ఈ సంవత్సరం మే నెల వరకూ బృహస్పతి మీనం నందు ఆ తదుపరి అంతా మేషం నందు జూన్ 6వ తేదీ వరకూ ధనస్సు నందు రాహువు, మిధునము నందు కేతువు, ఆ తదుపరి అంతా వృశ్చికము నందు రాహువు, వృషభము నందు కేతువు, నవంబరు 15వ తేదీ వరకు కన్య యందు శని, ఆ తదుపరి అంతా తుల యందు సంచరిస్తారు.ఈ గ్రహ సంచారాన్ని గమనించగా ప్రజలలో నూతన ఆలోచనలు స్పురిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిత్యావసర వస్తు ధరలు గణనీయంగా పెరుగగలవు. రాజకీయ సంక్షోభం అధికం కాగలదు. ప్రజలలో పరస్పర అవగాహనా లోపం, విభేదాలు వంటివి అధికమవుతాయి. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు గురుమౌఢ్యమి ఉన్నందువల్ల ఇందు శుభకార్యములు చేయరాదు. ప్రాంతీయ తత్వాలు అధికమవుతాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి