* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

4, జనవరి 2011, మంగళవారం

రైతు సమస్యలపై చిరు పర్యటన

 ఓదార్పుయాత్రకు స్పందన అంతంతమాత్రమే
 పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు
సబ్బవరం(విశాల విశాఖ): రైతు సమస్యలపై ప్రజారాజ్యం పార్టీ అధినేత ఈ నెల 18వ తేదీ తర్వాత రెండు, మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు వెల్లడించారు. సబ్బవరంలోఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెందుర్తి నియోజకవర్గంలో సోమవారం జరిగిన జగన్‌ ఓదార్పుయాత్రపై వ్యాఖ్యానిస్తూ దీనికి జనస్పందన అంతంత మాత్రమేనన్నారు. స్వతహాగా వచ్చిన స్థానికులు తక్కువేనని, ఎక్కువ మంది డబ్బులిచ్చి తీసుకొచ్చినవారేనన్న విషయం తమ పరిశీలనలో తేలిందని అన్నారు. ఇందులో పాల్గొంటున్న కాంగ్రెస్‌ నాయకులు కూడా కాసేపు జగన్‌ వెంట ఉంటామంటూనే సాయంత్రానికి పార్టీ వీడేది లేదంటూ విరుద్దమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్‌ దిగువశ్రేణి కార్యకర్తల్లో అంతా గందరగోళం నెలకొందన్నారు. ప్రజాసమస్యలపై జగన్మోహనరెడ్డికీ సరైన అవగాహన లేనట్లుగానే ప్రసంగం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ప్రరాపా మండల అధ్యక్షుడు పీబీవీఎస్‌ఎన్‌ రాజు, స్థానిక నాయకులు గవర శ్రీనివాసరావు, అండిబోయిన బంగారయ్య, జి.కనకరాజు, కర్రి బంగారునాయుడు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి