అమ్మాయిలూ.. అబ్బాయిలు ధనవంతులో కాదో తెలుకోవడానికి మీరేం చేస్తారు..? మహా అయితే అతని పర్స్ లేదా అతని వెనకున్న ఆస్తిపాస్తులు చూస్తారేమో.. కదా..! అలా చేస్తే మీరు పర్సులో లెగ్ వేసినట్లే..!అబ్బాయిలు ధనవంతులని తెలుసుకోవడానికి ఇవేమి చూడనక్కర్లేదట.. కేవలం అతని చేతి వేళ్లను గమనిస్తే చాలట. ఏంటి నమ్మడం లేదా..? నిజమండీ.. అబ్బాయిల ఉంగరపు వేలు (రింగ్ ఫింగర్), మిగిలిన వేళ్ల కన్నా పొడవుగా ఉంటే గొప్ప ధనవంతులవుతారని చెబుతున్నారు కెనడాకు చెందిన పరిశోధకులు.
ప్రత్యేకించి చూపుడు వేలు (ఇండెక్స్ ఫింగర్) కన్నా ఉంగరపు వేలు పొడవుగా ఉన్నట్లయితే అతను ధనం అధికంగా సంపాదించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయని వారు చెబుతున్నారు. అంతే కాదు.. అటువంటి వ్యక్తి "కష్టపడి పనిచేస్తాడు, కష్టపడి ఆడుతాడు" అని కూడా సెలవిస్తున్నారు. ఒక ఆర్థిక పరమైన డీల్ కానివ్వండి లేదా అమ్మాయి హృదయం గెలుచుకోవడం కానివ్వండి దేనికీ.. "నో" అని సమాధానం చెప్పడట.అంతే కాదండోయ్.. రింగ్ ఫింగర్ పొడవుగా ఉండే అబ్బాయిలతో అమ్మాయిలు లక్కలా అతుక్కుపోతారట. అతనితో జీవితం అత్యంత సురక్షితంగా ఉంటుందని, అతనో "మిస్టర్ రిలయబిల్" (నమ్మదగిన వ్యక్తి) అని కితాబులిచ్చేస్తున్నారు.ఇందులో పెద్ద ఆంతర్యం ఏమీ లేదండి..! వారు తమ పరిశోధనలో స్త్రీ, పురుషులలోని చేతివేళ్ల పొడవుల మీద టెస్టోస్టెరోన్ స్థాయిల ప్రభావంపై అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఉంగరపు వేలు పొడవుగా ఉండే పురుషులు దేన్నైనా పోటీగా తీసుకని కష్టపడని పని చేసి సాధిస్తారు. ఇలాంటి వారిలో టెస్టోస్టెరాన్ స్థాయి కూడా ఎక్కువగా ఉంటుందట.కెనడాకు చెందిన కాన్కార్డియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 415 మంది స్త్రీ, పురుషులపై పరిశోధన జరిపి ఈ విషయాలను ప్రకటించారు. అధిక టెస్టోస్టెకాన్, రిస్క్ తీసుకోవడం ఈ రెండు అంశాలపై వారు అధ్యయనం చేశారు. పురషులలో వినోదం (క్రీడలు), సామాజికం, ఆర్థికం అనే మూడు అంశాలపై వారు తీసుకునే రిస్క్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి