేహాన్ని అనంతపురం తరలించారు. రేపు ఉదయం ఆయన స్వగ్రామం మద్దెలచెరువులో అంత్యక్రియలు జరపనున్నట్లుసూరి మేనమామ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సూరి భార్య భానుమతి, కుమారుడు హర్షవర్థన్‌రెడ్డి ఇతర బంధువులు మార్చురీ వద్దకు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

3, జనవరి 2011, సోమవారం

అన్నకు చెల్లి మరి తమ్ముడికో


తెల్లపిల్ల తాప్సీ గురించి మోహన్ బాబు తనయుడు మంచు విష్ణును అభిప్రాయం అడిగితే అవాక్కయ్యే సమాధానం ఇచ్చేశాడు. తాప్సీ తన సొంత చెల్లెలు లాంటిదని చెప్పాడు.విష్ణు చెప్పిన మాటలు విని అక్కడివారంతా ముక్కున వేలేసుకున్నారట. వస్తాడు నా రాజు చిత్రంలో తాప్సీతో వేడి వేడి సన్నివేశాల్లో నటించడమే కాక వేడి ముద్దులు కురిపించిన మంచు విష్ణు, తాప్సీని తన చెల్లెలితో పోల్చడం ఏమిటని వింతగా చూశారట.కానీ వారి మాటలేమీ పట్టించుకోని విష్ణు... తాప్సీ తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందనీ, తన మటుకు తాను ఆమెను చెల్లెల్లా ట్రీట్ చేస్తానని చెప్పేశాడు. మరి తమ్ముడు మంచు మనోజ్ ఎటువంటి బంధం ఉందని చెపుతాడో...?